coverfinal

జూన్ నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

జూన్ నెల ‘సప్త’స్వర వినోదం శీర్షికకు ఐదుగురు స్పందించారు. అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులు ఈ క్రింద ఇస్తున్నాం. వినటానికి ఆ పాటల లింక్స్ కూడా ఇస్తున్నాం.

1. ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్లల్లో…
ఇద్దరూ ఉన్నారూ.. ఎవ్వరూ వారెవరూ?
(చిత్రం: లంబాడోళ్ల రాందాసు)

.
2. చిలిపి నవ్వుల నిను చూడగానే.. వలపు పొంగేను నాలోనే..
ఎన్ని జన్మల ఈ పుణ్యఫలమో నిన్ను నే చేరుకున్నాను
(చిత్రం: ఆత్మీయులు)

.
3. నీవే జాబిలి నీ నవ్వే వెన్నెలా
ఇటు చూడవా.. మాటాడవా.. ఈ బింకం నీకేలా?
(చిత్రం: రాధాకృష్ణ)

.
4. కలిసిన హృదయాల లోన.. పలికెను అనురాగ వీణ
(చిత్రం: ప్రేమ – పగ)

.
5. మ్రోగింది కళ్యాణ వీణా.. నవ మోహన జీవన మధువనిలో
(చిత్రం: కురుక్షేత్రం)

.
6. ఈ రేయి తీయనిది.. యీ చిరుగాలి మనసైనదీ
ఈ హాయి మాయనిదీ.. ఇంతకు మించి ఏమున్నదీ…
(చిత్రం: చిట్టిచెల్లెలు)

.
7. నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను
(చిత్రం: అమాయకురాలు)

అన్ని పాటల్లోనూ అంతస్సూత్రం: ఈ పాటలన్నీ సాలూరు రాజేశ్వరరావు సంగీతంలో వచ్చినవి కావడం. పిల్ల సూత్రం: ప్రతి పాటలోనూ ఎస్.‌పి. బాలసుబ్రహ్మణ్యం గళం వినిపించటం.

అందరికన్నా ముందుగా జవాబులు పంపినవారు: తృష్ణ (ఈమెయిల్‌కి పంపారు); కానీ ఆవిడ పిల్ల అంతస్సూత్రం (అన్ని పాటలూ బాలసుబ్రహ్మణ్యమే పాడారన్నది) చెప్పలేదు. కాబట్టి తర్వాత జవాబు పంపిన బి. బాలసుబ్రహ్మణ్యం గారినే ఎంపిక చేస్తున్నాం.

తర్వాత జవాబులు పంపినవారు వరుసగా: జ్యోతి (పిల్లసూత్రం చెప్పలేకపోయారు), ఎ.వి.రమణమూర్తి, కరుణాకర్ (సినిమాల పేర్లు చెప్పారు గానీ, పల్లవులు చెప్పలేదు).

పాల్గొన్నందుకు వీరందరికీ కృతజ్ఞతలు.

 

Posted in 2014, జులై, స్వరం and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.