cover

అనుకోకుండా (5)

Download PDF ePub MOBI

ఏదైనా సరే, మొదలు పెట్టేప్పుడు ఎందుకో తెలీదు కదా?

ఆకాశం ఎర్రగా ఉందనే అబద్ధంతో కలుస్తాం. భూమ్మీద కొంచం చోటైనా దొరకని వాస్తవాన్ని కలవరిస్తాం. పాటలు వీస్తే తోటల్ని తగలబెట్టాలని తెలుసుకోకుండానే బతికేస్తాం.

*

మెట్లదాకా వెళ్ళి మంచినీళ్ల వంకతో వెనక్కొస్తావు. గొంతు వరకూ వచ్చిన దుఃఖాన్ని గది లోపలికి తోస్తాను. ఎండిన పూరేకలు పుస్తకంలోంచి జారి పడతాయని చదవటం మానేస్తాను.

పగడాలు పూసలుగా, కెంపులు రాళ్ళుగా మన చుట్టూ ఒక సాయంత్రం పుట్టడాన్ని చూశాం. ఒక జపనీ హైకూని వలుచుకుని మన అక్షరాలు రాగాల్ని రేపడమూ విన్నాం.

గాలి నిలిచిపోయి ఏనాటివో మాటలు గలగలమంటే – ఇక కావల్సిందేం లేదని రెప్పలు తెరుచుకున్నాం.

*

టీ లో అల్లం రసం మరుగుతూనే ఉంది. ఆటో పొగలో సూర్యాస్తమయం ఆగిపోయింది. టికెట్టు వెనక రాసిన చిల్లర ఇవ్వకుండానే బస్సు కదిలిపోయింది.

“మళ్ళీ ఎప్పుడు?” అంటే “ఇక చాలు” అనే అర్థం కాస్త ఆలస్యంగా తెలిసింది.

*

Download PDF ePub MOBI

(Image Courtesy: https://www.flickr.com/photos/jacek_nl/3539267064)

Posted in 2014, జులై and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.