cover

ఊపిరాడనిస్తలేదు

.
మనసును చల్లబరిచే నిమిషాలేవీ
కానరాక పోవటం చేత
దిగులు నీడ
వెంట నడుస్తున్నది
.
ఒక నిర్వృత్త తహ తహ
పాలిపోయిన భీతి
తేలిక తేలిక చలనం
.
ఒక్కోసారి ఇట్లాంటప్పుడు
ప్రపంచంలోకి నేనెందు కొచ్చానో తెలియని ఊహ చేసే
మందలింపులను వేడుకోలేను… ఏదీ వదులుకోలేనితనం చేత
.
అంతా ఖాళీ అవ్వాలి
బూజు నగిషీల నెంత కాలం
శుభ్రానికి నోచనివ్వమో… ఎట్లో తెలియదు.
.
మైనస్ వస్తువుల ద్వీప మధ్యంలోకి
స్వేచ్ఛను పరిమళింప చేసే ఆవేశం
ఎదుటపడితే బాగుండు
.
నన్నులోకి తోసే ఘడియను
కొంచెం ముందుకు తొయ్యలేవా?
.
పాకలేని తీగలిక
దుఃఖం లేక ఎండి పోతాయి
ఒక ఎండాకాలపు సాయం గాలికి
అవీ కొట్టుకు పోతాయి
.
దీపం చుట్టూ కోరికలు ముసురు కుంటున్నాయి
నన్ను నేను భరించు కోవటమే
తగినంత సాఫల్యం

— పులిపాటి గురుస్వామి

Download PDF ePub MOBI

(Image Courtesy: https://www.flickr.com/photos/shmoon/3619602763)

Posted in 2014, కవిత, జులై and tagged , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.