cover

పిట్ట పోరు

.
నా బుష్కోటు జోబీ కింద
చిన్నిది పాల పిట్టొకటుంది
దానికి బైటికొద్దామనుంది
అబ్బా అలా ఉండు! అన్నాను
తగు మనుషుల్లోకి ఎందుకనీసి
.
కొత్తది లెదర్ వాలెట్ కింద
ఒకటే రెక్కలాడిస్తుంది
గదిలో ఎగురుతానంటుంది
కర్చీఫ్ సున్నితంగా నొక్కి
కదలొద్దొసేయ్ టఠ్! అన్నాను
పనిలో మునకలౌతూ ఉంటే
ముక్కుతో టక్కు టక్ మంటుంది
.
ఛుప్! మని కసురుకుంటున్నాను
ఏంటిది తమాషాలాగుందా?
ఎవరన్న చూస్తే ఏమన్నా ఉందా?
అవతల పన్లు పాడైపోవా?
అబ్బబ్బా నోరు మూస్కోమంటే
ఓమని కాయిలా పడుతుంది
దానికి ఉక్క పోస్తున్నట్టుంది
.
నీనేం తెలివి తక్కువ్వోణ్ణా?
రాత్రుళ్ళు ఊరు పడుకోనిచ్చి
కొంచెం కోటు గుండీలిప్పి
మంచం పైకి రానిస్తాను
కిందన నువ్వున్నావు లేవే తెలుసు
ఎందుకా గొల్లు? ఏడుపులాపీ
అంటే అలిగి ముడుక్కుంటుంది
అది నా కోటు జోబీ కిందే
.
ఇటువైపు ఒత్తిగిల్లి పడుకంటే
ఎందుకో దుఃఖ్ఖఁవే ఒస్తుంది
ఎవడికీ తెలిసిపోనీకుండా
అడుగున ఉండనిస్తున్నాను
అక్కడ కోటు జోబీ కిందే
ముండని పిసికి చంపీకుండా

*

Download PDF ePub MOBI

Posted in 2014, కవిత, సెప్టెంబర్ and tagged , , , , , .

2 Comments

 1. Srikanth,

  Author did told me that his poem was an inspired by Bukowski’s. But right or wrong it was my decision not to mention this, because this poem with it’s own structure and rhythm conveys a slightly different emotion than the original, and I thought mentioning the original would only distract the reader and dilute the impact. Anyways, now that your comment is going to be here, I need not mention it again I guess. Thank you.

 2. Bluebird – Charles Bukowski
  ——–
  there’s a bluebird in my heart that
  wants to get out
  but I’m too tough for him,
  I say, stay in there, I’m not going
  to let anybody see
  you.
  there’s a bluebird in my heart that
  wants to get out
  but I pour whiskey on him and inhale
  cigarette smoke
  and the ****s and the bartenders
  and the grocery clerks
  never know that
  he’s
  in there.
  there’s a bluebird in my heart that
  wants to get out
  but I’m too tough for him,
  I say,
  stay down, do you want to mess
  me up?
  you want to screw up the
  works?
  you want to blow my book sales in
  Europe?
  there’s a bluebird in my heart that
  wants to get out
  but I’m too clever, I only let him out
  at night sometimes
  when everybody’s asleep.
  I say, I know that you’re there,
  so don’t be
  sad.
  then I put him back,
  but he’s singing a little
  in there, I haven’t quite let him
  die
  and we sleep together like
  that
  with our
  secret pact
  and it’s nice enough to
  make a man
  weep, but I don’t
  weep, do
  you?

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.