cover

‘సప్త’ స్వర వినోదం – జులై 2014

గతంలో మాదిరే ఈ నెల ‘సప్త’స్వర వినోదం కూడా పాఠక శ్రోతల్ని అలరిస్తుందని భావిస్తున్నాం. ఎప్పట్లానే మీరు చేయాల్సింది ఇక్కడున్న పాటల చరణాలకు పల్లవులను వెతికి పెడుతూ, పనిలో పనిగా ఈ ఏడు పాటల్ని కలిపి ఉన్న అంతఃసూత్రం కనిపెట్టాలి. (అంతఃసూత్రం: సంగీతం, నటీనటులు, నిర్మాత, దర్శకులు, గేయరచయిత, కథారచయిత, ఛాయాగ్రహణం, బేనర్ వగైరా… ఎవరైనా / ఏదైనా కావొచ్చు.) మీ జవాబులు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. వాటిని ఫలితాలు వెలువడే వరకూ అప్రూవ్ చేయం. లేదా editor@kinige.com కు మెయిల్ చేయండి. అన్నీ సరైన సమాధానాలతో మాకందిన మొదటి ఎంట్రీకి చిన్న బహుమతి షరా మామూలే. తర్వాత సరైన జవాబులు చెప్పిన అందరి పేర్లూ కూడా ఫలితాల్లో ప్రస్తావిస్తాం.

1.

“వనరాణియె అలివేణికి – సిగపూలు తురిమెనో.

రేరాణియే నా రాణికి – పారాణి పూసెనో…”

క్లూ: సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఒక విదేశీయురాలు కథానాయికగా నటించడం విశేషం.

2.

“హృదయమనేది ఆలయమూ

స్నేహము దేవుని ప్రతిరూపము

కులమేదైనా మతమేదైనా

దానికి లేదు ఆ బేధము..”

క్లూ: పేరుకు జమున ఈ సినిమా కథానాయికైనా, సినిమా అంతా భానుమతి గుప్పిట్లో ఉంటుంది.

3.

తొలిసంధ్య మలిసంధ్య వేళ – నా చెంత చెలి ఉన్న వేళ

చిరుగాలి సెలయేరులైనా – నా మనిషి తోడున్న వేళ

అరుదైన వేళ ఈ శుభవేళ – బ్రతుకే వెన్నెల వేళ.. వేళ..

క్లూ: ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ నటీమణి ఈ చిత్ర కథానాయిక కాగా, పదహారేళ్ల వయసు కథానాయకుడు ఆమెకు జంటగా నటించాడు.

4.

నీలో నాలో అనురాగాలు – వెలిగించాలి పది కాలాలు

నవ వధువును కావాలి – నీ ఎదపై వాలాలీ

పల్లకిలో పండగ చేసి – ఊరేగుతూ పొంగిపోవాలీ

క్లూ: హాస్యనటులు పద్మనాభం స్వీయదర్శకత్వంలో వచ్చిన చిత్రం.

5.

అల్లరి గాలికి నేలకు రాలే – మల్లెను దోసిట దాచావు

అనురాగముతో అల్లిన మాలగ – నీ మెడలోనే నిలిపావు

తోడు నీడా అయినావు…

క్లూ: ‘అందాలరాముడు’ హీరోయిన్‌తో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ నటించిన చిత్రం. పాట చిత్రీకరణ కూడా వారిద్దరిపైనే.

6.

చల్లగ తాకే పాల వెన్నెల – నా మనసేదో వివరించూ

అల్లరి చేసే ఓ చిరుగాలీ – నా కోరికలే వినిపించూ

నా కోవెలలో స్వామివి నీవై – వలపే దివ్వెగ వెలిగించూ…

క్లూ: ఒక పవిత్రమాసం పేరుతో ఆరంభమయ్యే ఈ చిత్రంలో ఆంధ్రుల అందాల నటుడు ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

7.

నదిలో నావా ఈ బ్రతుకూ – దైవం నడుపును తన బ్రతుకూ

అనుబంధాలూ ఆనందాలూ – తప్పవులేరా కడవరకూ…

క్లూ: దశాబ్దకాలం కథానాయికగా చక్రం తిప్పిన ఒక హీరోయిన్ తొలిచిత్రం ఇది. ఇందులో ఆమె జమున కూతురుగా నటించారు.

– నిర్వహణ: ఇశైతట్టు

Posted in 2014, జులై and tagged , , , , .

12 Comments

 1. ఈ పాటల చిత్రాలు వరుసగా… 1. అమెరికా అమ్మాయి 2. మట్టిలో మాణిక్యం 3. ఏది పాపం? ఏది పుణ్యం? 4. జాతకరత్న మిడతంభొట్లు 5. గాంధీ పుట్టిన దేశం 6. కార్తీక దీపం 7. పండంటి కాపురం

  ఈ ఏడు పాటలను కలిపి ముడివేసిన అంత:సూత్రం – ఇవి అన్నీ ‘మైలవరపు గోపీ’ గారి కలం నుంచి వెలువడిన అక్షర పారిజాతాలు! [పిల్ల సూత్రం ఏమీ అడగలేదు కనుక వ్రాయటం లేదు…]

 2. 1) అమెరికా అమ్మాయి సినిమా – ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా…
  2) మట్టిలో మాణిక్యం – మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాటా…
  3) ఏది పాపం? ఏది పుణ్యం – కాలమిలా ఆగిపోనీ…
  4) జాతకరత్నం మిడతంభొట్లు – నీ చేయి నా చేయి పెనవేసి బాస చేయి…
  5) గాంధీ పుట్టిన దేశం – వలపే వెన్నెలగా బతుకే పున్నమిగా…
  6) కార్తిక దీపం – నీ కౌగిలిలో తల దాచి…
  7) పండంటి కాపురం – ఇదిగో దేవుడు చేసిన బొమ్మా…

  ఈ పాటలన్నిటిని రచించినది మైలవరపు గోపి.

 3. 1. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక – అమెరికా అమ్మాయి

  2. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట – మట్టిలో మాణిక్యం

  3. కాలమిలా ఆగిపోనీ – ఏది పాపం, ఏది పుణ్యం?

  4. నీ చేయి నాచేయి పెనవేసి బాస చెయ్యి – జాతక రత్న మిడతంభొట్లు

  5. వలపే వెన్నెలగా – గాంధి పుట్టిన దేశం

  6. నీ కౌగిలిలో తలదాచి – కార్తీక దీపం

  7. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ – పండంటి కాపురం

  అంతః సూత్రం : ఈ పాటలన్నీ వ్రాసిన వారు మైలవరపు గోపి.

 4. 1. ఒక వేణువు వినిపించెను – అమెరికా అమ్మాయి

  2. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట – మట్టిలో మాణిక్యం

  3. కాలం ఇలా ఆగిపోనీ – ఏది పాపం ఏది పుణ్యం

  4. నీ చేయీ, నా చేయీ పెనవేసి చూడు – జాతకరత్న మిడతంభొట్లు

  5. వలపే వెన్నెలగా – గాంధీ పుట్టిన దేశం

  6. నీ కౌగిలిలో – కార్తీక దీపం

  7. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ – పండంటి కాపురం

  ఈ పాటలన్నీ మైలవరపు గోపి రాసారు.

  నిన్న పొరపాటున కృష్ణ శాస్త్రి అని రాసి పంపాను, నిద్రమత్తులో!

  Thanks
  -Brahmanandam

 5. 1. ఒక వేణువు వినిపించెను – అమెరికా అమ్మాయి

  2. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట – మట్టిలో మాణిక్యం

  3. కాలం ఇలా ఆగిపోనీ – ఏది పాపం ఏది పుణ్యం

  4. తనువూ నీదే మనసూ నీదే – కథానాయిక మొల్ల

  5. వలపే వెన్నెలగా – గాంధీ పుట్టిన దేశం

  6. నీ కౌగిలిలో – కార్తీక దీపం

  7. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ – పండంటి కాపురం

  ఈ పాటలన్నీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాసారు.

 6. 1. ఒక వేణువు వినిపించెను,అనురాగ గీతిక – అమెరికా అమ్మాయి

  2. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాటా నీ బ్రతుకంత సాగాలి పూల బాట-మట్టిలో మాణిక్యం

  3. కాలమిలా ఆగిపోనీ…కల నిజమై సాగిపోనీ-ఏది పాపం ? ఏది పుణ్యం

  4. నీ చేయి నా చేయి పెనవేసి బాస చెయ్యి-జాతకరత్న మిడతంబొట్లు

  5. వలపే వెన్నెలగా , బ్రతుకే పున్నమిగా- గాంధీ పుట్టిన దేశం

  6. నీ కౌగిలిలో తల దాచి, నీ చేతులలో కనుమూసి-కార్తీక దీపం

  7. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో మూడు రోజులూ-పండంటి కాపురం

  అంతఃసూత్రం: గీత రచయిత మైలవరపు గోపి

 7. 1 వేణువు వినిపించెను అనురాగ గీతిక ..
  2 మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాటా
  3 కాలమిలా ఆగిపోని కలనిజమయి సాగిపోని
  4 నీ చేయి న చేయి పెనవేసి బాస చేసి
  5 వలపే వెన్నెలగా .. బ్రతుకే పున్నమిగా..
  6 నీ కొగిలి లో తల దాచి ..
  7 ఇదిగో దేవుడు చేసిన బొమ్మా …
  ఈ పాటలన్నిటి అంతః సూత్రం .. ఈ అన్ని పాటలు రాసింది మైలవరపు గోపి

 8. 1.

  వణరాణియె అలివేణికి సిగపూలు తురిమెనో.
  రేరాణియే నా రాణికి పారాణి పూసెనో

  ఈ చరణానికి పల్లవి ..
  ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
  ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
  ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
  చిత్రం : అమెరికా అమ్మాయి
  సంగీతం : జి.కె.వెంకటేష్‌.
  పాడింది : జి.ఆనంద్‌
  రాసింది : మైలవరపు గోపి

  2.

  హృదయమనేది ఆలయమూ
  స్నేహము దేవుని ప్రతిరూపము
  కులమేదైనా మతమేదైనా
  దానికి లేదు ఆ బేధము..

  ఈ చరణానికి పల్లవి ..
  మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట…నీ బ్రతుకంత కావలి పూలబాట..
  మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట…నీ బ్రతుకంత కావలి పూలబాట..
  పచ్చగా నూరేళ్ళు వుండాలని …నా నెచ్చలి కలలన్ని పండాలని
  మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట… నీ బ్రతుకంత కావలి పూలబాట..

  చిత్రం : మట్టిలో మాణిక్యం
  సంగీతం : సత్యం
  పాడింది : సుశీల
  3.

  తొలిసంధ్య మలిసంధ్య వేళ నా చెంత చెలి ఉన్న వేళ
  చిరుగాలి సెలయేరులైనా నా మనిషి తోడున్న వేళ
  అరుదైన వేళ ఈ శుభవేళ బ్రతుకే వెన్నెల వేళ.. వేళ..

  ఈ చరణానికి పల్లవి..
  కాలమిలా ఆగిపోని..కలనిజమై సాగిపోని
  అన్ని మరచి…ఈ నిమిషంలో ..నీ ఒడిలోనే నిదురపోని

  చిత్రం : ఏదీపాపం? ఏదీ పుణ్యం?
  పాడింది : బాలు సుశీల

  4.

  నీలో నాలో అనురాగాలు వెలిగించాలి పది కాలాలు
  నవ వధువును కావాలి నీ ఎదపై వాలాలీ
  పల్లకిలో పండగ చేసి ఊరేగుతూ పొంగిపోవాలీ

  ఈ చరణానికి పల్లవి
  నీ చేయి నా చేయి…పెనవేసి బాస చేయ్యి..
  నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
  సాక్షులు మన రెండు హృదయాలు…
  చిత్రం : జాతకరత్నం మిడతంబొట్లు
  సంగీతం : ఎస్‌.పి.కోదండపాణి
  పాడింది : బాలు, సుశీల

  5.

  అల్లరి గాలికి నేలకు రాలే మల్లెను దోసిట దాచావు
  అనురాగముతో అల్లిన మాలగ నీ మెడలోనే నిలిపావు
  తోడు నీడా అయినావు

  ఈ చరణానికి పల్లవి
  వలపే వెన్నెలగా..బ్రతుకే పున్నమిగా..
  జతగా గడిపే చల్లని ఈ రేయి
  ఎపుడు ఇటులే నిలవాలి
  ఈ కలలే నిజమై విరియాలి
  చిత్రం : గాంధీపుట్టిన దేశం
  సంగీతం : ఎస్‌.పి.కోదండపాణి

  6.

  చల్లగ తాకే పాల వెన్నెల నా మనసేదో వివరించూ
  అల్లరి చేసే ఓ చిరుగాలీ నా కోరికలే వినిపించూ
  నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించూ

  ఈ చరణానికి పల్లవి..
  నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
  జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ

  చిత్రం : కార్తీకదీపం
  పాడింది : జానకి
  సంగీతం : సత్యం

  7.

  నదిలో నావా ఈ బ్రతుకూ దైవం నడుపును తన బ్రతుకూ
  అనుబంధాలూ ఆనందాలూ తప్పవులేరా కడవరకూ
  ఈ చరణానికి పల్లవి
  ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
  ఇది నిలిచేదేమో మూడు రోజులు
  బంధాలేమో పదివేలు
  చిత్రం : పండంటి కాపురం
  పాడింది : ఎస్‌.పి.కోదండపాణి, సుశీల
  సంగీతం : ఎస్‌.పి.కోదండపాణి

  ఎప్పట్లానే పాటల చరణాలకు పల్లవులను కనుకున్నాను కానీ…ఈ ఏడుపాటలను కలిపి ఉన్న అంతఃసూత్రమే కాసింత ఇబ్బంది పెట్టింది…ఆలోచించగా…చించగా…తేలిందేమిటంటే ఈ అన్ని పాటలను రాసింది మైలవరపు గోపి అని!

 9. 1.oka venuvu vinipinchenu…..america ammai
  2.malli malli padali e pata…..mattilomanikyam
  3. kalamila aagiponi…………….edi papam..edi punyam
  4.nee cheyi nacheyee penavesi…jetakaratna midatambhotlu
  5.valape vennelaga……..gandhi puttina desam
  6.nee kougililo taladachi…..karthika deepam
  7 idigo devudu chesina bomma….pandanti kapuram
  all sgongs play back singer p.suseela (comman)

 10. 1.
  ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
  ఒక రాధిక అందించెను నవరాగ మాలికా
  (అమెరికా అమ్మాయి – గోపి – జి కె వెంకటేష్ – జి ఆనంద్)

  2.
  మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాటా నీ బ్రతుకంత సాగాలి పూల బాట
  పచ్చగ నూరేళ్ళు ఉండాలనీ నా నిచ్చెలి కలలన్ని పండాలని
  (మట్టిలో మాణిక్యం – గోపి – సత్యం – పి సుశీల)

  3.
  కాలమిలా ఆగిపోనీ కల నిజమై సాగిపోనీ
  అన్నీ మరిచి ఈ నిమిషంలో నీ ఓడిలోనే నిదురపోనీ
  (ఏది పాపం? ఏది పుణ్యం – గోపి – సత్యం – బాలు, సుశీల)

  4.
  నీ చేయి నా చేయి పెనవేసి బాస చెయ్యి
  నాతోడు ఈ బంధం కలకాలం ఉండనియ్యి
  సాక్షులు మన రెండు హృదయాలు
  (జాతకరత్న మిడతంబొట్లు – గోపి – కోదండపాణి – బాలు, సుశీల)

  5.
  వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా
  జతగా గడిపే చల్లనీ ఈ రేయి
  ఎపుడూ ఇటులే నిలవాలి
  (గాంధి పుట్టిన దేశం – గోపి – కోదండపాణి – బాలు, సుశీల)

  6.
  నీ కౌగిలిలో తలదాచీ – నీ చేతులలో కనుమూసీ
  జన్మ జన్మకూ జతగా నిలిచే వరమే నన్నూ పొందనీ
  (కార్తీకదీపం – గోపి – సత్యం – బాలు, జానకి)

  7.
  ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
  ఇది నిలిచేదేమో మూడురోజులూ – బంధాలేమో పదివేలూ
  (పండంటి కాపురం – గోపి – కోదండపాణి – కోదండపాణి, సుశీల)

  ————————————-
  అంతస్సూత్రం: అన్నీ మైలవరపు గోపి గారు రాసిన పాటలే!
  ————————————-

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.