cover

మిసను చెడిపోయింది

పాపాయి ఆములు తినడం లేదు.

ఇల్లంతా తిప్పేస్తోంది అమ్మని.

మేజా బల్ల కిందా, కుర్చీల కిందా దూరిపోతోంది.

ఒక్క ముద్ద తినమ్మా అని అమ్మ అంటే –

ఆములు వద్దంటే వద్దంటోంది.

అమ్మ అలిసిపోయి జాగిలపడిపోయింది కుర్చీలో.

ప్రమాదం లేదనుకుని ఇంక పాప ఆటల్లోకి దిగింది.

అమ్మా! నేను రోబోని! అన్నది మిలటరీ వాళ్ళలా కాళ్ళు చేతులూ నిటారుగా పెట్టి ఠకా ఠకామని ఎత్తెత్తి నడుస్తూ.

వెంటనే అమ్మ ఓ ఆముల అయిడియా వేసేసింది.

హాయ్ హాయ్ పాపాయ్ చిట్టి రోబోలాగున్నదే. భలే!

రోబో పొట్ట మీద బటన్ నొక్కితే నోరు ఇలా తెరుస్తుంది తెలుసా మరి! అన్నది.

ఇతల పొత్త మీద నొక్కితే అతల నోరు తెరుస్తుందా అన్నది పాప.

అవును రా! అని పొట్ట మీద బటన్ నొక్కినట్టు యాక్షను చేసింది అమ్మ.

పాప ఇదేదో ఆట అనుకుని తన ఎర్ర బుల్లి నోరు తెరిచింది.

ఇంకేముంది అమ్మ నోతిలో ఆములు పెత్తేసింది.

పాపాయి నోరు కాలీ అయ్యాక మల్లీ చిత్తి రోబో అని పాపాయి పొత్త మీద నొక్కినత్తు యాచ్చన్ చేసింది అమ్మ.

పాపాయికి నోరు తెరవక తప్పలేదు గానీ ఏదో తెలిసిపోయింది.

మూడోసారి చిత్తి రోబో పొత్త నొక్కబోతే పాప నోరు తెరవలేదు.

ఏంటి బటన్ నొక్కితే రోబో నోరు తెరవడం లేదు? ఏమైందండీ రోబో గారు? అడిగింది అమ్మ.

మిసను చెడిపోయింది!

మిసను చెడిపోయింది!

అన్నది పాప రోబోలా గొంతు మార్చి.

అంటూ అమ్మకి అందకుండా మేజా కింద దూరిపోయి ఆములు వద్దమ్మా అని తల అడ్డంగా ఊపింది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.