cover

అబ్బాయి ఆట

Download PDF ePub MOBI

.
మల్లె పొదను
గాలి తట్టి లేపాక
తెల్ల మబ్బులు
ఎటో ఎగిరి వెళ్ళాక
.
మసక వెలుతురు
వీధి వాకిలి చేరాక
సందె మల్లెలు
మెడలు తిప్పి చూసాక
.
రాత్రి దీపాలు
నింగిన ముగ్గులేసాక
వెన్నెల్లో పూవుల
రేకలు మెరిసాక
.
అప్పుడు, ఆడీ ఆడీ
అలసిన అబ్బాయి
.
ముక్కలైన నక్షత్రాలను
చొట్టబడ్డ చందమామను
మబ్బుల బండిలో పోసేసి
.
బువ్వ పెట్టమంటూ
వంట ఇంటిలోకి
జువ్వలా
పరిగెట్టుకు వస్తాడు.

– పాలపర్తి ఇంద్రాణి

Download PDF ePub MOBI
Posted in 2014, జూన్ and tagged , , , .

4 Comments

  1. ఇంద్రాణి ! గ్రేట్ ! అలా కళ్ళముందు ఒక చిన్ని బుడతడు” అమ్మా అన్నం పెట్టు “అంటూ కళ్ళముందు కనిపిస్తున్నాడు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.