cover

వెడ్డింగ్ ఇన్విటేషన్

Download PDF ePub MOBI

7th September.. మధ్యాహ్నం..

ఛ ఎవడన్నాడోగానీ ఇల్లుకట్టడమే ఈజీ పెళ్ళి చేసుకోడంకంటే, అందర్నీ పిలిచానో లేదో అనుమానం, రావాల్సినవాళ్ళు రారేమో అని అనుమానం, అది బాలేదు, ఇది సరిగా కుదర్లేదని కామెంట్లేసే నాకొడుకులెలాగూ ఉంటారు..

టైముకీనా కొడుకు అరుణ్గాడు కూడా లేడు..

(( ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్.. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..))

ఎవడో ఫోన్.. వాడే.. దరిద్రుడు

ఫోన్రింగ్టోనెంత బావుంటదో ఇది, పాత సిన్మాల్లో ట్రంకాల్ చేసేప్పట్లాగే, కొన్ని పాతవెప్పుడూ బావుంటాయ్, పాత ఫోటో, పాత పుస్తకం, పాత వైన్..

“అరుణ్గా.. బతికే ఉన్నావా, ఎక్కడున్నావసలు, డిల్లీనుండి అతుల్, వసిష్ట్ వొచ్చారు. పెళ్ళి కార్డ్స్ ఇచ్చిరమ్మని పంపితే వారంరోజులేం చేస్తున్నావ్‌రా వైజాగ్‌లో.. ఎల్లుండేరా నా పెళ్ళి.. వొచ్చే ఆలోచనుందా లేదా”

“హ హ హ హ”

“నిన్నే బే హౌలే, కాసేపట్లో షామీర్పేట్ ‘ఆరెంజ్ బౌల్’ కెళ్తున్నారు మనోళ్ళంతా”

“ఎందుక్రా.. పెళ్ళి వెన్యూ ఏమైనా మార్చారా.. హ హ”

“తిక్కనాదూబే, బాచిలర్పార్టీకి, నువ్వక్కడుంటే ఇక్కడెవడు చూసుకుంటాడు బే”

“రేయ్ రేయ్.. చిన్నా.. కూల్ కూల్.. అతుల్ గాడ్‌తో మాట్లాడాను, బాంబేనుండి పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ సాయా మేడం వొస్తున్నారు ఈవెనింగ్ ఫ్లైట్ కి, ఆరెంజ్ బౌల్ పనంతా వేణుగాడు చూసుకుంటాడు, యూ డోంట్ నీడ్ టు వర్రీ, ఫర్గాట్ టు టెల్ యూ, ఇక్కడ వైజాగ్‌లో చిన్న ల్యాండ్ ప్రాబ్లం, M.P భరధ్వాజ్ గారిది, యారాడ బీచ్ దగ్గర అగ్రిగోల్డ్ రిసార్ట్స్ పక్కన ఓ వెంచర్ చేస్తున్నారు, దానికి రేపు క్లియరెన్స్ పనుంది, ఇక్కడి లోకల్ లీడర్లతో పర్సెంటేజ్ తెగట్లే, ఆయన్నింకోసారి కలిసి ఒప్పించి ల్యాండ్ వర్కంతా చేసుకునొస్తా. 9th మార్ణింగ్ వరకు హైద్రాబాద్ లో ఉంటా, హా.. హా.. కార్డ్స్ అన్నీ పంచేసాన్రా, సార్ డిల్లీలో ఉన్నారు, అదే పార్టిషన్ గురించేదో ఆజిటేషన్ చేస్తున్నారుగా, లేపోతే ఆయనే చూస్కునేవారిదంతా, యూ డోంట్ వర్రీ వొస్తా, ప్రీతిని అడిగానన్చెప్పు, వీలైతే నేనే మాట్లాడ్తా, పెళ్ళిరోజు నీకో మాంచి సర్ప్రయిజ్ ఉందిరోయ్”

“ఉమ్మ్, సర్లే, రాజుగాడికోసారి ఫోనివ్వు, మాట్లాడాలి.. నువ్వసలే తిక్కనాకొడుకువి, తాగి డ్రైవ్ చేస్తావ్”

“హ హ హ హ.. ఒక్కడ్నే వొచ్చారా, విజయవాడలో సంతకం పెట్టాల్సిన ఫైలొకటుండింది, అది చూసుకుని.. లంబా సఫర్”

“పూజితా.. తనింకా టచ్‌లో ఉందాబే ఛూతే, కొడకా, సంవత్సరంకింద వరంగల్ సిటీ గ్రాండ్ హోటల్‌రూంలో నువ్ చేసిన చెత్తకి తను మళ్లీ చూడదనుకున్నా.. సచ్ ఎ స్లట్ యూ ఆర్, నిండిన కండోమ్‌లు గోడకిసిరికొట్టిన హీరోరా నువ్వు.. హ హ హ”

“ఎవడ్రా మంచోడు.. నువ్వా నేనా, లౌడాల్లొల్లి ఇదంతా”

“రేయ్.. దయ చేసి తాగి డ్రైవ్ చేయకు.. తాగితే ఇన్నోవా అక్కడే పడనూకి క్యాబ్ తీసుకొచ్చేయ్, అగేన్ ఆమ్ టెల్లింగ్ యూ, పెళ్ళిముందు పిచ్చేషాలేయకు, టెన్షన్ పెట్టకు జనాలను”

“హ హ హ.. సరే రా సరే దొబ్బకు.. 9th మార్ణింగ్ వరకుంటా, ఇంక ఫోన్ పెట్టి స్పా కెళ్ళిరా పో, రోడ్‌నంబర్ 12 రహమత్ గాడ్‌తో మాట్లాడాను, అప్పాయింట్మెంటిచ్చాడు.. వెళ్ళి తోమించుకున్రా, అండ్.. నైట్ పార్టీలో అతుల్‌ని కలువ్, డిల్లీ పాలిటిక్సులో మంచి గ్రిప్పుంది వాడికి.. వాడి బాబు పెద్ద బిగ్‌షాట్.. నోయిడాలో వెంచర్ ప్లాన్చేసావ్గా.. హి మే హెల్ప్ యూ ఫర్ ష్యూర్, ఉంటా ఇక.. టేక్కేర్ డార్లింగ్..”

“రేయ్ ర్రే.. ఇడియట్..”

పెళ్ళిలా లేదిది, ఏదో డెలిగేట్ల మీటింగ్‌లా ఉంది, వేణుగాడెక్కడ్చచ్చాడో.. ఫోన్లొచ్చాక ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడ్డం చాలా తగ్గింది,

“హెలో.. రేయ్ వేణు, సాయంత్రం మనోళ్ళొస్తున్నారు ఎయిర్ పోర్టుక్కార్ పంపించాలి, హా సాయా మేడమే, అలాగే ఆరెంజ్ బౌల్..”

“తెల్సన్నా.. అరుణన్న చెప్పిండంత, అతుల్సాబ్ వొచ్చిండంటకదా”

“హా.. ఎందుకురా అంత పర్టికులర్‌గా”

“హి హి హి.. ఏం లే అతుల్సాబ్ని స్పెషల్గ చూస్కోమని చెప్పిండు అరుణన్న, కోక్ తెప్పించిన.. పోర్లను కూడ మాట్లాడిన.. సాబ్ కు సౌత్ పోరీలంటే..”

“హా హా.. సర్సరే అరుణ్చెప్పాక నేన్చెప్పేదేముందిరా, చూస్కో ఎక్కడా తగ్గొద్దు మనం.. రాత్రి తొమ్మిదింటివరకొస్తా.. ఆరెంజ్ బౌల్కే.. లేద్రా ఉండనక్కడ.. అతుల్‌ని మనవాళ్ళందర్నీ కలిసొస్తా.. సరేనా.. రేయ్ రేయ్ మర్చిపోయా డబ్బులున్నాయా”

“హా.. అకౌంట్ల పడేశిండు అరుణన్న, ఐనా రిసార్టోడు మనోడే అన్నా, మీరేం ఫికర్ చేయకుర్రి, సుకూన్ ఉండుర్రి అంతే”

“ఓకే రా ఉంటా మరి”

బీప్.. బీప్.. బీప్..

అరుణ్గా.. ఉండాల్రా నీలాంటోడొకడు, నా బిజినెస్ కోసమే అతుల్గాడ్ని ఇన్వైట్ చేసావ్ కదా, లవ్యూ మచ్చా.. మెంటల్నా కొడకా నాకే అబద్దం చెప్పావ్‌గా, పూజితాను తీస్కెళ్ళే ఉంటాడు కార్లో.. అదో బాకు, వీడో బోకు.

*  *  *

8th September.. రాత్రి.. ప్రీతి వాళ్ళింట్లో

“నమస్తే బాబూ, మీరేంటిలా.. పెళ్ళికి ముందు ఆడపెళ్ళివారింటికి..” మామగారు కాస్త వినీ విన్పించకుండా..

“అవ్నాకు తెలీదంకుల్, పనుండిటువైపొచ్చా, అలాగే ఓ సారి మిమ్మల్నీ చూసెళ్దామని, ఆ.. హుహ్.. ప్రీతి ఫోన్ అటెండ్ చేయట్లేదేంటి”

వీలైనంత అమాయకత్వాన్ని మొహమ్మీదికి పిలిచి, “ఓహ్, తన ఫోన్ బానే ఉందే, పైన గెస్ట్ రూంలో ఉంది ఫ్రెండ్సొస్తే మాట్లాడ్తున్నట్టుంది” కుదిర్నంత మర్యాదనీ అనుమానంతో కలిపి కాబోయేమామ..

పాలరాతి మెట్లమీద పైకెక్కేప్పటికే గెస్ట్ రూంలో నవ్వుల గల గల..

ఎంతైనా అమ్మాయిలకు స్మైలింగ్ త్రెషోల్డ్ తక్కువ.. ప్రతి పంజెంట్ జోక్ కి విరగబడి నవ్వుతారెందుకో.

“ప్రీతి.. ప్రీ.. హాయ్..”

ఆరేడుగురుండుంటారు నల్సార్ లా కాలేజ్ బ్యాచ్.. సగమ్మంది నార్త్ ఇండియన్ ముఖాలే, ముఖంచూసి ఏ ప్రాంతమో ఎలా తెలుస్తుంది, తమిల్ ముఖాలైతే చూడగానే తెలుస్తాయ్లే.

“హాయ్ శశాంక్, ప్లీజ్ కమిన్.. లెట్మి ఇంట్రడ్యూస్ మై పాల్స్ టు యూ.. గాల్స్, యు మైట్ బి నోయింగ్ హిం.. హ హ.. మై వుడ్ బి..”

పరిచయాలూ పేర్ల మార్పిడులూ అయ్యాక నా ఇబ్బందిన్చూసి కాస్త ఇబ్బండి పడ్డాట్టున్నారు బాల్కనీలోకి జారింది గుంపంతా.

“శశ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, ఓ ఫోన్ చెయ్యాల్సిందిగా వొచ్చేముందు..”

“అంతా ఓకే, పక్క కాలనీలో సైట్ డెవలప్మెంట్ కి తీసుకున్నాం, అక్కడికొచ్చా పన్లోపని నిన్నూ చూసినట్టుంటుందని. ఇక్కడిదాకా వొచ్చాక ఫోనెందుకులే అన్పించి”

అబద్ధం చెప్పలేనివాడు నిజం కూడా చెప్పలేడెప్పుడూ..

“ఆహ్ ఆహా.. అవునా ఇప్పుడు నిజం చెప్పు”

ఎలా కనిపెట్టేస్తార్రా బాబూ వీళ్ళసలు, లేపోతే నాకే అబద్దాల్చెప్పడం రాదా?

“ఉమ్ మ్ మ్, చూడాలన్పిమ్చింది అంతే”

వారినీ నేనింత గోముగా మాట్లాడగల్నా అని అప్పుడప్పుడు నేనే షాక్.

((ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్))

క్లైమాక్స్ లో కరెంట్ పోయినట్టు ఈ టైమ్‌లో ఫోనెవడు, అన్నోన్ నెంబర్, ఈ సైట్ ఇంజనీర్ గాళ్ళకి పర్సనల్ నంబరివ్వొద్దందుకే..

“చూడాలన్పించిందా.. ఎందుకలా.. కమాన్ చెప్పు”

సన్నగా మంచు కురుస్తున్నట్టు సువాసన్ల మాటల్నొదిలి..

లాయర్లకి అన్నీ తెల్సినా మనతోటే చెప్పిస్తారు, డాక్టర్లకేం తెలీకపోయినా ఏదోటి చెప్పి నమ్మిస్తారు.

“నథింగ్.. నిజంగా చూడాలన్పించి.. అంతే”

((ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్.. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్))

“సీమ్స్ టు బి ఎన్ ఇంపార్టెంట్ కాల్ శశ్.. మాట్లాడు పర్లే విల్ వెయిట్”

“నో నో అదేంలే, సైట్ ఎంజనీరన్కుంటా.. నేన్తర్వాచ్చేసి మాట్లాడ్తాలే.. నాట్ ఎ ప్రాబ్లం”

శతాబ్దపు అత్యుత్తమ చెత్త ఆవిష్కరణ ఫోన్, ప్రైవసీ లేకుండా కలల్లోక్కూడా దూసుకొస్తుందప్పుడప్పుడూ, స్విచాఫ్ చేస్తే సరి, అర్జెంటైతే మరో నంబరుoదిగా దానికి చేస్తార్లే..

“ప్రీతి ఉమ్ మ్, ఆర్యూ కంఫర్టబుల్ విత్ మలేషియా”

అర్థం కానట్టు చూసి తన్లో తనే నవ్వుకుని తలాడించి, “వై నాట్.. దట్ వుడ్ బి ఎ గుడ్ ఛాయిస్, అక్కడ ఐలాండ్స్ బావుంటాయ్ గడపడానికి.”

కొన్ని క్షణాలు మా మధ్య మౌనంగా దొర్లి వాతావరణం వేడెక్కి పెళ్ళి రేపే అని పనులు గుర్తొచ్చి పెట్రోనాస్ టవర్మీంచి గచ్చిబౌలి మలేషియా టౌన్షిప్లో పడి..

“ఆహ్ ప్రీతి హహ్ నే వెళ్తా మరి, టికెట్స్ టూ అండ్ ఫ్రో బుక్ చేస్సాను.. 11th రాత్రి ఫ్లైట్..”

“సౌండ్స్ గుడ్.. గ్రేట్.. ఆ శశ్, అరుణ్ కన్పించట్లా ఫోన్‌కూడా చేయలేదెందుకు, ఎక్కడున్నాడు..”

“ఓహ్ ఐ ఫర్గాట్టూ టెల్, వాడు వైజాగ్‌లో M.P భరద్వాజ గారి ల్యాండ్ సెటిల్మెంట్ చూసుకుని రేపుదయం వరకొస్తా అన్నాడు.. సరేనా.. బై ఫర్ నౌ.. టేక్కేర్, స్లీప్ ఎర్లీ, రేపంతా పడుకోడానికుండదు..”

ఏమైందీ దీనికి అలా సిగ్గుపడ్తుంది, ముహూర్తం రాత్రిగా.. ఓహ్..రెండో అర్థమ్మహిమా అది..

చివర్సారి గదిలోని వాసన్లన్నీ గుండెలోకి తీసుకుని వొదల్లేక కదల్లేక బైటికొచ్చి..

ఎంతైనా అరేంజ్ మారేజెస్లో సౌకర్యాలే వేరు..

లౌ మారెజెస్లో ఏముంది బొంగు, ఏళ్ళకేళ్ళు చూసుకున్న ముఖాలే మాట్లాడుకున్న నాలికలే వీలైనంతవరకూ గట్టు దాటిన శరీరాలే కలిసుండాలి ఎంత బోర్ కొట్టినా.. ఇందుకేనేమో లవ్ మారేజెస్సే బ్రేకుతున్నాయీ మధ్య.. అదే అరెంజ్డ్ లో, గౌరవానిగ్గౌరవమూ మర్యాదకి మర్యాదా, కానీ ఎంగేజ్‌మెంట్‌కీ పెళ్ళికీ ఆట్టే గాప్ ఉండకూడదు, ఒకరి గురించొకరికి పూర్తిగా తెలిసే ప్రమాదముంది..

పాలరాతిమెట్లు దిగుతూ అత్తయ్యకు బయల్దేరుతున్నాని చెప్పి మెయిన్‌డోర్ వైపు కదుల్తుండగా గెస్ట్ రూంలోంచి గట్టిగట్టిగా అరుపులూ నవ్వులూ,

ఏమై ఉంటుంది మా హనీమూన్ ప్లాను ప్రీతి ఫ్రెండ్స్ కి చెప్పుంటుందా, అమ్మయిలూ అబ్బాయిల్లాగే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారా ఫస్ట్ నైట్ రొమాన్సంతా, ఏమ్మాట్లాడుకుంటారో, మగవెధవలు మాట్లాడుకునేంత పచ్చిగా ఉంటాయా, మీ వాడేం చేసాడే అనడిగితే, మా వాడు కత్తి, దించేసాడంతే, అని చెప్పుకుంటారేమో..

సృష్టికార్యం గురించి మాటలైనా చేతలైనా ఊహలైనా మాంఛి ఎనెర్జీ ఇస్తాయ్లే….

డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా

*  *  *

9th September.. రాత్రి

పెళ్ళి పీటల్మీద..

@“గణానానాం స్వాహా గణపతిం శ్రీ మహాగణపతియేనమహా శ్రీ మహాసరస్వతియేనమహా” పంతులు తీస్కునే డబ్బుకి న్యాయంచేసేట్టే ఉన్నాడు.

వెండిజరీ లాల్చీ ధోవతీ, పైనో టోపీ నుదుటిమీద చిక్కిన రూపాయ్బిళ్ళంత కుంకుమ, చేతిలో వక్కల కట్టర్, చుట్టూ జనాలు ముందు ఫోటోగ్రాఫర్లవేడి ఫ్లాష్ లైట్స్..

ఇప్పటికే గంటైంది కూర్చుని..

పంతులూ ఆయనకొచ్చిన మంత్రాలవ్వే రిపీట్ చేస్తున్నాడనిపిస్తుంది..

కొత్తవి చదివినా వినిచావొచ్చు టైమ్ పాస్ కి..

అదే అగజానన పద్మార్కం.. అదే ఆయతనమాన్భవతీ..

పెళ్ళి తంతింత భయంకరంగా ఉంటుందనుకోలేదు..

Posted in 2014, ఏప్రిల్, కథ and tagged , , , , .

2 Comments

  1. కథ చాలా బాగుంది. మీ narration చాల visualగా ఉంది. Screenplay చదివినట్టు, అంత కళ్ళగట్టినట్టు అనిపిచ్చింది. And some of the lines are simply wonderful- గుడిశేటి పనులకూ గుడిదేవుడి ఆశీస్సులుండాలేమో. Loved this.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.