cover

అనుకోకుండా (2)

Download PDF ePub MOBI

పూలు పూయని కాలంలో మాటలతో దోసిళ్ళు నింపి

మంచు శిలవై, ఇసుక అడుగువై

ఏ పిచ్చి కలల్లో చెదిరిపోయావో

 

చిల్లుకుండలో వర్షాన్ని నింపుకుంటూ

రాలిన సీతాకోకల్ని కొమ్మలకి అతికిస్తూ

ఎవరూ చూడనప్పుడు –

ఎండరంగుని గోళ్లకి పులుముకుంటూ నేను . . .

 

బూజు పట్టిన గోడ, పగిలిన కిటికీలో మబ్బుపట్టిన ఆకాశపు ముక్క

బావిలోంచి వెన్నెల్ని తోడుకుని స్నానమాడుతూ తోట

దొంగాటలో దాక్కునే చోటు దొరక్క బిక్కుబిక్కుమంటూ  చీకటి – దా . . . ఇలా నాలోపలికి!

 

కొన్నే ఉంటాయి ఊహలు

గొడుగుల్ని కాలవ నీళ్ల మీద వెల్లకిలా వదిలేసి

వానలో ఋజువు దొరకని ఒక లోయలోకి చేతులు పట్టుకుని పరిగెత్తినట్టు

కాళ్ళు నొప్పెట్టకముందే ‘ఇంకెంతదూరం’ అన్నందుకు ఇసుక మనల్ని మింగేసినట్టు

మిగిలిపోయిన ఒక్క ఆకునీ రాల్చేసి వెళ్లమని ఎవరికో వసంతాన్ని అరువిచ్చి ఆపేసినట్టు.

 

సర్లేకానీ –

మళ్ళీ రమ్మంటానో లేదో! ఈ గుప్పెడు కలల్నీ ఎక్కువ తక్కువగా పంచేసుకుందాం ఇప్పుడే.

కాసేపుండు నాతో.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, మ్యూజింగ్స్ and tagged , , .

One Comment

  1. Pingback: ఇసుక పరదాలు | వాకిలి

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.