cover

‘సప్త’ స్వర వినోదం – ఆగస్టు 2014

మేం నిర్వహిస్తున్న ‘సప్త’స్వర వినోదం కినిగె పాఠక శ్రోతలను అలరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ నెల కూడా ఎప్పట్లానే ఇక్కడ ఏడు పాటల చరణాలు ఇస్తున్నాం. ఆయా పాటల పల్లవులతో పాటు వీటన్నిటికీ కలిపి ఉన్న అంతఃసూత్రాన్ని మీరు పంపే జవాబుల్లో రాయండి (అంతఃసూత్రం: సంగీతం, నటీనటులు, నిర్మాత, దర్శకులు, గేయరచయిత, కథా రచయిత, ఛాయాగ్రహణం, సంస్థ – వగైరా ఎవరైనా/ ఏదైనా కావచ్చు). కొందరు పాఠక శ్రోతలు మేమిస్తున్న చరణాలనే తిరగరాస్తూ, పూర్తి వివరాలు – గాయకులు, సంగీతం, గీతరచయిత, సినిమా పేరు వంటివి కూడా రాస్తున్నారు. అవసరం లేదు. కేవలం చరణం సీరియల్ నెంబరు వేసి, పక్కన పాట పల్లవిని రెండు లైన్లలో రాసి, చివర్లో అంతఃసూత్రం రాస్తే సరిపోతుంది. మీ జవాబులు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. వాటిని ఫలితాలు వెలువడే వరకూ అప్రూవ్ చేయం. లేదా editor@kinige.com కు మెయిల్ చేయండి. సరైన జవాబులు చెప్పిన అందరి పేర్లు కూడా ఫలితాల్లో ప్రస్తావిస్తాం.

1.

జడలోన మల్లెపూలు ఇమడకున్నవీ

జతలేక పట్టుపరుపు కుదరకున్నదీ

తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవీ

అవి కూడా నలిగిపోయి జాలివేస్తున్నవీ

క్లూ: శాంతికి నిలయమైన చిత్రకథతో శోభన్‌బాబు కథానాయకుడిగా 70 దశకం తొలిరోజుల్లో వచ్చిన చిత్రం.

2.

బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు

అన్న అనుమాటతో అన్ని తుంచేశావు

పసుపుకుంకుమ తెచ్చి పెళ్లి కాన్కగ ఇచ్చి

ఉరితాడు నా మెడకు వేయించినావు

క్లూ: విషాదాంతంగా ముగిసిన ఈ మతాంతర ప్రేమకథాచిత్రంలో శోభన్‌బాబు, లక్ష్మి జంటగా నటించారు. ఒక సన్నివేశంలో మనసుకవి ఆత్రేయ దర్శనమిస్తారు.

3.

తోట నిండా మల్లియలు

తుంటరి పాటల తుమ్మెదలు /తోట/

అల్లరి తుమ్మెదల అలికిడి వినగానే

మల్లెలు సవరించు పై ఎదలు

క్లూ: పోలీసు అధికారి భార్య చుట్టూ అల్లిన కథనం. 70 వ దశకం ప్రారంభంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో కృష్ణ.

4.

మెత్తని నీమది విరిపాన్పు కాదా

వెచ్చని కైదండ నాఅండ లేదా

కురిసే వెన్నెల పన్నీరు కాదా /కురిసే/

కొండంత నీవుండ కోరిక లేలా

క్లూ: ఎన్.టి.రామారావు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నందమూరి హరికృష్ణ కూడా కనిపించడం విశేషం.

5.

దివిలో నెలరాజు దిగివచ్చినాడు

భువిలో కలువమ్మ చెయిపట్టినాడు

నీతోటి చెలిమి నిజమైన కలిమి

నిలవాలి కలకాలమూ

క్లూ: శోభన్‌బాబు, లక్ష్మి జంటగా నటించిన 70వ దశకం చిత్రం.

6.

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గతొడిగింది

పాలవెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది

క్లూ: అక్కినేని, వాణిశ్రీలు జంటగా, 60 వ దశకం ఆఖర్లో వచ్చిన ఈ చిత్రానికి కథ యద్దనపూడి సులోచనరాణి.

7.

తల్లీ తండ్రుల ముద్దూ మురిపం చిన్నతనంలో కావాలి

ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి

తల్లికి పిల్లల ఆదరణ పండువయసులో కావాలి

ఆడవారికి అన్నివేళలా తోడూ నీడా ఉండాలి

క్లూ: ఒక మహిళా దర్శకురాలు జనరంజకంగా తీసిన ఈ సినిమా కూడా యద్దనపూడి సులోచనరాణి నవలాఅధారంగా వచ్చిందే.

నిర్వహణ: ఇశైతట్టు

Posted in 2014, ఆగస్టు and tagged , , , , .

6 Comments

 1. 1. దేవీ క్షేమమా?
  దేవర వారూ క్షేమమా…?
  తమ కడగంటీ చూపే కరువైనాదీ
  తమ కరుణా కటాక్షమే అరుదైనది… [శాంతి నిలయం]

  2. కథ విందువా, నా కథ విందువా?
  విధికి బదులుగ నీవు నా నుదుట వ్రాసిన
  కథ విందువా? నా కథ విందువా? [కోడె నాగు]

  3. రాధను నేనైతే.. నీ రాధను నేనైతే…
  నిన్ను మలచుకుంటాను నా మురళి గా…
  నిన్ను చేసుకుంటాను నా తరుణిగా… [ఇన్స్పెక్టర్ భార్య]

  4. ఓ… బంగారు గూటిలోని చిలుక…
  పేద ముంగిట్లో వాలానని ఉలుకా?
  ఓ…. వగలొలుకు మగసిరి గోరింకా….
  తానై రాచిలక వచ్చిందని కేరింతా? [తల్లా? పెళ్ళామా?]

  5. సిరిమల్లె సొగసు, జాబిల్లి వెలుగు
  నీ లోనే చూసానులే…
  ఏ నోము ఫలమో, ఏ దేవి వరమో..
  నీ దాననైనాను లే….
  సిరిమల్లె సొగసూ, జాబిల్లి వెలుగూ
  ఈ రేయి నీ కోసమే… [పుట్టినిల్లు మెట్టినిల్లు]

  6. మదిలో వీణలు మ్రోగే…
  ఆశలెన్నో చెలరేగే…
  కలనైన కనని ఆనందం…
  ఇలలోన దొరికెనీ నాడే [ఆత్మీయులు]

  7. మల్లె తీగ వంటిదీ మగువ జీవితం…
  చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను…
  అల్లుకు పోయేను [మీనా]

  పిల్ల సూత్రం: ఈ పాటలన్నీ అభినేత్రి ‘చంద్రకళ’ గారిపై చిత్రీకరించబడినవి.

 2. 1
  దేవీ క్షేమమా?..
  దేవరవారూ క్షేమమా?
  తమ కడగంటి చూపే కరువైనాది
  తమ కరుణాకటాక్షమే అరుదైనది

  2
  కథ విందువా నా కథ విందువా
  విధికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన
  కథ విందువా నా కథ విందువా

  3
  రాధను నేనైతే నీ రాధను నేనైతే
  నిను వలచుకుంటాను నా మురళిగా
  నిను చేసుకుంటాను నా తరుణిగా

  4
  ఓ.. బంగారు గూటిలోని చిలకా
  పేద ముంగిట్లో వాలానని ఉలుకా

  5
  సిరిమల్లె సొగసూ జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే
  ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో.. నీ దాననైనానులే

  6
  మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే
  కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే

  7
  మల్లెతీగ వంటిది మగువ జీవితం
  చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను

  అంతస్సూత్రం: పైవన్నీ చంద్రకళ నటించిన చిత్రాలు!

 3. 1. దేవీ క్షేమమా, దేవర వారు క్షేమమా – శాంతి నిలయం

  2. కథ విందువా నా కథ విందువా – కోడె నాగు

  3. రాధను నేనైతే, నీ రాధను నేనైతే – ఇనస్పెక్టర్ భార్య

  4. ఓ బంగారు గూటిలోని చిలుకా పేద ముంగిట్లో వాలానని అలుకా – తల్లా పెళ్ళామా

  5. సిరి మల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే – పుట్టినిల్లు-మెట్టినిల్లు

  6. మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నో చెలరేగె – ఆత్మీయులు

  7. మల్లె తీగ వంటిది మగువ జీవితం – మీనా

  అంతఃసూత్రం: ఈ పాటలన్నీ చంద్రకళ మీద చిత్రీకరించారు.

 4. సప్త స్వర వినోదం జవాబులు
  1. దేవి క్షేమమా దేవల వారు క్షేమమా
  2.కథ విందుంవా నా కథ విందుంవా .. విధికి బదులుగా నువ్వు నా నుదుట రాసినా..
  3 రాధను నేనయితే నీ రాధను నేయితే
  4 ఓ .. బంగారు గూటి లోని చిలుక పేద ముంగిట్లో వలవని ఉలుకా
  5 సిరి మల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే
  6 మది లో వీణలు మోగే . ఆశలెన్నో చేల రేగే
  7 మల్లె తీగ వంటిది మగువ జీవితం
  వీటన్నిటి అంత సూత్రం … చంద్రకళ నటించిన సినిమాల్లో ఆమె మీద చిత్రించిన పాటలు

 5. 1.

  జడలోన మల్లెపూలు ఇమడకున్నవీ
  జతలేక పట్టుపరుపు కుదరకున్నదీ
  తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవీ
  అవి కూడా నలిగిపోయి జాలివేస్తున్నవీ

  పల్లవి : దేవి క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి చూపే కరువైనది
  పాడింది ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత
  రచన: ఆత్రేయ
  చిత్రం : శాంతినిలయం

  2.

  బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
  అన్న అనుమాటతో అన్ని తుంచేశావు
  పసుపుకుంకుమ తెచ్చి పెళ్లి కాన్కగ ఇచ్చి
  ఉరితాడు నా మెడకు వేయించినావు

  పల్లవి : కథ విందువా నా కథ విందువా విధికి బదులుగ నీవు నా నుదుట వ్రాసిన కథ విందువా
  పాడింది : పి.సుశీల
  చిత్రం :కోడెనాగు

  3.

  తోట నిండా మల్లియలు
  తుంటరి పాటల తుమ్మెదలు /తోట/
  అల్లరి తుమ్మెదల అలికిడి వినగానే
  మల్లెలు సవరించు పై ఎదలు

  పల్లవి : రాధను నేనయితే…నీ రాధను నేనయితే..
  రాధను నేనయితే..నీ రాధను నేనయితే
  నిన్ను మలచుకుంటాను నా మురళిగా
  నిన్ను చేసుకుంటాను నా తరుణిగా
  నిన్ను మలచుకుంటాను నా మురళిగా
  నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

  పాడింది : మోహన్‌రాజు, సుశీల
  చిత్రం : ఇన్‌స్పెక్టర్‌ భార్య

  4.

  మెత్తని నీమది విరిపాన్పు కాదా
  వెచ్చని కైదండ నాఅండ లేదా
  కురిసే వెన్నెల పన్నీరు కాదా /కురిసే/
  కొండంత నీవుండ కోరిక లేలా

  పల్లవి : ఓ బంగారు గూటిలోని చిలకా పేద ముంగిట్లో వాలేనని ఉలుకా
  పాడింది : ఘంటసాల, సుశీల

  5.

  దివిలో నెలరాజు దిగివచ్చినాడు
  భువిలో కలువమ్మ చెయిపట్టినాడు
  నీతోటి చెలిమి నిజమైన కలిమి
  నిలవాలి కలకాలమూ

  పల్లవి :
  సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
  నీలోనే చూశానులే
  ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..
  నీ దాననైనానులే..

  6.

  సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గతొడిగింది
  పాలవెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది

  పల్లవి : మదిలో వీణలుమ్రోగే ఆశలెన్నొ చెలరేగే
  కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే మదిలో
  చిత్రం : ఆత్మీయులు

  7.

  తల్లీ తండ్రుల ముద్దూ మురిపం చిన్నతనంలో కావాలి
  ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి
  తల్లికి పిల్లల ఆదరణ పండువయసులో కావాలి
  ఆడవారికి అన్నివేళలా తోడూ నీడా ఉండాలి

  పల్లవి : మల్లె తీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి ఉంటే అల్లుకు పోయేను
  చిత్రం : మీనా

  వీటన్నిటికీ కలిపి ఉన్న అంతఃసూత్రం అన్ని పాటలు చంద్రకళపై చిత్రీకరించడం!

 6. 1. దేవీ క్షేమమా… దేవరవారు క్షేమమా…
  తమ కరుణా కటాక్షమే అరుదైనది…
  2. కథ విందువా నా కథ విందువా
  విధికి బదులుగా నువ్వునా నుదుట వ్రాసిన కథ విందువా
  3. రాధను నేనైతే నీ రాధను నేనైతే
  నిను మలచుకుంటాను నా మురళిగా… నిను చేసుకుంటాను నా తరుణిగా
  4. ఓ బంగారు గూటిలోని చిలుకా…
  పేద ముంగిట్లో వాలానని కులుకా…
  5. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
  నీలోనే చూసానులే…
  6. మదిలో వీణలు మ్రోగే ఆశెలెన్నో చెలరేగే…
  7. మల్లెతీగ వంటిది మగువ జీవితం
  చల్లని పందిరి వుంటే అల్లుకు పోయెను…
  అంతసూత్రం – ఈ పాటలన్నీ చంద్రకళ గారి మీద చిత్రించినవి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.