HunterRoadLo

హంటర్‌ రోడ్‌లో ఒంటరిగా…

Download PDF ePub MOBI

చీకటి కాటుక పూసిన
నింగి నేత్రపు
నిరంతరాయ నిరీక్షణ
నడిరేయి నల్లని రహదారిపై
నల్లగ మెరిసే మాయాముద్రలు
నిదరోయే నల్లతుమ్మ చెట్టు
చెంతకు చేరి
నిను మరి మరి
మేల్కొల్పుకునే నీ నేను
గగనం శిరసును మెరిసే
తారకల తన్మయ కాంతుల్లో
అలనాటి నీ అడుగుల సవ్వడికై
ఆరాధనాధారిత అన్వేషణలు
నీవు నడిచిన మార్గాన నిలిచి
నిను తలపోస్తోన్న సమయాలు
నీవెన్నెడో పయనించి పరిచిన
నీ మృదు పాద ముద్రలు
ప్రోదిచేసుకు పొదువు కోవాలన్న
ఆరాట ఆరోహణా గరిష్టతలు
నీవు నడయాడిన నడకలపై
నా కనుల కాళ్లెంత
కలియ తిరిగినా కానరావు
తెగిపడే మానస తంత్రుల
అనుదిన విలాప శృతులు
నీకెన్నటికీ వినిపించవు
నా హృదయాంతరంగములో
విస్తరిస్తోన్న రహదారిలోకి
నీవెన్నటికీ రాలేవు
నీకై వాడిపోని
కాలాతీత వీక్షణతో
నీవొదిలి వెళ్లిన దారి దరిన
నీ దరి చేరలేని నేను
ఒంటరిగా. . .
ఒంటరిగా. . .

 

బడుగు భాస్కర్ జోగేష్
సెల్: 98666 02325

Download PDF ePub MOBI

Posted in 2014, కవిత, ఫిబ్రవరి and tagged , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.