cover

Aకాంత వేళ

.
ఆకుందాం రామ్మా అని అల్లరి చేస్తోంది పాపాయి.
ఆకుందామమ్మా ఆకుందాం!
అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది.
ఈ పని అయ్యాక వస్తానమ్మా అన్నది గిన్నెలు తోముతూ.
పాపాయి హాల్లో ఒక్కతే ఆడుకుని కొంచెం సేపు అయ్యాక మళ్ళీ వచ్చింది.
ఆకుందాం ఆకుందాం!
ఈ పని అయ్యాక ఆకుందాం అన్నదమ్మ పొయ్యి కడుగుతూ. mother
మళ్ళీ కొంచెం సేపు అయ్యాక వచ్చింది పాపాయి.
అమ్మ పొయ్యి కడిగేసి కూరలు తరుగుతోంది.
తరుగుతో పాటలు పాడుతోంది.
“స్ట్రాబెరి కన్నే…”
“స్ట్రాబెరి ముక్కే…” అరిచింది పాపాయి అమ్మ వెనకనించి.
అమ్మ పట్టించుకోలేదు.
వెనక్కి తిరిగి చూడలేదు.
తరుగుతూనే ఉన్నది చకచకా.
“ఏకాంత వేళ…” అని పాడుతోంది.
“B కాంత వేలా…” అరిచింది పాపాయి.
“C కాంత వేలా…”
“హే హే D కాంత వేలా…”
ఫక్కున నవ్వి వెనక్కి తిరిగి చూసింది అమ్మ.
నవ్వుతూ పాపాయి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది.
నవ్వాపుకుంటూ ఇంక ఆకుందాం పద అన్నది.

*

Download PDFePub MOBI

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.