cover

సెప్టెంబరు నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

సెప్టెంబరు నెల ‘సప్త’స్వర వినోదం లో ఏడుగురు పాల్గొన్నారు.  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులను కింద ఇస్తున్నాం.

1.

స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో
(చిత్రం: తూర్పు పడమర – 1976)

2.
ఇక్కడే కలుసుకున్నాము
ఎప్పుడో కలుసుకున్నాము
ఏ జన్మలోనో.. ఏ జన్మలోనో
ఎన్నెన్ని జన్మల లోనో
(చిత్రం: జీవితం – 1973)

 పాట ఈ లింకులో వినవచ్చు>>

3.

పారే గోదావరిలా పరిగెత్తేదే వయసు
పొడిచే తొలిపొద్దులా పొరలు లేనిదే మనసు
(చిత్రం: రాధమ్మ పెళ్ళి – 1974)

 

4.

దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి ఏనాటికి
తరగని సుగుణం ఆభరణం
(చిత్రం:చదువు సంస్కారం – 1974)

 

5.

పొన్నపూలా ఉయ్యాల
కన్నెవయసే ఊగాల
ఆ వూపుతో ఆకాశమే
అరికాలికి అందాలా.. అందాలా.. అందాల
(చిత్రం: చందన – 1974)

పాటను ఈ లింకులో వినవచ్చు. >>

6.

సుక్కల్లో పెద్ద సుక్కా సందామామా
ఎలుగులకే ఎలుగమ్మా వెన్నెలమ్మా
ఆ సందామామకు, ఈ ఎన్నెలమ్మకు
సల్లని గోదారి ఒడిలో పెళ్లమ్మా ముత్యాల జల్లమ్మా!
(చిత్రం: చిల్లరకొట్టుచిట్టెమ్మ – 1977)

పాట ఈ లింకులో వినవచ్చు.>> 

7.

కోయిల పిలుపే కోనకు మెరుపు
మాయని వలపే మనసుకు మెరుపు
(చిత్రం: అందాల రాశి – 1980)

 పాట ఈ లింకులో వినవచ్చు. >>

అంతఃసూత్రం: ఈ పాటలన్నీ సి. నారాయణరెడ్డి రాయగా, రమేష్ నాయుడు స్వరపరిచారు.

*

అందరికన్నా ముందు జవాబు పంపినవారు: ఎ.వి. రమణమూర్తి

తర్వాత సరైన జవాబులు పంపినవారు వరుసగా: బి. బాలసుబ్రహ్మణ్యం, జి. మణిదీప, సమ్మెట ఉమాదేవి, నండూరి సుందరీనాగమణి (అన్నింటికీ గేయరచయిత సి.నారాయణరెడ్డి అన్న అంతఃసూత్రం ప్రస్తావించలేదు), సీత పొన్నపల్లి, శ్రీవల్లి మద్దిపాటి.

పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. మీకోసం మరో ‘సప్త’స్వర వినోదం సిద్ధం.

Posted in 2014, అక్టోబర్, స్వరం and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.