cover

‘సప్త’ స్వర వినోదం – జూన్ 2014

గత సంచికలో ‘సప్త’స్వర వినోదం శీర్షికకు మంచి స్పందన వచ్చింది. కాకపోతే కొందరు వినోదం ఇంకాస్త సులభంగా ఉంటే బాగుండేదేమో అని సూచనలిచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ సంచికలో ఎక్కువమంది పాల్గొనే వీలుగా ప్రాచుర్యం చెందిన (యుగళ) గీతాల చరణాలే ఇచ్చాం. సులువైనవే కానీ.. సంగీతపరంగా, సాహిత్యపరంగా పలచనైనవి కావు. మీరు చేయాల్సింది ఇక్కడ ఇచ్చిన ‘యుగళ గీతాల’ చరణాలకు పల్లవులు వెతికిపెడుతూ, పనిలో పనిగా ఈ ఏడింటిని కలిపి ఉన్న అంతఃస్సూత్రం కనిపెట్టాలి. గమనిస్తే అసలు సూత్రంతో పాటు మరో పిల్ల సూత్రం బయటపడుతుంది. ఒకదానికొకటి జమిలిగా మెలితిరిగిన ఆ రెండు సూత్రాలను కనిపెట్టండి. మీ జవాబులను ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. దాన్ని వచ్చే నెల ఫలితాలు ప్రకటించేవరకూ అప్రూవ్ చేయం. లేదా మీ కామెంట్లను ఈమెయిలుగా editor@kinige.comకు మెయిల్ చేయవచ్చు. అన్నీ సరైన సమాధానాలతో మాకందిన మొదటి ఎంట్రీకి చిన్న బహుమతి ఉంటుంది. సరైన జవాబులు ఇచ్చిన అందరి పేర్లూ ఫలితాల్లో ప్రస్తావిస్తాము.

 

1.

“చుక్కలే నిను మెచ్చీ పక్కనే దిగివచ్చీ

మక్కువే చూపితే నన్ను మరిచేవో…

నన్ను మరివేవో…

చుక్కలు వేలు ఉన్నా… నా చుక్కి ఒక్కటే కాదా

లక్షల మగువలు ఉన్నా… నా లక్ష్యమొక్కటే కాదా

నా లక్ష్మి ఒక్కతే కాదా…”

క్లూ: కొర్రపాటి గంగాధరరావు నవల ఆధారంగా నిర్మించిన చిత్రం. కథానాయిక ఒకనాటి ప్రముఖ బాలనటి, నేటి యువ హీరో తల్లి.

 .

2.

“చూపుల శృంగార మొలికించినావూ

ఆఁ… ఆఁ… ఆఁ…

మాటల మధువెంతొ చిలికించినావూ

వాడని అందాల, వీడని బంధాల

తోడుగ నడిచేములే…”

క్లూ: యద్ధనపూడి సులోచనారాణి అందించిన కథాచిత్రం. అక్కినేని సరసన వాణిశ్రీ తొలిసారి కథానాయికగా నటించారు.

.

3.

“మల్లెపూలు పూచే చల్లని వేళ – మనసులు కలపాలీ

అల్లరి చేసే పిల్లగాలిలో – ఆశలు పెంచాలీ

ఒంటరితనమూ ఎంతకాలమూ

జంట కావాలీ… నీకొక జంటకావాలీ

ఇటు చూడవా, మాటాడవా – ఈ మౌనం నీకేలా..”

క్లూ: ఇది కూడా సులోచనారాణి నవల ఆధారంగా వచ్చిన చిత్రమే. ఆంధ్రుల అందాల కథానాయకుడి సరసన సత్యజిత్రే మెచ్చిన తెలుగు అందం.

4.

“మధుర మనోహర మోహన గీతం…

మదిలో మెదిలే మమతల సారం

రమ్మని పిలిచే యమునాతీరం…

రాధా మాధవ రాగ భావ తాళ గీతిలో…”

క్లూ: క్లూ 1 లో మీరు కనుగొన్న కథానాయిక నిజ జీవిత కథానాయకుడు, (బుల్లితెర) ‘ఋతురాగాల’ నాయికలపై చిత్రీకరించబడిన పాట.

5.

“పిల్లగాలిలో నేనందించిన – పిలుపులే విన్నావో…

నీలి మబ్బుపై నే లిఖించిన – లేఖలందుకున్నావో…”

క్లూ: వెండితెర మీదే కాదు, బాహ్యప్రపంచంలోనూ భార్యాభర్తలైన జంటపై చిత్రీకరించిన యుగళం.

6.

“పరువాలు పల్లవి పాడగా – నయనాలు సయ్యాట లాడగా

నిను చేరుకోగా నునుమేని తీగా

పులకించిపోయెను… తొలకరి వలపుల”

క్లూ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా వచ్చిన ఈ చిత్రంలో నందమూరి అందగాడు కథానాయకుడు కాగా, ఆయన జోడీగా రాజశ్రీ నటించారు.

7.

“చిగురించిన ఈ అనురాగం – వికసించునులే కలకాలం

నీ వలపే నేనై – నా వెలుగే నీవై

కమ్మని మమతల బంగరు మేడల

కలలే కందామా… కలలే కందామా…”

క్లూ: ఈ పాటకు డాన్స్ చేసిన సొట్టబుగ్గల అమ్మాయి బాలనటిగా ఉన్నప్పుడు ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అని మనకు బోధించింది.

నిర్వహణ: ఇశైతట్టు

 

Posted in 2014, జూన్, స్వరం and tagged , , , , .

4 Comments

 1. అన్నీ పాప్యులర్ పాటలే కానీ, కనిపెట్టడం అంత సులభం కాలేదు..! :)

  1
  ఈ పాల వెన్నెల్లో .. నీ జాలి కళ్ళల్లో
  ఇద్దరూ ఉన్నారూ .. ఎవ్వరూ వారెవరూ
  (చిత్రం: లంబాడోళ్ళ రాందాసు; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; గానం: బాలు, సుశీల)

  2
  చిలిపి నవ్వుల నిను చూడగానే.. వలపు పొంగేను నాలోనా
  ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో .. నిన్ను నే చేరుకున్నానూ
  (చిత్రం: ఆత్మీయులు; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; గానం: బాలు, సుశీల)

  3
  నీవే జాబిలీ.. నీ నవ్వే వెన్నెలా
  ఇటు చూడవా, మాటాడవా, ఈ బింకం నీకేలా
  (చిత్రం: రాధాకృష్ణ; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; గానం: బాలు, సుశీల)

  4
  కలిసిన హృదయాలలోనా .. పలికెను అనురాగవీణా
  (చిత్రం: ప్రేమ-పగ; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; గానం: బాలు, వాణీ జయరాం)

  5
  మ్రోగింది కల్యాణ వీణా.. నవ మోహన జీవన మధువనిలోనా
  మ్రోగింది కల్యాణ వీణా..మ్రోగింది కల్యాణ వీణా..
  (చిత్రం: కురుక్షేత్రం; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; గానం: బాలు, సుశీల)

  6
  ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
  ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
  (చిత్రం: చిట్టి చెల్లెలు; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; గానం: బాలు, సుశీల)

  7
  నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను
  ఆ నవ్వులలో ఆ చూపులలో నిను కవ్వించే వాడెవ్వడో
  (చిత్రం: అమాయకురాలు; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; గానం: బాలు, సుశీల)

  అంతఃస్సూత్రం: అన్నీ రాజేశ్వరరావు గారు సంగీతం చేసిన పాటలు!
  ఇంకో సూత్రం: మేల్ వాయిస్ అన్ని పాటలకీ బాలూ గారే!!

 2. 1. ఈ పాల వెన్నెల్లో,నీ జాలి కళ్ళల్లో
  ఇద్దరూ ఉన్నారు… ఎవ్వరూ, వారెవ్వరూ
  సినిమా : లంబాడోళ్ళ రాందాసు

  2. చిలిపి నవ్వుల నిను చూడగానే… వలపు పొంగేను నాలోనే
  ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో… నిన్ను నే చేరుకున్నాను
  సినిమా: ఆత్మీయులు

  3. నీవే జాబిలి,నీ నవ్వే వెన్నెల
  ఇటు చూడవా,మాటాడవా ,ఈ బింకం నీకేలా
  సినిమా: రాధాకృష్ణ

  4.కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ
  మధుర మనోహర మోహన గీతం …మదిలో మెదిలే మమతల సారం
  సినిమా: ప్రేమ-పగ

  5. మ్రోగింది కళ్యాణ వీణ… నవ మోహన జీవన మధువనిలోన
  సినిమా: కురుక్షేత్రం

  6. ఈ రేయి తీయనిది… ఈ చిరుగాలి మనసైనది
  ఈ హాయి మాయనిది… ఇంతకు మించి ఏమున్నది
  సినిమా: చిట్టి చెల్లెలు

  7. నీ చూపులు గారడి చేసెను… నీ నవ్వులు పూలై పూచెను
  ఆ నవ్వులలో ఆ చూపులలో నిను కవ్వించేవాడెవడో
  సినిమా: అమాయకురాలు

  ఈ ఏడింటిని కలిపి ఉన్న అంతఃస్సూత్రం: సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర రావు గారు
  మరో సూత్రం (guessing): గీత రచయితలు సి.నారాయణ రెడ్డి గారు (1,5,6,&7) దాశరధి గారు (2,3,4)

  -జ్యోతి .

 3. చుక్కలే నిను మెచ్చీ పక్కనే దిగివచ్చీ
  మక్కువే చూపితే నన్ను మరిచేవో
  నన్ను మరివేవో
  చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కటే కాదా
  లక్షల మగువలు ఉన్నా నా లక్ష్యమొక్కటే కాదా
  నా లక్ష్మి ఒక్కతే కాదా

  ఈ చరణానికి పల్లవి : ఈ పాల వెన్నెల్లో ఈ జాలి కళ్లల్లో…
  చిత్రం : లంబడోళ్లరాందాసు, సంగీతం : సాలూరి రాజేశ్వరరావు,
  2.

  చూపుల శృంగార మొలికించినావూ
  మాటల మధువెంతొ చిలికించినావూ
  వాడని అందాల, వీడని బంధాల
  తోడుగ నడిచేములే

  ఈ చరణానికి పల్లవి : చిలిపి నవ్వుల నినుచూడగానే వలపు పొంగేను నాలోనే
  చిత్రం : ఆత్మీయులు, సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

  3.
  మల్లెపూలు పూచే చల్లని వేళ మనసులు కలపాలీ
  అల్లరి చేసే పిల్లగాలిలో ఆశలు పెంచాలీ
  ఒంటరితనమూ ఎంతకాలమూ
  జంట కావాలీ నీకొక జంటకావాలీ
  ఇటు చూడవా, మాటాడవా ఈ మౌనం నీకేలా..

  ఈ చరణానికి పల్లవి : నీవే జాబిలి..నీ నవ్వె వెన్నెల
  చిత్రం : రాధాకృష్ణ, సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
  .
  4.
  మధుర మనోహర మోహన గీతం
  మదిలో మెదిలే మమతల సారం
  రమ్మని పిలిచే యమునాతీరం
  రాధా మాధవ రాగ భావ తాళ గీతిలో

  ఈ చరణానికి పల్లవి : కలసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ
  చిత్రం : ప్రేమ-పగ, సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
  .
  5.

  పిల్లగాలిలో నేనందించిన పిలుపులే విన్నావో
  నీలి మబ్బుపై నే లిఖించిన లేఖలందుకున్నావో

  ఈ చరణానికి పల్లవి : మ్రోగింది కల్యాణ వీణ నవ మోహన జీవన మధువనిలోనా
  చిత్రం : కురుక్షేత్రం , సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

  .
  6.

  పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాట లాడగా
  నిను చేరుకోగా నునుమేని తీగా
  పులకించిపోయెను తొలకరి వలపుల

  ఈ చరణానికి పల్లవి : ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది
  చిత్రం : చిట్టి చెల్లెలు, సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
  .
  7.

  చిగురించిన ఈ అనురాగం వికసించునులే కలకాలం
  నీ వలపే నేనై నా వెలుగే నీవై
  కమ్మని మమతల బంగరు మేడల
  కలలే కందామా కలలే కందామా

  ఈ చరణానికి పల్లవి : నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను ఆ నవ్వులలో.. ఆ చూపులలో.. నిను కవ్వించేవాడెవ్వడో.
  చిత్రం : అమాయకురాలు, సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

  ఈ ఏడింటిని కలిపి ఉన్న అంతఃస్సూత్రం అన్నింటికీ సాలూరి రాజేశ్వరరావు మాస్టారు సంగీతాన్ని అందించడం… అన్ని పాటలు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పాడటం… గాయనీమణులు మారి ఉండవచ్చు… పురుషకంఠం మాత్రం బాలుదే! అలాగే ఇందులో కొన్ని పాటలు సి.నారాయణరెడ్డి రాసినవి…మరికొన్ని దాశరథి రాసినవి! ఇద్దరూ తెలంగాణ కవులు కావడం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.