cover

‘సప్త’స్వర వినోదం – సెప్టెంబర్ 2014

ఈ నెల కూడా ఎప్పట్లానే ఇక్కడ ఏడు పాటల చరణాలు ఇస్తున్నాం. ఆయా పాటల పల్లవులతో పాటు వీటన్నిటినీ కలిపి ఉన్న జమిలి అంతఃసూత్రాలు మీరు పంపే జవాబుల్లో రాయండి. (అంతఃసూత్రం: సంగీతం, నిర్మాత, దర్శకులు, గేయరచయిత, కథారచయిత, నటీనటులు, ఛాయాగ్రహణం, సంస్థ – వగైరా ఎవరైనా/ ఏదైనా కావచ్చు).

మీ జవాబులు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. వాటిని ఫలితాలు వెలువడే వరకూ అప్రూవ్ చేయం. లేదా editor@kinige.com కు మెయిల్ చేయండి. సరైన జవాబులు చెప్పిన అందరి పేర్లూ కూడా ఫలితాల్లో ప్రస్తావిస్తాం.

1.

కనులున్నందుకు కలలు తప్పవు

కలలున్నపుడు పీడకలలు తప్పవు

కలల వెలుగులో కన్నీరొలికే

కలతల నీడలు ఎన్నెన్నో ఎన్నెన్నో

క్లూ: ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసురాలు ఎం.ఎల్. వసంతకుమారి కుమార్తె ముఖ్యభూమిక ధరించిన ఈ చిత్రంలో సుశీలతో కలిసి (హీరో జె.డి. చక్రవర్తి అమ్మ) కోవెల శాంత ఒక పాట పాడటం విశేషం.

2.

నీల నీల గగనాల మేఘతల్పాలపైన

పారిజాత సుమ సౌరభాల కెరటాలలోనా

నీ చేయి నా పండు వెన్నెల దిండుగా

నీ రూపమే నా గుండెలో నిండగా

కలలన్నీ వడబోసి.. కలలన్నీ వడబోసి

కౌగిలిలో చవిచూసి

క్లూ: శోభన్, శారదలు జంటగా నటించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయంతి ముఖ్యభూమికలు. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మూలకథ రచయిత్రి సి. ఆనందారామం.

3.

గుండెలో సుడిగుండాలున్నా

నిండుగ నవ్వును ఏరు

పక్కలోన బురద ఉన్నా

పచ్చగ నవ్వును పైరు

గుండెలో సుడిగుండాలున్నా నిండుగ నవ్వును ఏరు

ఏ వెతలున్నా ఏదేమైనా

అలా అలా కిలా కిలా నవ్వేదే జీవితం నవ్వేదే జీవితం

క్లూ: శారద ద్విపాత్రాభినయం చేసిన చిత్రం. ఘట్టమనేనిగారు హీరో. రాజబాబు, రమాప్రభలు ఇందులో సొంతంగా ఒక యుగళగీతం ఆలపించడం విశేషం.

4.

తాజ్ మహల్లో కురిసే వెన్నెల

పూరి గుడిసెపై కురియదా

బృందావనిలో విరిసే మల్లియ

పేదముంగిట విరియదా

మంచితనము పంచేవారికి /మం/

అంతరాలతో పని వుందా.. అంతరాలతో పని వుందా!

క్లూ: ‘రాజశ్రీ’గా పేరుగాంచిన అనువాదపాటల గేయ రచయిత ఇందుకూరి రామకృష్ణంరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

5.

హంసలు హంసలు హంసలని అంటారే

కానీ- హంసలకేమున్నాయి నడకలే బుడి బుడి నడకలే

నెమళ్లు నెమళ్లు నెమళ్లని అంటారే

కానీ నెమళ్లకేమున్నాయి కులుకులే పైపైని తళుకులే

ఆ నడకలనే మించిన వయ్యారం

ఆ కులుకులనే మించిన సింగారం

కలిగి ఉన్న కన్నె ఈ వన్నెలకే వన్నె

క్లూ: జయంతికి పేరు తెచ్చిన చిత్రం. రంగనాథ్ కథానాయకుడు. రమేష్ నాయుడు పాడిన ‘ఓ రామసక్కని బంగారు బొమ్మా’ పాట ఈ చిత్రం లోదే.

6.

ఏటి గాలికి పెళ్లికొడుకులో

ఎగిసే పాటల అలలెన్నో

పడవ ఇసురుతో పెళ్లి పడుచులో

పలికే తీయని కలలెన్నో

అరమూసే ఆ కళ్లే చెపుతాయి

విరబూసే ఈ అందాలే సెపుతాయి

క్లూ: దాసరి సినిమాల్లో కలికితురాయి. నాటకంగా ప్రసిద్ధి. నటనలో మాడా, గోకిన రామారావులు విశ్వరూపం ప్రదర్శించారు.

7.

నీలి నింగి కెంత ఆశ నేలపైన వాలాలనీ

గాలి అలల కెంత ఆశ పూలపైన తేలాలనీ /నీ/

పెదవుల కెంత ఆశ ఎంత ఆశ ఎంత ఆశ /పె/

పదే పదే పదే పదే ఒదిగి ఉండాలనీ

క్లూ: వెంకటేశ్ ‘దృశ్యం’ సినిమా దర్శకురాలి నిజజీవిత భాగస్వామి, అలనాటి హీరోయిన్ లత సోదరుడు హీరోగా నటించిన ఈ చిత్రంలో రతి అగ్నిహోత్రి కథానాయిక.

నిర్వహణ: ఇశైతట్టు

Posted in 2014, సెప్టెంబర్, స్వరం and tagged , , , , .

7 Comments

 1. 1. (తూర్పు పడమర)
  స్వరములు ఏడైనా రాగాలెన్నో
  స్వరములు ఏడైనా రాగాలెన్నో
  హృదయం ఒకటైనా భావాలెన్నో
  స్వరములు ఏడైనా రాగాలెన్నో

  2. (జీవితం)
  ఇక్కడే కలుసుకున్నాము
  ఎప్పుడో కలుసుకున్నాము
  ఏ జన్మలోన? ఏ జన్మలోన?
  ఎన్నెన్ని జన్మలలోన?
  ఇక్కడే కలుసుకున్నాము
  ఎప్పుడో కలుసుకున్నాము

  3. (రాధమ్మ పెళ్ళి)
  పారే గోదావరిలా
  పరుగెత్తేదే వయస్సు
  పొడిచే తొలిపొద్దులా
  పొరలు లేనిదే మనస్సు

  4. (చదువు-సంస్కారం)
  దీపానికి కిరణం ఆభరణం
  రూపానికి హృదయం ఆభరణం
  హృదయానికి…
  ఏనాటికి…
  తరగని సుగుణం ఆభరణం

  5. (చందన)
  పొన్నపూల ఉయ్యాలా
  కన్నె వయస్సే ఊగాలా
  ఆ ఊపుతో ఆకాశమే
  ఆ ఊపుతో ఆకాశమే
  అరికాలికే అందాలా
  అందాలా అందాలా

  6. (చిల్లరకొట్టు చిట్టెమ్మ)
  చుక్కల్లో పెద చుక్క చందమామ
  ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మ
  ఆ చందమామకు, ఈ ఎన్నెలమ్మకు
  చల్లని గోదారి వొడిలో పెళ్ళమ్మ
  ముత్యాల జల్లమ్మ

  7. ( అందాల రాశి)
  కోయిల పిలుపే కోనకు మెరుపు
  మాయని వలపే మనసుకు మెరుపు

  జమిలి అంతఃసూత్రం : అన్ని పాటలకు రమేష్ నాయుడు గారు సంగీతం అందించారు.
  అన్ని పాటలు వ్రాసిన వారు సి.నారాయణ రెడ్డి గారు.

 2. 1) స్వరములు ఏడైనా రాగాలెన్నో… – తూర్పు-పడమర
  2) ఇక్కడే కలుసుకున్నాము… ఎప్పుడో కలుసుకున్నాము… – జీవితం
  3) పారే గోదావరిలా పరిగెత్తేదే వయసు… – రాధమ్మ పెళ్లి
  4) దీపానికి కిరణం ఆభరణం… – చదువు-సంస్కారం
  5) పొన్నపూల ఉయ్యాలా కన్నె వయసే ఊగాలా… – చందన
  6) చుక్కల్లో పెద చుక్క చందమామా… వెలుగులకె వెలుగమ్మ వెన్నెలమ్మ… – చిల్లరకొట్టు చిట్టెమ్మ
  7) కోయిల పిలుపే కోనకు మెరుపు… – అందాలరాశి
  జమిలి సూత్రం – ఈ పాటలన్నిటికీ సంగీతం – రమేష్ నాయుడు
  గేయ రచయిత – సి. నారాయణ రెడ్డి

 3. 1. స్వరములు ఏడైనా రాగాలెన్నో…
  హృదయం ఒకటైనా భావాలెన్నో…
  స్వరములు ఏడైనా రాగాలెన్నెన్నో [తూర్పూ పడమర]

  2. ఇక్కడే కలుసుకున్నాము… ఎప్పుడో కలుసుకున్నాము
  ఏ జన్మ లోనో… ఏ జన్మ లోనో… ఎన్నెన్ని జన్మల లోనో… [జీవితం]

  3. పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు..
  ఒణికే తొలి పొద్దులా పొరలు లేనిదే మనసు…. [రాధమ్మ పెళ్లి]

  4. దీపానికి కిరణం ఆభరణం – రూపానికి హృదయం ఆభరణం…
  హృదయానికి ఏనాటికీ తరగని సుగుణం ఆభరణం… [చదువు సంస్కారం]

  5. పొన్న పూలా ఉయ్యాలా, కన్నె వయసే ఊగాల…
  ఆ ఊపుతో ఆకాశమే…అరికాలికే అందాలా…
  అందాలా… అందాలా…. [చందన]

  6. చుక్కల్లో పెద్ద చుక్క చందామామా…
  ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా…
  ఆ చందామామకు ఈ ఎన్నెలమ్మ కు
  చల్లని గోదారి ఒడిలో పెళ్లమ్మా, ముత్యాల జల్లమ్మా [చిల్లర కొట్టు చిట్టెమ్మ]

  7. కోయిల పిలుపే కోనకు మెరుపు…
  మాయని వలపే మనసుకు మెరుపు… [అందాల రాశి]

  పిల్ల సూత్రం: ఈ పాటలన్నింటికీ సంగీత దర్శకుడు ఒక్కరే…. ‘రమేష్ నాయుడు’ గారు.

 4. 1 స్వరములు ఏడయినా రాగాలెన్నో
  2 ఇక్కడే కలుసుకున్నాం .. ఎప్పుడూ కలిసి ఉంటాము
  3.పారె గోదావరిలా పరుగెత్తేదే వయసు పొడిచే తొలి పొద్దులా …
  4. దీపానికి కిరణం ఆభరణం …
  5.పొన్న పూల ఉయ్యాలా .. కన్నె మనసే ఊగాలా ..
  6.చుక్కల్లో పెద చుక్క చందా మామ ..
  7. కోవెల పిలుపే కోనకు మెరుపు
  ఈ అన్నింటి అంత సూత్రం .. సి నారాయణ రెడ్డి గారి రచన పసుపులేటి రమేష్ నాయుడు గారు సంగీత దర్శకత్వం

 5. 1. స్వరములు ఏడైనా, రాగాలెన్నో – తూర్పు పడమర

  2. ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము – జీవితం

  3. పారే గోదావరిలా పరిగేట్టేదే వయసు – రాధమ్మ పెళ్ళి

  4. దీపానికి కిరణం ఆభరణం – చదువు సంస్కారం

  5. పొన్న పూల ఉయ్యాల కన్నె వయసే ఊగాలా – చందన

  6.చుక్కల్లో పెద చుక్క చందమామ – చిల్లరకొట్టు చిట్టెమ్మ

  7. కోయిల పిలుపే కోనకు మెరుపు – అందాల రాశి

  అంతః సూత్రాలు : ఈ పాటలన్నిటికీ రచయిత సి. నారాయణ రెడ్డి, సంగీత దర్శకుడు రమేష్ నాయుడు.

 6. 1
  కనులున్నందుకు కలలు తప్పవు
  కలలున్నపుడు పీడకలలు తప్పవు
  కలల వెలుగులో కన్నీరొలికే
  కలతల నీడలు ఎన్నెన్నో ఎన్నెన్నో

  క్లూ: ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసురాలు ఎం.ఎల్. వసంతకుమారి కుమార్తె ముఖ్యభూమిక ధరించిన ఈ చిత్రంలో సుశీలతో కలిసి (హీరో జె.డి. చక్రవర్తి అమ్మ) కోవెల శాంత ఒక పాట పాడటం విశేషం.
  పల్లవి : స్వరములు ఏడైనా రాగాలెన్నో
  స్వరములు ఏడైనా రాగాలెన్నో
  హృదయం ఒకటైనా భావాలెన్నో
  చిత్రం : తూర్పు పడమర, రచన : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, సంగీతం : రమేశ్‌ నాయుడు, పాడింది : సుశీల, కోవెల శాంత

  2.
  నీల నీల గగనాల మేఘతల్పాలపైన
  పారిజాత సుమ సౌరభాల కెరటాలలోనా
  నీ చేయి నా పండు వెన్నెల దిండుగా
  నీ రూపమే నా గుండెలో నిండగా
  కలలన్నీ వడబోసి.. కలలన్నీ వడబోసి
  కౌగిలిలో చవిచూసి

  క్లూ: శోభన్, శారదలు జంటగా నటించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయంతి ముఖ్యభూమికలు. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మూలకథ రచయిత్రి సి. ఆనందారామం.
  పల్లవి : ఇక్కడే కలుసుకున్నాము- ఎప్పుడో కలుసుకున్నాము
  ఏ జన్మలోనో ఏ జన్మలోనో ఎన్నెన్ని జన్మలలోనో
  చిత్రం : జీవితం, రచన : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, పాడింది : సుశీల, రామకృష్ణ, సంగీతం : రమేశ్‌ నాయుడు
  3.
  గుండెలో సుడిగుండాలున్నా
  నిండుగ నవ్వును ఏరు
  పక్కలోన బురద ఉన్నా
  పచ్చగ నవ్వును పైరు
  గుండెలో సుడిగుండాలున్నా నిండుగ నవ్వును ఏరు
  ఏ వెతలున్నా ఏదేమైనా
  అలా అలా కిలా కిలా నవ్వేదే జీవితం నవ్వేదే జీవితం

  క్లూ: శారద ద్విపాత్రాభినయం చేసిన చిత్రం. ఘట్టమనేనిగారు హీరో. రాజబాబు, రమాప్రభలు ఇందులో సొంతంగా ఒక యుగళగీతం ఆలపించడం విశేషం.
  పల్లవి : పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు పొడిచే తొలిపొద్దులా పొరలులేనిదే మనసు
  చిత్రం : రాధమ్మ పెళ్లి, పాడింది : సుశీల, సంగీతం : రమేశ్‌నాయుడు
  4.

  తాజ్ మహల్లో కురిసే వెన్నెల
  పూరి గుడిసెపై కురియదా
  బృందావనిలో విరిసే మల్లియ
  పేదముంగిట విరియదా
  మంచితనము పంచేవారికి /మం/
  అంతరాలతో పని వుందా.. అంతరాలతో పని వుందా!

  క్లూ: రాజశ్రీగా పేరుగాంచిన అనువాదపాటల గేయ రచయిత ఇందుకూరి రామకృష్ణంరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
  పల్లవి : దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, హృదయానికీ ఏనాటికీ తరగని సుగుణం ఆభరణం
  చిత్రం : చదువు సంస్కారం, రచన : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, పాడింది : సుశీల, సంగీతం : రమేశ్‌ నాయుడు
  5.
  హంసలు హంసలు హంసలని అంటారే
  కానీ- హంసలకేమున్నాయి నడకలే బుడి బుడి నడకలే
  నెమళ్లు నెమళ్లు నెమళ్లని అంటారే
  కానీ నెమళ్లకేమున్నాయి కులుకులే పైపైని తళుకులే
  ఆ నడకలనే మించిన వయ్యారం
  ఆ కులుకులనే మించిన సింగారం
  కలిగి ఉన్న కన్నె ఈ వన్నెలకే వన్నె

  క్లూ: జయంతికి పేరు తెచ్చిన చిత్రం. రంగనాథ్ కథానాయకుడు. రమేష్ నాయుడు పాడిన ‘ఓ రామసక్కని బంగారు బొమ్మా’ పాట ఈ చిత్రం లోదే.
  పల్లవి : పొన్నపూల ఉయ్యాల, కన్నెవయసే ఊగాల, ఆ ఊపులో ఆకాశమే అరికాలికే అందాల
  చిత్రం : చందన, పాడింది : ఎస్‌.జానకి, రచన : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, సంగీతం : రమేశ్‌ నాయుడు
  6.
  ఏటి గాలికి పెళ్లికొడుకులో
  ఎగిసే పాటల అలలెన్నో
  పడవ ఇసురుతో పెళ్లి పడుచులో
  పలికే తీయని కలలెన్నో
  అరమూసే ఆ కళ్లే చెపుతాయి
  విరబూసే ఈ అందాలే సెపుతాయి

  క్లూ: దాసరి సినిమాల్లో కలికితురాయి. నాటకంగా ప్రసిద్ధి. నటనలో మాడా, గోకిన రామారావులు విశ్వరూపం ప్రదర్శించారు.
  పల్లవి : సుక్కల్లో పెద సుక్కా సందమామ, వెలుగులోకీ వెలుగమ్మా వెన్నేలమ్మా, ఆ సందమామకూ, ఈ యెన్నెలమ్మకూ సల్లని గోదారి ఒడిలో పెళ్లమ్మా…ముత్యాల జల్లమ్మా
  చిత్రం : చిల్లరకొట్టు చిట్టెమ్మ, రచన : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, పాడింది : సుశీల, సంగీతం : రమేశ్‌ నాయుడు
  7.

  నీలి నింగి కెంత ఆశ నేలపైన వాలాలనీ
  గాలి అలల కెంత ఆశ పూలపైన తేలాలనీ /నీ/
  పెదవుల కెంత ఆశ ఎంత ఆశ ఎంత ఆశ /పె/
  పదే పదే పదే పదే ఒదిగి ఉండాలనీ

  క్లూ: వెంకటేశ్ దృశ్యం సినిమా దర్శకురాలి నిజజీవిత భాగస్వామి, అలనాటి హీరోయిన్ లత సోదరుడు హీరోగా నటించిన ఈ చిత్రంలో రతి అగ్నిహోత్రి కథానాయిక.
  పల్లవి : కోయిల పిలుపే కొనకు మెరుపు మాయని వలపే మనసుకు మెరుపు
  చిత్రం : అందాలరాశి, పాడింది : సుశీల, బాలు, రచన : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, సంగీతం : రమేశ్‌ నాయుడు
  వీటన్నిటినీ కలిపి ఉన్న జమిలి అంతఃసూత్రం అన్ని పాటలకు రమేశ్‌నాయుడు సంగీతాన్ని అందించడం, పాటలన్నీ నారాయణరెడ్డి రాయడం..

 7. 1
  స్వరములు ఏడైనా.. రాగాలెన్నో
  హృదయం ఒక్కటైనా… భావాలెన్నో
  (తూర్పు పడమర-1976/సినారె/రమేష్ నాయుడు/సుశీల)

  2
  ఇక్కడే కలుసుకున్నాము
  ఎప్పుడో కలుసుకున్నాము
  (జీవితం-1973/సినారె/రమేష్ నాయుడు/సుశీల, రామకృష్ణ)

  3
  పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు
  పొడిచే తొలిపొద్దులా పొరలు లేనిదే మనసూ
  (రాధమ్మ పెళ్లి-1974/సినారె/రమేష్ నాయుడు/జానకి)

  4
  దీపానికి కిరణం ఆభరణం
  రూపానికి హృదయం ఆభరణం
  (చదువు సంస్కారం-1975/సినారె/రమేష్ నాయుడు/సుశీల)

  5
  పొన్నపూలా ఉయ్యాలా
  కన్నె వయసే ఊగాలా
  (చందన-1974/సినారె/రమేశ్ నాయుడు/జానకి)

  6
  చుక్కల్లో పెదచుక్క చందమామా
  ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
  (చిల్లరకొట్టు చిట్టెమ్మ-1977/సినారె/రమేష్ నాయుడు/సుశీల)

  7
  కోయిల పిలుపే కోనకు మెరుపు
  మాయని వలపే మనసుకు మెరుపు
  (అందాల రాశి-1980/సినారె/రమేష్ నాయుడు/సుశీల, బాలు)

  అంతః సూత్రం 1 : అన్నీ రాసింది సి నారాయణరెడ్డి గారు
  అంతః సూత్రం 2 : అన్నీ చేసింది రమేష్ నాయుడు గారు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.