cover

మన ఇద్దరి మధ్య

.
మండుటెండకి రాలిపడిన ఎండుటాకులు గరగరలాడినట్లు
వేడి వేడి మాటల్ని ఒకరి మీదొకరు వాడిగా రువ్వుకున్నాక
పడకగది రెండు మూలల్లా, పందిరిమంచం రెండు కోళ్ళలా
సమాంతరమై మిగిలిన రాత్రిని సాగదీస్తూ.. మనం
.
గాలికి రెపరెపలాడుతున్న కొవ్వొత్తి ఆఖరి వెలుగులాగ
ఎద అడుగున మినుకు మినుకుమంటున్న చివరి ఆశ
నీ మౌనం.. ఆరిపోయిన కొవ్వొత్తి.. అడుగంటిపోయిన ఆశ
ఇక మిగిలింది చీకటి, సగం కరిగిన రాత్రి, నువ్వు, నేను
.
కలత నిదురలో కాస్త చేదు కలల్లో ఇంకాస్త
ఖర్చు చేశాయాలనే నిశ్చయానికొచ్చేశాం
ఇక కోల్పోయిన నమ్మకం గురించే చిక్కు
మాయని మచ్చలు గురిచూసి విసిరే ప్రశ్నలు
గుచ్చుకుని చిల్లులు పడిన గుండె
ఇంకెంత బాధని కురవాలోనని దిగులు
ఈ క్షణం నీ మౌనమే ఎక్కువ బాధిస్తోంది నన్ను

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్‌డేట్‌ల కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీ లైక్ చేయండి: https://www.facebook.com/KinigePatrika
Posted in 2014, ఆగస్టు, కవిత and tagged , , , , , , .

5 Comments

  1. మోహిని గారు: కొత సంతకం. కొత్త నడక. నచ్చింది. మరీ ఈ లైన్లు : “ఇంకెంత బాధని కురవాలోనని దిగులు
    ఈ క్షణం నీ మౌనమే ఎక్కువ బాధిస్తోంది నన్ను”
    చిన్న మాట: ఎద లాంటి పదాలు ఇలాంటి కవిత్వంలో ఎందుకో వొదగవ్ అనిపిస్తుంది. అవి కొంచెం lyrical cliche అనిపిస్తాయి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.