cover

నాలుగు గోడలు

Download PDF ePub MOBI

.
నువ్వు వెళ్ళిపోవడం చూడడం మానేస్తాను!
.
ఖాళీతనం అనుకోవడం ఇప్పటికిది రెండవసారి
దిగులు మధ్యనే జీవన నిర్మాణం అంటున్నావు
.
ఈ నాలుగు గోడలు
ఊడలు దించుకున్న వృక్షంలా భయపెడుతోంది
.
ఇది వెలుతురు ఉన్న చీకటి
నమ్ముతావా
నమ్మవు
.
చీకటిచేసి అరచేతులు వెచ్చగా పట్టుకుంటావు
ఖాళీతనం ఒక వస్తువు అంటావు
పారేస్తే పోతుంది అంటావు
హృదయపు లోతుల గానాన్ని నువ్వు ఎందుకు వినవు
.
నువ్వు పరిచితుడివా అపరిచితుడవా
విస్మయాలలోకి కొత్త దృశ్యాలలోకి తోసేయ్యకు
దీర్ఘనిశ్వాసలోకి ఒదిగి పోకు
ఆత్మ శాంతిని పొందలేదు
.
నువ్వు వెళ్ళావో
వున్నావో
అర్థం కాని ఖాళీతనం
ఎదురుచూడలేని బలహీనత

*

Download PDF ePub MOBI
Posted in 2014, కవిత, మే and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.