cover

వల్లప్ప

.
రాత్రంతా కాసుకొని కూర్చుని
ఈ ఒక్కమాటనూ చెక్కాలనుకున్నావు.
.
దీన్ని ఇక్కడ్నించి తీసి
అక్కడుంచి చూస్తే –
మొండికేసి కూర్చుందిది,
ఇంక ఊడిరాదు.
.
జాబిరీ ఖాళీలలోంచి
జారిపడే చూరు నీళ్ళు చూసి చూసి,
తటాల్న వంగి
ఈ ఆవిరి చార మీద
వాన రాత్రి అని రాస్తావు
తడి వేలు వణుకుతుంటే.
.
జల్లుకు చెదిరిపోయే
వానరాత్రిని
చూసి చూసి
వేచి
అస్తి పుట్టిపోయింది
నీ మీద
నీకే.

*

(Inspired by “A Poet’s Poem” by Brenda Shaughnessy)
Download PDF ePub MOBI
Posted in 2014, కవిత, జూన్ and tagged , , , , , , .

2 Comments