cover

జీవితం - వెంకట్ సందేశ్

Download PDF   EPUB   MOBI రాత్రిని రంపం పెట్టి కోసినపుడు రాలిన పొట్టు లాగుంది వేకువ.   ప్రకృతి ఒడిలోంచి నెమ్మదిగా లేచిన పక్షుల కువ కువ.   జీవిత నిత్యాగ్ని హోమం లో గతం నుసి. భవిష్యత్తు పారదర్శక అద్దానికి దట్టంగా పూసిన పూర్తి పాఠ్యం …

cover

నీ నవ్వు..! - రామదుర్గం మధుసూదన రావు

నిశ్శబ్దం పరిచిన నీడలో నా ఉనికి మాయమవుతున్న వేళ నాలోని నిన్ను చూపిన దివిటీ… నీ నవ్వు!   కలలు కొడిగట్టిన కళ్ళల్లో కన్నీటి బిందువు ఇంకుతున్న వేళ సంతోష సింధువై ప్రవహించింది… నీ నవ్వు!   ఏకాంత శిలువను మోస్తూ పూర్తి పాఠ్యం …

cover2

గీత - ఇంద్రాణి పాలపర్తి

గీతలన్నీ నీటి రాతలని మిడిసిన భ్రమిసిన యవ్వనాలలో   పెనుగాలుల్లో జడి వానల్లో ప్రయాణమై నే   వడి వరదల్లో పడి బురదల్లో చిక్కుకుపోతే   నమ్మిన నౌకలో చోటు లేదని వేడి అన్నము నాకు కాదని ప్రేమ వడ్డన అసలు పూర్తి పాఠ్యం …

cover1

పావురమైన వాన - స్వాతి కుమారి బండ్లమూడి

అటుదిక్కు ఆ వంక మూసుకొచ్చింది ఏ పక్కకో మరి ముసురేసి పోయింది తాటిమానులమీద తారంగమాడింది తేనీటి మాపులో తెర్లిపోయింది   మడుగుల్లో దూకింది అడుగుల్ల గెంతింది దడిచుట్టు కొట్టింది తడిముద్ద చేసింది తీగల్లొ వాగుల్లొ పిలిమొగ్గలేసింది   నీమీద నామీద కన్నేసి పూర్తి పాఠ్యం …

cover

టారు - కనక ప్రసాద్

ఒకళ్ళు – మందుకొట్టి ఓ మూల పడుకున్నా నిండా తెలిగేసినట్టే ఉంటారు.   ఇంకోళ్ళు – కళ్ళింత విచ్చుకుని చూస్తున్నా కునికిపాట్లు పడుతునట్టే ఉంటారు.   వీళ్ళు – పుష్కరిణీ స్నానాలు చేసొచ్చీ దుస్సు కంపు కొడుతునట్టుంటారు.   ఒకొక్కళ్ళు – పూర్తి పాఠ్యం …

COVER

ఈ జీవితాలు - ఇంద్రాణి పాలపర్తి

ఏ జ్ఞాన యోగాలు? ఏ కామ కేళికలు? ఏ దిగుడు కోరికలు? ఏ చదువు సారాలు? ఏ జీవితాలు?   ఆ  వెకిలి రొదలు ఈ మకిలి పొగలు ఆ  కూలి రాతలు ఈ నోటు రోతలు ఈ జీవితాలు?   పూర్తి పాఠ్యం …

cover

ఒక ఏకాంత వేళ! - రామదుర్గం మధుసూదన రావు

నల్లని చాయంచున మెరుస్తున్న సాయంసంధ్యా కాంతుల్లో నీ నవ్వుల జలపాతం జాలువారుతుంటుంది..!   ఇంటి పిట్టగోడపై వాలిన పావురాల రెక్కల చప్పుడులో నీ మాటల సవ్వడి సందడి చేస్తుంటుంది..!   ఊరి చివర కాలువ గట్టున చెంగున దూకే చిన్నారుల కేరింతల్లో పూర్తి పాఠ్యం …

bhavaniphani cover

ఓ ‘కొమ్మ’ కథ - భవానీ ఫణి

నల్లని నవరత్నాల్ని పొదువుకున్న కేశాల కిరీటం కింద మచ్చలన్నీమాపుకుని మెరుస్తోన్న చంద్రబింబం ఆ నుదురు   నిప్పుల స్వప్నాల్లో పడి కాలిపోయిన నిదుర తోటల వెనుక చీకటి రంగులో వెలిగేవి అవి కనుపాపలు   కన్నీటి మబ్బుల్తో గడ్డకట్టిన కళ్ళ అంచుల పూర్తి పాఠ్యం …

bhagavantham cover

శబ్దాలంకారం - భగవంతం

మాటల్ని ఎలాగూ చెవికెక్కించుకోవు పాటనైనా చెవిని ఆలకించనివ్వు ఎందుకంటే – లోకంలో స్త్రీ, సంగీతం లేకపోతే ఉరేసుకుని వెళ్ళిపోవాల్సిన దుస్థితి కొందరి పురుషులది *** పాటని కాకపోయినా పాట అవతలి నిశ్శబ్దాన్నైనా చెవిని ఆహ్వానించనివ్వు. ఎందుకంటే – స్త్రీ తిరస్కరించిన లోకంలో పూర్తి పాఠ్యం …

cover

తడి కోర్కె - పి. రామకృష్ణ

అస్తమానం వర్షంలో తడుస్తున్నాడని పిల్లాడిని తిట్టకలా! వచ్చే  జన్మంటూ వుంటే వాడు- నీ ‘కొడుగ్గా’ కాదు, పంతంకొద్దీ ‘గొడుగ్గా’ పుట్టగలడు!! * Download PDF   EPUB   MOBI

cover1

యావజ్జీవం - కనక ప్రసాద్

చిత్తు కాయితం మీదో ఉత్తి కూనిరాగం లాగో నిలవనీయకుండా సలపరించే పుండో ఎటూ తోచని రాత్రి కటికి చీకట్లోకే అదాట్న కిటికీ తీసి అనాది ప్రశ్నల గంప తలకెత్తుకు మోస్తావో సమాధి శిలువల స్మృతులు తలొగ్గి మూచూస్తావో మసి చేతుల తడి పూర్తి పాఠ్యం …

cover

విందు - ఇంద్రాణి పాలపర్తి

జిలుగు చీరంచు​న ​వాలనీ కలకల ​నవ్వులని   అద్దుకోనీ బుగ్గలని మోహాల లేపనాలని   మసక దీపాల వెలుగుని దొంగిలించనీ చూపుల కౌగిలింతని   వగలు పోనీ చెవి లోలాకులని   పాటల చెలమల్లో తడవనీ కాళ్ళని హొయలు పోనీ వేళ్ళని పూర్తి పాఠ్యం …

cover2

నీలె నీలె అంబర్ పర్..! - మోహన్ రుషి

అర్ధరాత్రో, అపరాత్రో, సమయంతో సంబంధం లేదు. మెలకువొచ్చి నిద్ర పట్టనప్పుడు చీకటి కళ్ళలోకి సూటిగా చూడ్డం నేర్వాలి.   ఆశలన్నీ అడుగంటినప్పుడు తోడొచ్చిన అశ్రువుని మన ఆత్మబంధువుగా తలవాలి. కొత్త రేపటిని తెరవాలి.   నమ్మినవారే పువ్వుని కోసినా సాధ్యమైనంత తొందరగా పూర్తి పాఠ్యం …

cover

ముద్ద - నాగరాజు అవ్వారి

1 తన తోకను తానే తింటూ ఉంటాయి పాములు చుట్టలు చుట్టలుగా సున్నాలు సున్నాలుగా   రోజులకు అవల పాడుతోన్న గొంతుకతో ముడతలు దేలిన దేహపు ఒకలాంటి వాసనతో జేజి అంటోంది కదా కాలచక్రమిది నాయనా తిరిగి తిరిగి వచ్చు మలిగిన పూర్తి పాఠ్యం …

Axix Mundi

రెండు కవితలు - మూలా సుబ్రహ్మణ్యం

1. . సగం చెరిపేసి సగం అలికేసినట్టున్న నిన్నటి రాతలు . అతనొచ్చీ రాగానే అంతా తుడిచేస్తాడు . చిక్కని ఆకాశంలో చుక్కలు పొడిచినట్టు అతని అక్షరాలు! 2. . మెల్లగా మెల్లగా మెల్లగా ఒక్కో పువ్వూ విచ్చుకుంటుందని . తవ్వగా పూర్తి పాఠ్యం …

cover

నియతి - సిద్ధార్థ

మాయమ్మ నన్ను కడుపున పడేసుకున్నప్పుడే. . . నా గుండెలో. . . వొక పుండు పుట్టింది నాలోనే పెరిగి పెద్దదయి నా నీడయి తోడయ్యింది అదెలాగుంటదంటే. . ఏం జెప్పాలె కనుపాపలోని జింగన్న పురుగులాగా ఉంటుంది ఈ లోకమంతా . పూర్తి పాఠ్యం …

cover

రోజు గడిచింది - గోపి గారపాటి

. వద్దన్నా వచ్చి గుద్దేస్తుంది. . బళ్ళో లెక్కల మాష్టారిలా నిన్న రాని లెక్కనే మళ్ళీ చేసుకురమ్మని అదే పాత క్లాసు రూము బయటికి, గెంటేస్తుంది. . కుక్క మెడలో కట్టిన ఎముక లాగా ఎంత గింజుకున్నా జానెడు పొట్టని మించి పూర్తి పాఠ్యం …

cover

మగ బుద్ధి - పసునూరు శ్రీధర్ బాబు

. పెదవి మీదో చుబుకం మీదో చెక్కిలి మీదో గెలాక్సీలు దాచిన కళ్ళ మీదో తిరగేసిన సంధ్యాకాశం లాంటి వీపు మీదో నయాగరా ప్రవాహాలకు నునుపెక్కిన భుజాల మీదో నెమలి పింఛాలకు జన్మనిచ్చే నడుం మీదో వీధుల్ని మార్మోగించే సంగీత సహారాల పూర్తి పాఠ్యం …

cover

తిరిగి చూడని అద్దం - ఎం. ఎస్. నాయుడు

దారం లోపలి నీడ కన్నెప్పటికి తెరుస్తుంది పదాల ఇంద్రియాలతో వాక్యాల్ని తెరిచే జ్ఞాపకాలు పిరికివాళ్ళతో సూర్యాస్తమయాల్ని వృధా చేయాలి రాత్రుల్ని మోసగించాను చూడని రాత్రికోసం అశాస్వత స్పర్శలు నిశ్శబ్దాలు, స్త్రీలు తెలిస్తే తిరిగి చూడని అద్దం చూడాలనుకున్న అద్దం ఏది అక్షరాల్లోని పూర్తి పాఠ్యం …

cover

అభావప్రాప్తి - నరేష్ నున్నా

కెంపుజీరల చూపు కైమోడ్పుల పిలుపవుతుంది …ఆకర్ణాంత భీతితో …కళ్ళు మిటకరిస్తాయా? పొటమరించే మోహం పటిక చెమటల పలుకవుతుంది …ఊపిరందని భయంతో …ముచ్చెమట్లు పోస్తాయా? తీగసాగే స్పర్శ అనుకంపనరాగమవుతుంది …వణికేవొంటి మీంచి …వెన్నుపూస నిచ్చెన్లు జారిపోతాయా? ***    ***    *** పాలనురగల దేహం మీద మీగడ పూర్తి పాఠ్యం …

cover

ఏం చేయగలం - డా. వంశీధర్ రెడ్డి

. అనంతటి ఆకాశాన ఇంతటి భూమ్మీద ఆలోచించడమే ఒక భ్రమ అని తెలిసీ మానలేని నిశ్శబ్దపు ముక్కలం మనం, ఏం చేయగలం నీడల్ని అతికించుకోడం తప్ప, . ఇంకేమైనా పనుందా మనకిక్కడ ఏమంటావ్, ఎప్పటికప్పుడు వీపు మోయలేని కలల్ని కాల్చేసుకోవాలి అనుభవాలెప్పటికీ పూర్తి పాఠ్యం …

cover

ఆమెని చుట్టుకుని - సాయి కిరణ్

. ఆమె అణువణువు పైనా మెత్తగా పరుచుకున్న నా తనువు నా రంగుల్లో కళ్ళని ముంచి ఆమె వెలువరిచే ‘చిత్ర’మైన అహంకారాలు తన ఒంపుల్లో చిక్కుకున్న నా ఊపిరి నిండా నిప్పుల సుగంధాలు . ఆ పాదాల పైనో, పట్టీల మువ్వలపైనో పూర్తి పాఠ్యం …

COVER

అద్దం లోపల - భవానీ ఫణి

. వెన్నెల తాయిలమంతా తింటే తిన్నావు చూడెలా అంటుకుందో తెల తెల్లగా మధ్య మధ్య మబ్బుల్తో మొహం తుడుచుకోవద్దూ . కొమ్మ కొమ్మపైనా చిరునవ్వుల పిందెలే అమ్మవుతున్నావన్న ఆనందమేమో ఓ అడుగు ముందే చిలక్కొట్టేస్తే మాత్రం… చెదిరిపోవాలా ఏంటి . అద్దం పూర్తి పాఠ్యం …

COVER

వెళ్లిపోయింది - మమత

చాల పక్షుల కళ్ళు గప్పి దాక్కుని ఆరుసార్లు తనలోంచి తనను చీల్చుకుని, చివరికి తనలోంచే తాను పునర్జన్మించి అప్పుడప్పుడే తడి ఆరిన రంగురంగుల రెక్కలను కను రెప్పల్లా తాటించి తానింకా బతికేవుండడం తానే నమ్మలేనట్లు విప్పార్చి పచ్చటి మైదానంలో పూల కోసం పూర్తి పాఠ్యం …

cover

ఎవరెవరు - బివివి ప్రసాద్

ఎవరెవరు వెళ్లిపోదలచారో వెళ్లనివ్వు నీ జీవితంలోంచి వెళ్ళిపోవటాలు చూడటానికే నువ్వొస్తావు   ఒకానొక కాలం నిన్నొక వాకిలి చేసి నిలబెడుతుంది ఎవరెవరో పని ఉన్నట్టే నిన్ను దాటి హృదయంలోకి వస్తారు, నీలో వెదుకుతారు వాళ్ళు నీ వాళ్ళని అనుకొంటూ ఉండగానే ఇక్కడేమీ పూర్తి పాఠ్యం …

cover

పొద్దుటి ఆకాశం - మోహనతులసి రామినేని

Download PDF    ePub    MOBI గోడ గడియారం చప్పుడుతో ఇంకోసారి స్నేహం కిటికీ పరదాల మీద సూర్యుడుకి అడ్డొచ్చిన ఆకుల నీడల్లో కదులుతున్న కధలు గాజుతలుపెనకున్న నన్నే చూస్తూ, వరండాలోని కుదురు లేని ఉడుత కొన్ని పయనాల కొలమానంగా పైన పోతున్న విమానమొకటి అప్పుడప్పుడూనే పూర్తి పాఠ్యం …

cover

ఏ పని చేస్తున్నా… - కొండేపూడి నిర్మల

తల చుట్టూ మల్లెదండలు వేలాడదీసిన ముస్లిం పెళ్ళికూతురులా కవిత్వం రాస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా ఆ పూలరేకుల వత్తిడి తగులుతూనే వుంటుంది తలుపుతీసి కొరియర్ అందుకుని నాలుగక్షరాలు గిలుకుతానా సంతక౦ కవిత్వం వాసనేస్తుంది కూనిరాగం తీస్తూ వంటింట్లో కొచ్చి కాఫీ కలిపి పూర్తి పాఠ్యం …

cover

పిట్ట పోరు - కనక ప్రసాద్

. నా బుష్కోటు జోబీ కింద చిన్నిది పాల పిట్టొకటుంది దానికి బైటికొద్దామనుంది అబ్బా అలా ఉండు! అన్నాను తగు మనుషుల్లోకి ఎందుకనీసి . కొత్తది లెదర్ వాలెట్ కింద ఒకటే రెక్కలాడిస్తుంది గదిలో ఎగురుతానంటుంది కర్చీఫ్ సున్నితంగా నొక్కి కదలొద్దొసేయ్ పూర్తి పాఠ్యం …

cover

అమ్మ సంతకం - దాసరాజు రామారావు

. మరచిపోయిన అమ్మ మళ్ళా మతిల కొచ్చింది మరణించిన అమ్మ ఆనాటి సంతకంలోంచి పుట్టుకొచ్చింది వణుకుతున్న చేతివేళ్ళ మధ్య పెన్నును బిడ్డలా పొదవుకొని బతుకు మీది తీపినంతా తన పేరులో రంగరించి నా డైరీలో ప్రతిష్టించింది సంతకంలా – ఎవరూ వూహించి పూర్తి పాఠ్యం …

cover

దారి మధ్యలో… - టి . శ్రీవల్లీ రాధిక

. ఆచితూచి మాట్లాడిన ప్రతిమాటకీ అమృతం కురియ లేదంటావా! ఆప్తులెవరూ నొచ్చుకోలేదన్న ఆనందం చాలదూ! . అతిజాగ్రత్తగా చేసిన ప్రయాణంతో అమరత్వం చిక్కలేదంటావా! అడుసెపుడూ తొక్కలేదన్న అతిశయం చాలదూ! . అనుష్టించిన ప్రతిమంత్రం ఆగమ రహస్యాన్ని విప్పలేదంటావా అలౌకికాన్ని లక్ష్యించిన అనుభవం పూర్తి పాఠ్యం …

avela

అవేళ - కనక ప్రసాద్

. పాపతల్లి నన్నవేళ ముద్దు పెట్టుకుంది లోపట్నుండి అస్సలేమీ ఎరగనట్టే వొచ్చి. . కాలుడా! నంగనాచి నీ తాళపత్ర పటమ్మీద రాసుకో ఆవర్జా నా పాప పుణ్య గణన – చితికున్న మనిషిననీ బతికి చెడ్డ వాణ్ణనీ దాపరికం దేనికి? ఒఠ్ఠి పూర్తి పాఠ్యం …

cover

మన ఇద్దరి మధ్య - మోహిని కంటిపూడి

. మండుటెండకి రాలిపడిన ఎండుటాకులు గరగరలాడినట్లు వేడి వేడి మాటల్ని ఒకరి మీదొకరు వాడిగా రువ్వుకున్నాక పడకగది రెండు మూలల్లా, పందిరిమంచం రెండు కోళ్ళలా సమాంతరమై మిగిలిన రాత్రిని సాగదీస్తూ.. మనం . గాలికి రెపరెపలాడుతున్న కొవ్వొత్తి ఆఖరి వెలుగులాగ ఎద పూర్తి పాఠ్యం …