Cartoon Geeyandi Cover

కార్టూన్ గీస్తారా!

మేం ఇచ్చిన ఇతివృత్తానికి మీ చేత కార్టూన్ గీయించటం దీని ఉద్దేశం.  కార్టూన్లో గీత మెళకువ కన్నా కూడా హాస్యస్ఫోరకత ముఖ్యం. నిజానికి పద్ధతైన చేయితిరిగిన గీతల కన్నా, అమెచ్యురిష్‌గా కనిపించే (కనీసం కనిపించే) గీతలే కార్టూన్‌కి అందాన్నిస్తాయి. కాబట్టి ఇందులో పాల్గోవటానికి మీరు ప్రొఫెషనల్ కార్టూనిస్టులు కానక్కర్లేదు. విషయాన్ని సరదాగా తీసుకోగల మనుషులైతే చాలు. మీ కార్టూన్‌ కాగితం నుంచి స్కాన్ చేసిందైనా, తిన్నగా కంప్యూటర్లో గీసిందైనా ఫర్లేదు. రంగులు ఉన్నా, లేకున్నా ఫర్లేదు. సైజు మీ ఇష్టం. ఎంపికైన కార్టూన్‌లకి బహుమతి ఉంటుంది.

ఐడియా

టెక్నాలజీ పెరిగి న్యూస్‌పేపర్ల నుంచి పుస్తకాల దాకా అన్నీ ఇంటర్నెట్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా చదువుకోవటం వచ్చాకా కాగితం వాడకం తగ్గింది. కాగితం కొన్నాళ్లకి అసలు కనిపించనే కనిపించకపోవచ్చు అంటున్నారు.  అలా కాగితం లేని ప్రపంచం, దాని మంచి/ చెడు పర్యవసానాలూ… ఇవీ మీ కార్టూన్‌కి ఇతివృత్తాలు. మరిక మీ హ్యూమర్‌ని గీతల్లో విదిలించండి.

— మీ కార్టూన్‌లను editor@kinige.com కు మెయిల్ చేయండి.  —
Posted in 2014, కార్టూన్ గీస్తారా!, మార్చి and tagged , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.