cover

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ – 2014

“750 పదాల”

స్మార్ట్ స్టోరీ

రాయండి

రూ. 20,000/-

విలువైన బహుమతులు

గెలుచుకోండి

 .

మిత్రులారా,

మీరు 28 సంవత్సరాల లోపు వారా? అయితే, మీ సృజనాత్మకతని వెల్లువెత్తించండి, మీ కీబోర్డులకి పనిచెప్పండి. రూ.20,000/- వరకూ గెలుచుకునే చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకోండి!

మీరు చేయాల్సిందల్లా.. కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2014)కి 750 పదాల లోపు, ఒక స్మార్ట్ స్టోరీ రాసి editor@kinige.com కి పంపిస్తే చాలు! మీ కథ బహుమతి గెలుచుకునే అవకాశం. వివరాలు దిగువ:

.

ప్రథమ బహుమతి

మీ కథ ప్రథమ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే

మీకు రూ.8000/- విలువగల బహుమతి లభిస్తుంది.

 .

ద్వితీయ బహుమతి

మీ కథ ద్వితీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే

మీకు రూ.4000/- విలువగల బహుమతి లభిస్తుంది.

 .

తృతీయ బహుమతి

మీ కథ తృతీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే

మీకు రూ.2000/- విలువగల బహుమతి లభిస్తుంది.

.

ప్రోత్సాహక బహుమతులు (6 కథలకు)

మీ కథ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్‌లో కన్సోలేషన్ ప్రైజ్‌కి ఎంపికైతే

మీకు రూ.1000/- విలువగల ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది.

.

ఎంపికైన కథలన్నీ అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తాయి.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

 *

మీరు చేయదగినవి!

1. ఇతివృత్తం మీ ఇష్టం.

2. కావాలనుకుంటే కలం పేరు వాడవచ్చు (కానీ, కినిగె అడిగినప్పుడు, మీ అసలు పేరు, గుర్తింపులను ఋజువులతో సహా చూపవలసి ఉంటుంది)

3. మీరు టెక్స్ట్ పాడ్, నోట్ పాడ్, లేదా ఎం. ఎస్. వర్డ్ డాక్యుమెంట్ లేదా తత్సమాన డాక్యుమెంట్ ఏదైనా ఉపయోగించవచ్చు. తెలుగు అక్షరాలను స్పష్టంగా చూపే ఏ అప్లికేషన్ని అయినా వాడేందుకు సంకోచించనవసరం లేదు.

 .

మీరు చేయాల్సినవి!

1. మీరు మీ రచనని కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2014) కోసమే రాయాలి

2. మీ కినిగె స్మార్ట్ స్టోరీని యూనికోడ్‌లో మాత్రమే* టైప్ చేయాలి

3. టైపింగ్ దోషాలు, అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

4. సబ్జెక్ట్ లైన్‍లో “కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2014) కోసం” అని రాయాలి. మీ స్మార్ట్ స్టోరీ (2014) పేరు ప్రస్తావించాలి.

5. మీ పూర్తి పేరు, పోస్టల్ అడ్రస్ (పిన్‌కోడ్‌తో సహా) పంపాలి.

6. మీ కథలను 31 అక్టోబర్ 2014లోగా కినిగెకి అందేలా పంపాలి.

7. మీ రచనలను editor@kinige.com కి పంపాలి.

8. మీ వయసు డిసెంబరు 2014 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి.

.

మీరు చేయకూడనివి!

1. గతంలో ప్రచురితమైన కథలు పంపకూడదు.

2. ఇతర పోటీలలోగాని లేదా ఇతర ప్రచురణకర్తలు లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణల వద్ద పరిశీలనలో ఉన్న కథలను పంపకూడదు.

3. అనువాద కథలు పంపకూడదు.

4. ఒక వేళ మీ కథకు బహుమతి లభిస్తే, ఆ కథని మీరు ఏ బ్లాగులో గానీ, వెబ్‌జైన్‌లో గాని, ఇతర సోషల్ మీడియా సైట్లలో గాని లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణలలో కనీసం ఒక ఏడాది వరకు ప్రచురించరాదు.

5. ఈ నిబంధనలలో దేనినైనా, అన్నింటినీ లేదా కొన్నింటిని మీ కథ ఉల్లంఘిస్తే, మీరు పోటీకి అనర్హులవుతారు.

6. వెరసి, మీరు కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2014) కోసం సరికొత్త కథ, కినిగెకి మాత్రమే రాయల్సి ఉంటుంది.

 .

మీకు సహాయపడే వనరులు:

మీ రచనలను యూనికోడ్‌లో టైప్ చేసేందుకు

1. lekhini.org

2. సురవర తెలుగు కీబోర్డు suravara.com

3. యూనికోడ్‌లో టైప్ చేసేందుకు మరింత సాయం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక:

పోటీ ఫలితాల విషయంలో కినిగెదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు. ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే, పోటీకి అనర్హులవుతారు.

 

*ఒకవేళ మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే editor@kinige.com కి ఈమెయిల్ చేయాలి

.

మీ రచనలు కినిగెకి పంపడానికి తుది గడువు

31 అక్టోబరు 2014

smartstory

UPDATE:

గత ఏడాది తో పోలిస్తే ఈ పోటీలో పాల్గొన్న వారి సంఖ్య చాలా పెరిగింది. అందువల్ల ఫలితాలు ప్రకటించటంలో ఆలస్యం జరుగుతోంది. జూన్ నెలాఖరులోగా ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం.
Posted in Uncategorized and tagged , , , .

42 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.