cover

అపుడు కదా..!

Download PDF ePub MOBI

అనుక్షణం నీడలా

ఆమె ఎందుకు నడిచిందో తెలియాలంటే

Apudu Kadaఅతనివెనుక మనమూ

నాలుగడుగులు వేసి వుండాలి

 

అరణ్యవాసంలోనూ

ఆమె సంబరమమేమిటో తెలియాలంటే

అరక్షణమైనా అతని సన్నిథిలో

మనం నిలిచి వుండాలి

 

అశోకవనంలో

ఆమెను కాచిన బలమేమిటో తెలియాలంటే

అలవోకగానైనా అతని రూపాన్ని

మనం చూసి వుండాలి

 

అగ్నిమధ్యంలో

ఆమెకు అందిన చలువేమిటో తెలియాలంటే

అసలెపుడైనా అతని ప్రేమజడిలో

మనం తడిసి వుండాలి

Download PDF ePub MOBI

Posted in 2014, కవిత, మార్చి and tagged , , , .

5 Comments

  1. Athani maataku kattubadi
    Ayodhyalone migilinapudu-
    Athanikosam vechi vechi aa polimera
    pogili pogili edchinapudu-
    Aakasamaargaana Athani Ayodhy cherika vini
    Athani chuda vadi vadi ga venuthiriginapudu-
    Anandaana kanulu nindi, manasu pondi
    naaku nene migilinapudu——
    Athanu lenidepudu? Athanitho nenu lenidepudu?

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.