pic

చిత్సభా నాయకా

Download PDF ePub MOBI

రాగం: అఠాన
తిశ్రగతి ఏక తాళం
స్వర రచన, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

చిత్సభా నాయకా      ¦2¦
కుత్సితము చేయక
దినము లీడేరుటే ఘనము
దిస్సమొల జంగమా
డీడీకులకు పోయి
దిగజారిపోనిదే దిటవు
హెచ్చు కన్నుల దొరా
ఇచ్చలకు తగులుకొని
ఒచ్చవడకున్నదే యశము      ¦చిత్సభా¦
పెనుజోగి దేవరా
పెరిగి వెల్లాటకము
విరుగబడిపోకుంట పెరిమె
విసపుమేతరి జోదు
కసిబిసి గలాటలో
తగులుకోనప్పుడే అనువు
ఎద్దుతత్తడి రౌత
పెద్ద గజిబిజి తోవ
నొద్దికై దాటితే కద్దు      ¦చిత్సభా¦
అరుణగిరి వేలుపా
అరులారుఁ లోలుప
అణచి యుంటే కదా ఎఱుక
మూకబోదల జియ్య
లోక చింతన మాని
ఏకమై మెలగుటే మాను
తా త్త తై ధీం త త్తై
తరికిట తోం తోం
తక ధిమి తోం తక ఝం తా      ¦చిత్సభా¦
For చిత్రకవి ఆత్రేయ, for సహృదయ సాహితి

(Image Courtesy: http://www.flickr.com/photos/vinothchandar/6981425199/)

Download PDF ePub MOBI

Posted in 2014, మార్చి, స్వరం and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.