cover

రేగడి మన్ను / చీకటి / ఏకాంతం

Download PDF ePub MOBI

నేను నడిచే రేగడి మన్నునయ్యా పంతులూ

నా జ్ఞాపక కాలం పొయ్యింది

రియల్ టైం ఆరిపోయి రీల్ టైం చేజిక్కింది

మా ఊరికి చేరుకోలేనిప్పుడు

దారి పరాయిదయ్యంది

ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ తో

అనంతాకాశంలోకి లేచిపొయ్యింది

లోపల ఏ జీవీ సందడించకున్నా

కాలం కడుపుతో ఉన్నట్టు

ఈమె దేహంలో పొలమారుతున్న ముల్లును

నేను … రేగుపండు ముల్లును

ఈమె చుట్టే పరుచుకున్న పొడిగాలిని

తనకోసమే పడిగాపులు పడుతున్న

దగ్ధ చినుకుని

నారింజ కాసారం … తన తెరపొర … అర కూడా

నేనిక్కడ ఎగిరే

అఘోరీ పిట్టను –

వొంటరి గుట్టను

ఏకాంతపు చీకటి రేగడి మన్నును

కల రవ్వను

కాంతి బొట్టును

పదం తెగిన పాదాన్ని

నిరామయ మధ్యాహ్నపు పొలిమేరను

చిత్ర ఢాకినిని

సిద్ధార్థ

9603318460

Download PDF ePub MOBI

Posted in 2014, కవిత, మార్చి and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.