large

కొన్ని కొత్త పుస్తకాలు

Download PDF

ePub   MOBI

ఈ-పుస్తకాలు

TeluguVakyam

తెలుగు వాక్యం:

రాసేవాడికి వాక్యం అవసరం. ఆ వాక్యం ఎలా పని చేస్తుందో తెలుసుకోవటం దాని చేత ఇంకా బాగా పని చేయించుకోవటానికి తోడ్పడదూ? చే.రా గా ప్రసిద్దుడైన సాహిత్య విమర్శకుడూ, భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు తెలుగు వాక్యం వాడకానికి రాసిన మాన్యువల్ ఇది.

లభ్యం  

ModatiPage

మొదటి పేజీ:

శ్రీరమణలో స్టోరీటెల్లరూ పేరడిస్టూ మిరుమిట్లు గొలుపుతూ కదం తొక్కేయటంతో, ఆయనలోని హ్యూమరిస్టూ సెటైరిస్టులు వెనకే ఉండిపోయారు. బహుశా కథా ప్రక్రియకున్న చరిష్మా, పేరడీ ప్రక్రియకున్న అరుదైనతనమూ వ్యాస ప్రక్రియకి (కాలమ్‌కి) లేకపోవటమే దీనికి కారణమేమో. నిజానికి ఆయన రచనా మూర్తిలో “మిథునం”, “పేరడీలు” ఐస్బర్గు మొన లాంటివి మాత్రమే. “గుత్తొంకాయ్ కూరా – మానవ సంబంధాలు”, “శ్రీఛానెల్”, “మొదటి పేజీ”, “శ్రీకాలమ్”, “హాస్యజ్యోతి”… ఇలా అడుగున చాలా ఉన్నాయి.

హాస్యంలో శ్రీరమణ శైలి ప్రత్యేకం. ఆయన వాక్యాలు ఆరితేరిన హాస్యగాళ్లలాగా తాము నవ్వకుండానే మనల్ని నవ్విస్తాయి, అమాయకంగా కనిపిస్తూనే చురకలంటిస్తాయి. నవ్య వీక్లీలో ఆయన వారం వారం రాసిన సంపాదకీయాల కూర్పు ఈ పుస్తకం. హాస్యం అజీర్తి చేయదు. అందులోనూ ఇలాంటి ఆరోగ్యకరమైన హాస్యం. ఎంతైనా తీసుకోవచ్చు.

లభ్యం 

05cdcf10-24be-4790-b5e2-058b3da51c15

తక్కువేమి మనకూ:

“నిజానికి రెండు సత్యాలు లేవు. రెండు సిద్ధాంతాలకీ ఘర్షణ లేదు. ఒకే సత్యాన్ని తర్కం రెండుగా భ్రమింపజేస్తోంది.”

“అసౌకర్యం… అభద్రత… నోస్టాల్జియా… యూనిఫామ్… మన టేస్ట్… మన సౌకర్యం… అన్నీ టు బిహెచ్‌కె లే! సమస్య యూనిఫార్మిటీ, అందర్నీ మూసలోకి లాగేస్తున్న యూనిఫార్మిటీ… అసంతృప్తికి మూలకారణం అసమానత కాదు, సమానత. ఏ చిన్న వైరుద్యమూ లేకుండా ఒకేలా ఉన్న సమానత.”

ఒక వాక్యం సమన్వయిస్తోంది, ఒక వాక్యం తిరగబడుతోంది. శ్రీవల్లీ రాధిక రచనల్లో ఇది పేరడాక్సు కాదు. మాలతీ చందూర్ మాటల్లో చెప్పాలంటే ఆమె: “ప్రాచీన సంస్కృతికి, తాత్వికతకు ఈనాటి కంప్యూటర్ వేగానికి మధ్య ఒక సమన్వయం వెతికి, ఆ సారాన్ని పాఠకులకి అందిస్తున్నారు.

లభ్యం 

Kalarekha

కాలరేఖ:

ఈ పుస్తకం శేషేంద్ర శర్మ తన కవితా ప్రస్థానపు నేపథ్యంలో రాసుకున్న రాండమ్ నోట్స్‌ను ఒక చోట కూర్చి ప్రచురించిన సంకలనం. కవిత్వం చెప్పేటప్పుడు సహజంగానే వెనక్కు పోయి నిలబడిన ఆయనలోని పండితుడు ఇక్కడ వేదికెక్కి మాట్లాడతాడు. ఆయన ఎంత విస్తృతంగా చదివారో ఇక్కడ తెలుస్తుంది. ఆయన భావాల వెనక నేపథ్యం కూడా ఆవిష్కృతమౌతుంది. కవిత్వం శాస్త్రీయంగా అభ్యసించాల్సిన విషయమని స్ఫురింపజేసే పుస్తకం.

లభ్యం

Posted in 2013, Uncategorized, కొత్త పుస్తకాలు, డిసెంబరు and tagged .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.