cover

కినిగె పత్రిక కు విరామం - ఎడిటర్

ఇప్పటిదాకా చదువరుల ఆదరణతో విజయవంతంగా సాగిన కినిగె పత్రికకు ఈ నెల నుంచి విరామం ప్రకటిస్తున్నాం. పత్రిక మొదలుపెట్టినపుడు “కినిగె.కామ్”కు అనుబంధంగా, సాయంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మొదలుపెట్టినా త్వరలోనే దీని పరిధి విస్తరించింది. ఎంతో అవకాశం ఉన్న వెబ్ స్పేస్‍ను వీలైనంత పూర్తి పాఠ్యం …

cover

బుక్‌మైడెత్.కామ్ - హైదరాబాదీ

Download PDF   EPUB   MOBI రిసప్షన్ హాల్ మసకమసకగా ఉంది. గోడలకి నల్లరంగు పెయింట్ ఉన్నట్టుంది. దానికి తోడు లైట్లు డిమ్‌గా వెలుగుతున్నాయి. అదో రకం ముతక వాసన వస్తోంది. ఉక్కపోస్తుంది. వాళ్ళిద్దరూ సోఫాలో అసౌకర్యంగా ఉన్నా కూర్చునే ఉన్నారు. వాళ్ళని అక్కడ కూర్చోమని పూర్తి పాఠ్యం …

cover

ఇద్దరు మావయ్యల కథ - ఉణుదుర్తి సుధాకర్

Download PDF   EPUB   MOBI నాకిద్దరు మేనమావలున్నారని ఈ పాటికి గ్రహించి ఉంటారు. చాలా ఏళ్ల తరవాత వాళ్లిద్దర్నీ అర్జెంటుగా కలవాల్సిన పని పడింది. అందుకే ఈ హైదరాబాదు మజిలీ. ఒక కాన్ఫరెన్సు కోసం సింగపూరు వచ్చి అక్కడ రెండు రోజులు ఉన్నప్పటికీ అమెరికా పూర్తి పాఠ్యం …

cover

ముఖాముఖం - బి. అజయ్ ప్రసాద్

Download PDF   EPUB   MOBI చలికాలం మంచు ఇంకా గాలిని విడిచిపెట్టలేదు. ఉదయంపూట నల్లటి తార్రోడ్డుమీద నడుస్తూ ఉన్నాను. దారికి ఇరుపక్కలా ఏపుగా పెరిగిన చెట్లు. నడుము వరకు ఎడాపెడా పెరిగిన పచ్చిగడ్డి, పిచ్చి మొక్కలు. కొమ్మలకు వేలాడే పేరు తెలియని పూలు. రోజూ పూర్తి పాఠ్యం …

cover

ఒక మామూలు నాన్న కథ - ఆనందవర్ధన్

Download PDF   EPUB   MOBI డియర్‌ ఎ.వి (అవిజ వెంకటేశ్వరరెడ్డి) మీ నాన్న కోసం నీవు తీసుకొచ్చిన పుస్తకం నాకు నచ్చింది. కాకపోతే పుస్తకం నా చేతికి ఇచ్చిన వెంటనే నా అభిప్రాయం రాయమని కోరావు. నీవు ప్రేమగా అడిగావు, అంతే చనువుగా నేను పూర్తి పాఠ్యం …

cover

గాలి పొరలు - బి. కృష్ణకాంత్

Download PDF నిద్రలో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిందామె. ఆమె పక్కన – అతడు నిద్రలో వెల్లకిలా పడుకునే నోరుతెరిచి అరుస్తూ ఉన్నాడు. పడుకున్నవాడు పడుకున్నట్లుగానే ఉన్నాడు. కాళ్ళు చేతులు కదపటంలేదు. అ గొంతు అతడి గొంతులా లేదు. పీలమైన కేక. వికృతంగా ఉంది. కల పూర్తి పాఠ్యం …

cover

ఊరికే వీచే గాలులు - ఆర్. దమయంతి

Download PDF   EPUB   MOBI “అమీరింటికెళ్ళవూ?” కాఫీ గ్లాసందిస్తూ అడిగింది లత నన్ను. తను నా ఫ్రెండ్. నేను ఏమనీ చెప్పేలోపే మళ్ళీ తనే అంది, నా పక్కనే కూర్చుంటూ. “బాగుండదు. వెళ్ళు. కనిపించినప్పుడల్లా అడుగుతాడు. నీ గురించి. నువ్వొస్తే, తప్పకుండా కలవమని కూడా పూర్తి పాఠ్యం …

cover

జీవితం - వెంకట్ సందేశ్

Download PDF   EPUB   MOBI రాత్రిని రంపం పెట్టి కోసినపుడు రాలిన పొట్టు లాగుంది వేకువ.   ప్రకృతి ఒడిలోంచి నెమ్మదిగా లేచిన పక్షుల కువ కువ.   జీవిత నిత్యాగ్ని హోమం లో గతం నుసి. భవిష్యత్తు పారదర్శక అద్దానికి దట్టంగా పూసిన పూర్తి పాఠ్యం …

cover

మా కాలనీ పనమ్మాయి - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI మా వాడి స్కూల్లోని ఆయమ్మ వాడి టీచర్లకంటే స్టైలుగా ఉంటుంది. అలాగని నేను ఈమె గురించి ఏమీ రాయబోవడం లేదు. మరి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ‘పనమ్మాయి’ అనగానే వినబడే సౌందర్య ప్రతికూలత ఆమెలో ఉన్న ఆకర్షణను మసకబార్చకుండా పూర్తి పాఠ్యం …

cover

కంటిని ఈ కంటను కంటిని సీతను - కనక ప్రసాద్

Download PDF    EPUB    MOBI రాగం: వసంత ఆదితాళం తమిళ మూలం: అరుణాచల కవిరాయరు తెలుగు: కనక ప్రసాద్ గానం: శ్రీవిద్య బదరీనారాయణన్   | పల్లవి | కంటిని ఈ కంటను కంటిని సీతను కంటినీ రాఘవా   | అనుపల్లవి | ఎవ్వరు చొరరాని లంకా పుర పూర్తి పాఠ్యం …

cover2

అర్బన్ ఫెమినిజం – ధోరణులు – దారుణాలు - పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF   EPUB   MOBIమార్గరిటా విత్ స్ట్రా ’ అని షొనాలి బోస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ఈ మధ్యే రిలీజ్ అయ్యింది. ఇందులో ఇతివృత్తమంతా ‘సెరిబ్రల్ పాల్సి’ ఉన్న స్త్రీ కేరక్టర్ చుట్టూ. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు immobility, నత్తి లాంటి పూర్తి పాఠ్యం …

coverwtht

వీరో వోండా - నామిని

Download PDF   EPUB   MOBI మిట్టూళ్లో ఆడోళ్లు దేశమ్మ యింటికి రావాటంగా, పోవాటంగా వుండారు. యీ రామందాడిని చూస్తా వుంటే మొగుడి మొకాన కేకరించి ఎంగిలూంచాలనిపిస్తా వుండాది దేశమ్మకు. వొస్తాపోతా వుండే ఆడోళ్లు మాత్రం అనాల్సిందేదో అనేసి, దేశమ్మ మొకాన్నే కారిమూంచేసి పోతుండారు. వాటికేమి? పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – మే 2015 సంచిక - కినిగె

కినిగె పత్రిక మే 2015 సంచిక కథ: > వీరో వోండా – నామిని సుబ్రమణ్యం నాయుడు > గాలి పొరలు – బి. కృష్ణకాంత్ > ఊరికే వచ్చే గాలులు – ఆర్. దమయంతి > రికర్సివ్ రామాయణం – పూర్తి పాఠ్యం …

Top10_1stMay2015_720_380

మే 2015 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

top10_27thApr2015_720_380

ఏప్రిల్ 2015 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

“వేగం నా చేతిలో కాదు, మనసులో ఉంది” ~ గోపి తో ఇంటర్వ్యూ - Kinige

  Download PDF    EPUB   MOBI ఈ నలభై ఏళ్ళూ హైదరాబాదులో లెక్కలేనన్ని అద్దె ఇళ్ళు మారిన తర్వాత – గోపీ ఈ నెలే సొంత ఇంటికి చేరారు. కానీ ఈ నాలుగు అంతస్తుల ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. డబ్బు ఇబ్బందులూ, తీరని పూర్తి పాఠ్యం …

cover

నీ నవ్వు..! - రామదుర్గం మధుసూదన రావు

నిశ్శబ్దం పరిచిన నీడలో నా ఉనికి మాయమవుతున్న వేళ నాలోని నిన్ను చూపిన దివిటీ… నీ నవ్వు!   కలలు కొడిగట్టిన కళ్ళల్లో కన్నీటి బిందువు ఇంకుతున్న వేళ సంతోష సింధువై ప్రవహించింది… నీ నవ్వు!   ఏకాంత శిలువను మోస్తూ పూర్తి పాఠ్యం …

cover

ప్రపంచానికి ఆఖరు రాత్రి - శేఖర్ ముత్యాల (మూలం: రే బ్రాడ్బరి)

Download PDF   EPUB   MOBI “ప్రపంచానికి ఇదే ఆఖరు రాత్రయితే ఏం చేస్తావు?” “సరదాకి అడుగుతున్నావా?” “నిజంగానే.” “ఏమో తెలీదు – ఎప్పుడూ అలా ఆలోచించలేదు.” ఆమె రెండు టీ కప్పులతో నడిచి వచ్చి తానూ డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చుంది. ఒక కప్పు పూర్తి పాఠ్యం …

Top10_18thApr2015_720_380

ఏప్రిల్ 2015 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover2

గీత - ఇంద్రాణి పాలపర్తి

గీతలన్నీ నీటి రాతలని మిడిసిన భ్రమిసిన యవ్వనాలలో   పెనుగాలుల్లో జడి వానల్లో ప్రయాణమై నే   వడి వరదల్లో పడి బురదల్లో చిక్కుకుపోతే   నమ్మిన నౌకలో చోటు లేదని వేడి అన్నము నాకు కాదని ప్రేమ వడ్డన అసలు పూర్తి పాఠ్యం …

cover

మిగిలిపోయిన పావురం - అనురాధ నాదెళ్ళ

Download PDF   EPUB   MOBI పూర్తిగా తెలవారేందుకు ఇంకా సమయమున్నట్లే ఉంది. చుట్టూ ప్రకృతి చిరుచీకటి ముసుగులో నిశ్శబ్దంగా ఉంది. ఆనందరావు తన యాత్ర మొదలు పెట్టేడు. నడుస్తున్నాడు. ఎదురుగా కొన్ని వందల మెట్లు. ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాడు. ఇంతేనా, ఈ కాసిని మెట్లేనా పూర్తి పాఠ్యం …

cover

నిన్నటిపువ్వు - శివాజీ

Download PDF   EPUB   MOBI పరమ మామూలు పాత టెక్నిక్‌తో 8 ఎం.ఎం అద్దంలో 16 ఎం.ఎం స్థాయిలో నా ముఖానికి కాస్తంత పౌడరు అద్ది చూశాను. దువ్వెన్న తీసేను. దానికి చుట్టుకున్న నా చిన్న కూతురు తాలూకు చిక్కువుండని చికాగ్గా తీసి పడేసేను. పూర్తి పాఠ్యం …

cover1

పావురమైన వాన - స్వాతి కుమారి బండ్లమూడి

అటుదిక్కు ఆ వంక మూసుకొచ్చింది ఏ పక్కకో మరి ముసురేసి పోయింది తాటిమానులమీద తారంగమాడింది తేనీటి మాపులో తెర్లిపోయింది   మడుగుల్లో దూకింది అడుగుల్ల గెంతింది దడిచుట్టు కొట్టింది తడిముద్ద చేసింది తీగల్లొ వాగుల్లొ పిలిమొగ్గలేసింది   నీమీద నామీద కన్నేసి పూర్తి పాఠ్యం …

Top10_12thApr2015_720_380

ఏప్రిల్ 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover2part

“వచనమూ కవిత్వమూ Siamese twins లాంటివి” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (2) - Kinige

Download PDF   EPUB   MOBIదీని ముందుభాగం  * మీకు సినిమా అంటే చాలా ఇష్టం కదా. మీ కవిత్వంలో ఇమేజెస్‌పై సినిమా ప్రభావం ఎపుడన్నా గమనించారా? కవిత్వాన్ని ప్రభావితం చేసే మిగతా కళలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకీ సినిమా ముఖ్యమైంది. ఎందుకంటే సినిమా అన్ని పూర్తి పాఠ్యం …

cover2

“స్పష్టత అనేది కవిత్వానికి ఒక తిట్టు” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (1) - Kinige

Download PDF   EPUB   MOBI అల శాంతిశిఖర అపార్ట్‌మెంట్స్‌లో ఆ మూల ఇరుకుగదిలో పుస్తకాలు ఆక్రమించగా మిగిలిన ఖాళీలో కొవ్వొత్తి వెలుగులో మూడు సిట్టింగుల్లో ఈ ఇంటర్వ్యూ జరిగింది. సిద్ధార్థ కరుకు ముఖానికీ ఆయన మెతక వ్యవహారానికీ అస్సలు పొంతన ఉండదు. కనీసం ఆ ముఖమైనా పూర్తి పాఠ్యం …

cover

ఏక వస్తు పద్ధతి - బాడిశ హన్మంతరావు

Download PDF   EPUB   MOBI సమయం సాయంత్రం పావు తక్కువ ఆరు. రమణి పోరు పడలేక చేతిలో గుడ్డ సంచితో బజారున పడ్డాడు రాంబాబు. “వస్తూ వస్తూ కూరగాయలో, పండ్లో పట్టుకు రావచ్చు గదా! వచ్చిన తరువాత మాత్రం బయటికి పోనని నీలుగుతావ్!” అంటూ పూర్తి పాఠ్యం …

cover

భూచక్రం అను ఒక Eternal Drama - కాకుమాని శ్రీనివాసరావు

Download PDF   EPUB   MOBI ఇది ఒక భూమి కథ. అంతేనా? విభిన్న మానవ చిత్త ప్రవృత్తుల మధ్య ఎప్పుడూ నలుగుతూ అంతంలేకుండా తిరిగే కథ.. సర్వకాలాల్లోనూ జరిగే ఈ కథకి రచయిత తీసుకున్న నిర్దిష్టకాలం ఒక వంద సంవత్సరాలు. ఈ కాలంలో రచయిత పూర్తి పాఠ్యం …

Top10_3rdApril2015_720_380

ఏప్రిల్ 2015 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

టారు - కనక ప్రసాద్

ఒకళ్ళు – మందుకొట్టి ఓ మూల పడుకున్నా నిండా తెలిగేసినట్టే ఉంటారు.   ఇంకోళ్ళు – కళ్ళింత విచ్చుకుని చూస్తున్నా కునికిపాట్లు పడుతునట్టే ఉంటారు.   వీళ్ళు – పుష్కరిణీ స్నానాలు చేసొచ్చీ దుస్సు కంపు కొడుతునట్టుంటారు.   ఒకొక్కళ్ళు – పూర్తి పాఠ్యం …

cover

బ్రాహ్మణవాది కంచ ఐలయ్య - రాణి శివశంకర శర్మ

Download PDF   EPUB   MOBI ‘వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ’ అనే మౌలిక ప్రశ్నను రేకెత్తించిన ఐలయ్య, చివరికి ఆ ప్రశ్నని బ్రాహ్మణ వాదంలో లయం చెయ్యడం నేటి విషాదం. ఫాసిజం డైనమిక్‌గా పనిచేస్తుంది. అది తర్కం కోసం సమయాన్ని వెచ్చించదు. అప్పటికే పూర్తి పాఠ్యం …

cover

అతను వొస్తే బాగుండు - నాగరాజు అవ్వారి

Download PDF   EPUB   MOBI కొండ మీద సన్నని మంట పాకుతా ఉంది. ఎర్రగా కాలుతూ, దారంటా పాకుతూ ఉండడం తను అదే పనిగా కిటికీలోంచి చూస్తున్నాడు. వారం రోజుల నించి, తను గది దాటి బయటకు రాలేదు. ఈ వారం రోజులూ మంచం పూర్తి పాఠ్యం …