cover

అది చేసేదెవరు?

Download PDF ePub MOBI

రాగం: గౌళి పంతు
ఆది తాళం
గానం: శ్రీ విద్య బదరీ నారాయణన్
స్వర రచన: వేంకట రామన్ సత్యనారాయణ
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

అది చేసేదెవరు? అంతర్యామి
అది చేసేదెవరూ?
అది చేసేదెవరూ అంతా తానై
పని చేసేదెవరూ?
తుదఁ జూపేదెవరు అంతర్యామి
అది చేసేదెవరూ?
పది బుఱ్ఱల పాము
పాముకు పదునెక్కిన కోఱా
పట్టున నిలదీసీ కోఱలు
సరిదీసే దెవరు? అంతంత దీని
మదఁమాచే దెవరు?
అంతర్యామి
ఎదఁ నాచేదెవరూ?
మది చీకుల చింత
మందేలేని వెత వేసరు వంత
చీకటి చేయూని చిక్కులు
విడదీసే దెవరూ? ఎంతో వింత
కడఁ గాచేదెవరు? అంతర్యామి
అది చేసేదెవరూ?
నది సంగడి బతుకు
నట్టేటను నడు మునుకల బెఱుకు
నడికట్టుకు నావో రేవో
నిలువోపే దెవరు? అంతో ఇంతో
తలపోసే దెవరూ ఇంతా చూడ
అది చేసేదెవరూ?
ఇది యొక తిరకాసు
ఇటు నటూ చెదరి చెడు తక్కెడ త్రాసూ
తూకము సరిదిద్దే తీరుపరి
నీకంటే ఎవరూ? అన్నామల
నేనంటే ఎవరూ? అంతర్యామి
నేనంటే ఎవరూ?
(For చలసాని ప్రసాద్, for గ్రంధాలయం మేడ)

Download PDF ePub MOBI

 

 

Posted in 2014, మే, స్వరం and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.