cover2

శృంగారం

మాట – ధర్మం, అంటుంది.
దేహం – మర్మం, వింటుంది.
అనువుకానప్పుడు, కఠినశిలను ఒరిసిన నొప్పి.
మనసైనప్పుడు, నీటిమడుగున ఈదిన హాయి.
భావం మీద భౌతిక విజయం!
భౌతికం మీద భావ విజయం!!
— ‘రాజి’
Download PDF ePub MOBI
Posted in 2014, మే and tagged , , .

3 Comments

  1. కవిత బావుంది. ఈ మధ్యనే రాజిరెడ్డిగారి పుస్తకాలు చదివాను. ప్రత్యేకమైన శైలి చక్కని భావుకత్వంతో కూడిన వాక్యాలు. “మనకు ప్రతిదీ భౌతికంగా కనపడితేగానీ అర్థంకాదు కాబట్టి, సృష్టి ఆమెను సృజించివుండొచ్చు. విచిత్రం! సృష్టి తనను తానే సృష్టించుకుంది” – అంటూ స్త్రీని వచనంలో నిర్వచించినా – చక్కని కవితలానే వుంది. ఇక పోతే బొమ్మ – కినిగె పత్రిక ఫ్యామిలీ పత్రిక. చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు వున్న చోట అలాంటి బొమ్మలు ఇబ్బందిగా వుంటాయేమో?!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.