viramcover

వైరం

Download PDF ePub MOBI

1
తెలియని దాన్ని గురించి తెలుసుకుందామనుకుంటాను
తెలసుకునే కొద్ది, నెట్టబడుతున్నాను,
మరింత తెలియనితనంలోకి

2vairam
ఎక్కడెక్కడ మనం, మనకి
కొత్తగా పరిచయమవుతామో,
అప్పుడప్పుడల్లాప్రవహిస్తుంటుంది,
కాస్తంత ప్రేమో,
మరికొంత కోపమో, చెప్పలేనంత విషాదమో,
ఎప్పుడన్నా, ఓ చిన్న సంతోషమో…

3
ఇలాంటి ఓ చోట్లల్లో,
అలాంటి ఓ సమయాలల్లో,
సౌకర్యవంతమైన ఓ ప్రణాళిక కావాలి,
నీకు బాధుండకూడదు, నాకు కూడదు.
పని మాత్రం అలా జరిగిపోవాలి,
బుర్రలమీదొట్టు, ఒప్పుకో మరి.
ఓ సంధి సయొద్ద రాయబారానికి,
ప్చ్, నాకు తెలుసిక, ఘర్షణే అనునిత్యం.

4
మనం నిజంగా ఏ మనిషిని మార్చలేం,
కనీసం మనల్నికూడా.
ఒక్కోక్క దుఃఖవాహిక గుండా
పయనిస్తున్నప్పుడెప్పుడన్నా,
శుభ్రపరచబడతాం, ఓ నాలుగు అశ్రువులచేత,
అది కూడా చాలాసార్లు మనకే తెలియనంత సహజంగా.

5
నన్ను నేను ప్రేమగా హత్తుకోవడానికి,
నాలోకి నేను ప్రవహించడానికి,
బహుశా, ఈ జీవితం అంగీకరించదేమో
ఎదురుచూడాలి, మరోప్రయత్నానికి.

– భాస్కర్ కొండ్రెడ్డి

(http://bhaskar321.blogspot.in/)

Download PDF ePub MOBI

Posted in 2014, కవిత, ఫిబ్రవరి and tagged , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.