cover

దారి మధ్యలో…

.
ఆచితూచి మాట్లాడిన ప్రతిమాటకీ
అమృతం కురియ లేదంటావా!
ఆప్తులెవరూ నొచ్చుకోలేదన్న
ఆనందం చాలదూ!
.
అతిజాగ్రత్తగా చేసిన ప్రయాణంతో
అమరత్వం చిక్కలేదంటావా!
అడుసెపుడూ తొక్కలేదన్న
అతిశయం చాలదూ!
.
అనుష్టించిన ప్రతిమంత్రం
ఆగమ రహస్యాన్ని విప్పలేదంటావా
అలౌకికాన్ని లక్ష్యించిన
అనుభవం చాలదూ!
.
పదిలంగా పట్టుకున్న ప్రతిమెపుడూ
ప్రత్యక్షం కాలేదంటావా!
ప్రపంచాన్ని మరిపించిన
పారవశ్యం చాలదూ!

*

Download PDF ePub MOBI

for regular updates, like: https://www.facebook.com/KinigePatrika

Posted in 2014, ఆగస్టు, కవిత and tagged , , , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.