cover

ఆగస్టు నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

ఆగస్టు నెల ‘సప్త’స్వర వినోదం లో ఆరుగురు పాల్గొన్నారు.  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులను కింద ఇస్తున్నాం.

1.

దేవీ క్షేమమా… దేవరవారూ క్షేమమా..
తమ కడగంటి చూపే కరువైనదీ
తమ కరుణాకటాక్షమే అరుదైనదీ
(చిత్రం: శాంతి నిలయం)
 ఇక్కడ వినండి.

2.

కథ విందువా… నా కథ విందువా…
విధికి బదులుగ నీవు నా నొసటన రాసిన
కథ విందువా.. నా కథ విందువా
(చిత్రం: కోడెనాగు)

3.

రాధను నేనైతే నీ రాధను నేనైతే
నిను మలచుకుంటాను నా మురళిగా
నిను చేసుకుంటాను నా తరుణిగా
(చిత్రం: ఇన్‌స్పెక్టర్ భార్య)

4.

ఓ బంగారుగూటిలోని చిలకా
పేద ముంగిట్లో వాలానని ఉలుకా…
ఓ వగలొలుకు మగసిరి గోరింకా
తానై రాత్రింట వచ్చిందని కేరింతా…
(చిత్రం: తల్లా? పెళ్లామా?)

5.

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే
ఏ నోము ఫలమో ఏ దేవి వరమో
నీదాననైనానులే
(చిత్రం: పుట్టినిల్లు మెట్టినిల్లు)

6.

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే
(చిత్రం ఆత్మీయులు)

7.

మల్లెతీగ వంటిదీ మగువజీవితం
చల్లని పందిరి ఉంటే…
అల్లుకుపోయేనూ… అల్లుకుపోయేను
(చిత్రం: మీనా)

అంతఃసూత్రం: ఈ పాటల సన్నివేశాలన్నీ నటి చంద్రకళపై చిత్రీకరించినవి.

*

అందరికన్నా ముందు జవాబు పంపినవారు: సీత పొన్నపల్లి.

తర్వాత సరైన జవాబులు పంపినవారు వరుసగా: బి. బాలసుబ్రహ్మణ్యం, సమ్మెట ఉమాదేవి, జి. మణిదీప, ఎవి రమణమూర్తి, నండూరి సుందరీ నాగమణి.

పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. మీకోసం మరో ‘సప్త’స్వర వినోదం సిద్ధం.

Posted in 2014, సెప్టెంబర్, స్వరం and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.