Kinige_logo

కినిగె కొత్త ఫీచర్లు

కినిగెని అభిమానిస్తున్న తెలుగు పాఠకులకు హృదయ పూర్వక అభివందనాలు.

మీకు మరిన్ని సేవలందించడానికి కినిగె ఎప్పుడు కృషి చేస్తునే ఉంటుందన్నది మీకు తెలుసు! అందులో భాగంగానే కినిగె ఇప్పుడు మీకు రెండు సరి కొత్త ఫీచర్స్‌ని అందిస్తున్నది.

కినిగె రేటింగ్

ఒక పాఠకుడిగా మీ అభిప్రాయం కినిగెకి మాత్రమేగాక, కినిగెతో పయనిస్తూన్న మీ తోటి పాఠకుడికి, రచయితకి, ప్రచురణకర్తలకి ఎప్పుడూ శిరోధార్యమే! అందుకనే మీ అభిప్రాయాన్ని నిర్భయంగా వెలిబుచ్చడానికి మీకు “కినిగె రేటింగ్” శీర్షికని అందిస్తున్నది. ప్రపంచమంతా ఆచరిస్తున్న ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫీచర్ ఇప్పుడు మీకు అందుబాటులోకి తెచ్చింది మీ కినిగె.

మీరు చదివిన ప్రతి పుస్తకం మీద ఇప్పుడు మీరు మీ “ఐదు నక్షత్రాల రేటింగ్” తో మీ అభిప్రాయాన్ని తెలియజేసుకోవచ్చు. ఈ రేటింగ్ రెండు విధాలుగా ఉంటుంది.

జెనరల్ రేటింగ్

ఈ పద్ధతిలో మీరు పుస్తకాన్ని చదివివుంటే రేటింగ్ ఇవ్వవచ్చు. మీరు అత్యంత అద్భుతమైన పుస్తకం అని భావిస్తే ఆ పుస్తకానికి మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వవచ్చు. మీరు కొంచెం మెచ్చిన దానికి టూ స్టార్ రేటింగ్ ఇవ్వవచ్చు. ఇలా ఒకటి నుంచి ఐదు లోపు “స్టార్ రేటింగ్” ఇచ్చుకోవచ్చు. మీరు కినిగె‌లోనే ఆ పుస్తకాన్ని అద్దెకి తీసుకుని గాని, కొని గాని చదవాలన్న నియమం లేదు. ఇది కినిగె లోని సభ్యు లందరికి వర్తిస్తుంది.

five star rating image

ప్రీమియర్ రేటింగ్

కినిగెలోనే పుస్తకాన్ని అద్దెకు గాని, కొని గాని చదువుకున్న పాఠకుడికి ప్రత్యేకం ఈ “ప్రీమియర్ రేటింగ్”. అంటే మీరు మీరు కినిగెలో సాధారణ సభ్యులే కాదు, కినిగె లో పుస్తకాన్ని అద్దెకు తీసుకుని గాని, కొని గాని చదివి దాని మీద మీ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ప్రీమియర్ రేటింగ్ కి అర్హులు. ప్రీమియర్ రేటింగ్ కి అర్హులైన సభ్యులు, జెనరల్ రేటింగ్ కి కూడా అర్హులు. మీ రేటింగ్ అప్పుడు రెండు సార్లు నమోదు అవుతుంది.

గోప్యత

కినిగె తన సభ్యుల గోప్యతని ఎప్పుడూ కాపాడుతుంది. కాబట్టి ఒక్క మీ రేటింగ్ తప్ప, మీ పేరు మీ ఇతర వివరాలు బహిర్గతమవ్వవు! అది జెనరల్ రేటింగ్ కానివ్వండి ప్రీమియర్ రేటింగ్ కానివ్వండి!!
ఇక ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ వల్ల ఆ పుస్తకం మీద ఇతర పాఠకుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం సులభం!
ఎవరు చదవని పుస్తకాన్ని మీరే చదివి తొలి అభిప్రాయాన్ని నమోదు చేసుకోవచ్చు.
మీరు చదవని ఇతరులు మెచ్చిన పుస్తకాన్ని తెలుసుకుని మీరే చదువుకోవచ్చు!
మీరు మెచ్చిన పుస్తకం పైన ఇతర పాఠకుల అభిప్రాయాన్ని కూడ గమనించవచ్చు!

మీ పుస్తక పఠనం మరింత ఆసక్తి కరంగా ఉండబోతున్నది వాస్తవం! కదూ?!
ఇక ఆలస్యం ఎందుకు!
కినిగెని దర్శించండి.
మీ ఫైఫ్ స్టార్‌ రేటింగ్ ఫీచర్ ని ఉపయోగించండి.
ప్రపంచానికి మీ అభిప్రాయాన్ని తెలియజేసుకోండి!!!

లాగిన్ విత్ ఫేస్ బుక్

పాస్ వర్డ్ గుర్తుంచుకోవడం కష్టం. అలాంటిది పదుల్లో వందల్లో పాస్ వర్డ్ లు గుర్తుంచుకోవడం మరీ కష్టం. అన్నింటికీ ఒకటే పెడితే అది మరో కష్టం. పాస్ వర్డ్ గుర్తుంచుకునే ఇబ్బంది వుండేవారికి ఒక గుడ్ న్యూస్!
fb login screenshot
కినిగె లోకి ఇప్పుడు మీరు ఫేస్ బుక్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. ఈ పాటికే మీకు కినిగె లాగిన్ ఉంటే దాన్నే వాడుకోవచ్చు, లేదా దానికి ఫేస్ బుక్ లాగిన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈపాటికే మీకు కినిగె లాగిన్ ఉంటే, మీరు కినిగెలో లాగిన్ అయి, ఎడమవైపున కనిపించే ఎనేబుల్ ఫేస్ బుక్ మీట నొక్కితే సరి. ఈ ఫేస్ బుక్ లాగిన్ ద్వారా మరో లాభం ఏమిటంటే, మీరు మీ వాల్ పై కినిగె టపాలు పంచుకోవచ్చు. మీరు కినిగెలో ఈపుస్తకం కొన్నప్పుడు, అద్దెకు తీసుకున్నప్పుడు, ఉచిత మునుజూపు చదువుతున్నప్పుడు, వ్యాఖ్యానించినప్పుడు, రేటింగ్ ఇచ్చినప్పుడు ఆ విషయం ఆటోమేటిగ్గా మీ వాల్ కు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ కినిగె అకౌంటుకు ఫేస్ బుక్ అకౌంటు ఎనేబుల్ చేసుకోండి.

సదా మీ ఆదరాభిమానాలు కోరుకుంటూ,
మీ
కినిగె టీమ్
kinige.com World’s No.1 Premium Telugu Online eBook store

Posted in 2014, ఫిబ్రవరి and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.