Hardcover book gutter and pages

ముందొక మాట

మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెడుతున్నాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.

ఈ నెల సంచికలో అంశాలు:

  • సినిమా వెనుక కథ శీర్షికన వెంకట్ సిద్ధారెడ్డి అనువాదం: బ్లో అప్
  • స్వాతి కుమారి బండ్లమూడి మ్యూజింగ్: ఆవిరి
  • పుస్తక సమీక్షలు:

    1. పాలపర్తి ఇంద్రాణి “ఱ” 
    2. కాశీభట్ల వేణుగోపాల్ “కాలం కథలు”
    3. అయినంపూడి శ్రీలక్ష్మి “మోనోలాగ్ ఆఫ్ ఎ వూండెడ్ హార్ట్”
    4. ఓల్గా “స్వేచ్ఛ”
    5. మధురాంతకం నరేంద్ర “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం”

ఇంకా కవిత్వానువాదాలపోటీ, కొత్త పుస్తకాలపై చిరు సమీక్షలు, సాహితీ ముచ్చట్లు.

 డిసెంబరు కినిగె పూర్తి సంచిక Download PDF

డిసెంబరు కినిగె పూర్తి సంచిక Download ePUB

డిసెంబరు కినిగె పూర్తి సంచిక Download Mobi

 

Posted in 2013, డిసెంబరు, ముందుమాట and tagged .

7 Comments

  1. కినిగె పత్రిక బాగుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ పేజీ లోడింగ్ ఎక్కువ సమయం తీసుకుంటున్నది. ఈ విషయంలో కాస్త శ్రద్ద వహించగలరు.

  2. కినిగె.కాం ఈ పత్రికని ఈ దశాబ్దపు అద్భుతం అని ఎవరైనా అంటే అందులో ఆవగింజంత అబధ్ధం కూడా లేదని నేను నమ్మకంగా

    చెప్పగలను. లోకంలో ‘ నాక్కొంచం నమ్మకమివ్వూ అని అడిగేవాళ్ళ సంఖ్యని ఎంతోకొంత తగ్గించ గలదని ఆశ. మీతోపాటు మెహెర్

    కీ, భగవంతానికీ నమస్సులు, శుభాకాంక్షలూ………….. ఖాదర్ మొహియుద్దీన్

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.