cover

జులై నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

జులై నెల ‘సప్త’స్వర వినోదంలో తొమ్మిది మంది పాల్గొన్నారు.  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులు ఈ క్రింద ఇస్తున్నాం:

1. ఒక వేణువు వినిపించెను – అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను – నవరాగ మాలికా…
(చిత్రం: అమెరికా అమ్మాయి)

.

2. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట
ఈ బ్రతుకంత కావాలి పూలబాట
పచ్చగ నూరేళ్లు ఉండాలనీ
నా నెచ్చెలి కలలన్ని పండాలనీ…
(చిత్రం: మట్టిలో మాణిక్యం)

.

3. కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగనీ
అన్నీ మరిచీ ఈ నిమిషంలో
నీ ఒడిలోనే నిదురపోనీ…
(చిత్రం: ఏది పాపం? ఏది పుణ్యం?)

.

4. నీ చెయ్యీ నా చెయ్యీ – పెనవేసి బాస చెయ్యీ
నా తోడు ఈ బంధం కలకాలం ఉండనీ
సాక్షులు మన రెండు హృదయాలు
(చిత్రం: జాతకరత్న మిడతంభొట్లు)

.

5. వలపే వెన్నెలగా… బ్రతుకే పున్నమిగా
జతగా గడిపే చల్లని ఈ రేయీ
ఎప్పుడూ ఇటులే నిలవాలీ
ఈ కలలే నిజమై విరియాలీ
(చిత్రం: గాంధీ పుట్టిన దేశం)

.

6. నీ కౌగిల్లో తలదాచీ
నీ చేతులలో కనుమూసీ
జన్మ జన్మకూ జతగా మసలే
వరమే నన్ను పొందనీ
(చిత్రం: కార్తీకదీపం)

.

7. ఇదిగో దేవుడు చేసిన బొమ్మా
ఇది నిలిచేదేమో మూడు రోజులు
బంధాలేమో పదివేలూ…
(చిత్రం: పండంటి కాపురం)

అన్ని పాటల్లోనూ అంతఃసూత్రం ఈ పాటలు రాసిన రచయిత మైలవరపు గోపీ కావడం.

*

అందరికన్నా ముందు జవాబు పంపిన వారు: ఎ. వి. రమణమూర్తి.

తర్వాత సరైన జవాబులు పంపినవారు వరుసగా బి. బాలసుబ్రహ్మణ్యం (సుబ్రహ్మణ్యం గారూ, కార్తీకదీపంలో శోభన్‌బాబు తండ్రికొడుకులుగా రెండు పాత్రలు అభినయించారు), సమ్మెట ఉమాదేవి, జ్యోతి, గొర్తి బ్రహ్మానందం, జి. మణిదీప, పొన్నపల్లి సీత.

వీరితో పాటు కరుణాకర్ జవాబులన్నీ ఇచ్చారు గానీ, అంతఃసూత్రం తప్పు చెప్పారు. అలాగే నండూరి సుందరీ నాగమణి గారు సినిమా పేర్లు కరెక్టుగానే చెప్పారు. కానీ అడిగింది పల్లవులు మాత్రమే.

పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. మీకోసం మరో ‘సప్త’స్వర వినోదం సిద్ధంగా ఉంది.

Posted in 2014, ఆగస్టు, స్వరం and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.