cover

పనిని pause లో పెట్టు

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది.

పాపాయి హాల్లో కూచుని బొమ్మలు వేసుకుంటోంది.

అమ్మా పువ్వుల బొమ్మ వేసా వచ్చి చూడు! అన్నది పాప.

ఈ పని అయ్యక వస్తా!

వంటింట్లోంచి కేకేసింది అమ్మ.

అమ్మా మబ్బులు బొమ్మ వేసా! రా రా !

కొంచెం పని ఉంది నాన్నా! అయ్యాక వస్తా!

అమ్మా రెయిన్ బొ వేసాను!

సూరుడు వేసాను!

మల్లీ పష్షులు కూడా!

అమ్మక్కొంచెం విసుగొచ్చింది.

వస్తున్నా తల్లీ! పని చేస్తున్నా చెప్పా కదా! పనవ్వద్దూ!

అరిచి చెప్పింది అమ్మ వంటింట్లోంచి.

అయితే పనిని పాజ్ లో ఫెత్తి రా ఒకసారి ! అన్నది పాప ఇంకా గట్టిగా.

*

Download PDF ePub MOBI

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , .

One Comment

  1. ఇంద్రాణి గారూ,
    మీరు పిల్లల మనస్తత్వాన్ని కావ్యవస్తువుగా మలుచుకోడం ఎలాగో బాగా పట్టేరు. మీ చిట్టిచిట్టి మిరియాలు చదువుతుంటే మనసు హాయిగా ఉంటుంది.
    మీకు హృదయపూర్వక అభినందనలు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.