KondaMeedaAttayyaIllu

రెండు కవితలు

Download PDF ePub MOBI

కొండ మీద అత్తయ్య ఇల్లు

కొండ మీద

అత్తయ్య ఇంటి

చిమ్నీనుండి

మేఘాలు మేఘాలుగా

పొగలొస్తున్నవి.

ఆ పైకి ఎక్కిపోతే

ఆవిర్లు కక్కేటి

అన్నం తినవచ్చు.

 

మెట్ల దారి కనిపించట్లేదు

కొండంత చీకటి.

 

మేఘాలు వెళ్ళిపోయాయి

కోతులు కొమ్మల్ని  ఊపినప్పుడల్లా

వాన జల్లులు కురుస్తున్నాయి

వేప చెట్ల మీద నత్తలు

మెత్తగా కదులుతున్నాయి

నడక దారి అంతా

జర్రుబుర్రున జారుతోంది

కొండ మీద మేఘాలు

కురిసి వెళ్ళిపోయాయి.

 

Download PDF ePub MOBI
Posted in 2014, కవిత, మార్చి and tagged , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.