avela

అవేళ

.
పాపతల్లి నన్నవేళ
ముద్దు పెట్టుకుంది
లోపట్నుండి అస్సలేమీ
ఎరగనట్టే వొచ్చి.
.
కాలుడా! నంగనాచి
నీ తాళపత్ర పటమ్మీద
రాసుకో ఆవర్జా
నా పాప పుణ్య గణన –
చితికున్న మనిషిననీ
బతికి చెడ్డ వాణ్ణనీ
దాపరికం దేనికి? ఒఠ్ఠి
పాపాత్ముణ్ణనీ, కాని
రాయి సుమీ, మరిచేవు
.
పాపతల్లి నన్నవేళ
ముద్దు పెట్టుకుంది.

*

మూలం: Rondeau  by Leigh Hunt

http://www.poetryfoundation.org/poem/173700

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, కవిత and tagged , , , , , , , , .

One Comment

  1. ఓ తల్లి, పాపతల్లి, మమతానురాగాల మాధుర్య అమలిన చుంబనంతో, కారుణ్యాల క్షమతో
    పాపపుణ్యాల గణన చిట్టా ఆవర్జాల ఓ పుటలో నుండి విముక్తుడివయ్యావు బాబూ.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.