cover

విహారి

Download PDF ePub MOBI

.

సుదూరతీరం వైపుకి సాగే

సుదీర్ఘ ప్రయాణంలో

సముద్రపు అలలనే

సింహాసనంగా చేసుకుని

సేద తీరే సైబీరియన్ పక్షుల్లా

ఈ దేహపు కడలి విడిదిలో

విశ్రమించే ఓ విశ్వ విహారిని నేను

 

తెల్లవారు ఝామున

తమస్సామ్రాజ్యాన

వేగంగా కదిలే కనుపాపల్లో పుట్టి

విచ్చుకున్న కనురెప్పలతో పాటుగా

విరిగి పడి కరిగిపోయే కమ్మనికలలా

జననం లోంచి మరణంలోకి

జారిపడే జీవిత రహస్యాన్ని నేను

 

అత్యున్నత  పర్వతాల

పాదాల చెంత ప్రాణం పోసుకుని

మెలికలెన్నో తిరుగుతూ

లోతైన సంద్రపు ఒడిని చేరుకునే మహానదం వంటి

మహోధృతమైన ఆలోచనా పరంపరను

నిర్వికారంగా నిలబడి చూసే

మనిషిలోని పరమాత్మను నేను!!!

*

Download PDF ePub MOBI

(Image Courtesy: https://www.flickr.com/photos/sbisson/7258767918)

Posted in 2014, ఏప్రిల్, కవిత and tagged , , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.