kavitha jpeg

అంతిమ మంతనం

Download PDF     ePub    MOBI

ఒకదాని వెంట ఒకటిkavitha

నన్నల్లుకుని నలువైపులా

పుష్పించిన నక్షత్రాలన్నీ

ఈ రాత్రికి లిఖిత సాక్ష్యాలు

 

ఒక మహత్తర నిశ్శబ్దంలో

తెల్లవార్లు మేలుకొని వున్నాను

మునుపటి ఎడబాటుని దాటిపోవు

సత్యపూర్ణ చంద్రుడినే నేను

 

పూర్వజన్మలో వంటి

ఆ దూర ప్రాంతపు చెలియ

ఓ అమాయక చెంగలువ మల్లే

మొగ్గ రేకులుగా

పరాగ రేణువుల గుసగుసగా

మొదటి ప్రేమ పుట్టిన విధం

ఈనాటికి

పాటకట్టి అపురూపంగా ఆలపిస్తోంది

 

చిరంతన

అవ్యక్త హృదయ రహస్యాన్ని

ఆమె ప్రణయ గానంతో

ప్రకటించిన క్షణం. . .

 

ఈ వంచక ప్రపంచంతో

నాకు పని తీరిపోయింది.

– నామాడి శ్రీధర్

 Download PDF     ePub    MOBI

Posted in 2014, కవిత, జనవరి and tagged , , , .

2 Comments

  1. ” ఓ అమాయక చెంగలువ మల్లే
    మొగ్గ రేకులుగా
    పరాగ రేణువుల గుసగుసగా
    మొదటి ప్రేమ పుట్టిన విధం
    ఈనాటికి
    పాటకట్టి అపురూపంగా ఆలపిస్తోంది “.

    చాల చక్కని భావం, అధ్బుతమైన కవిత.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.