cover

పదనిష్పాదన కళ (21)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

Trans:

ఆంగ్లంలో Trans అనే ఉపసర్గ ఉంది. ‘అతీతమైన, దాటిన, అవతలి’ అనే అర్థాల్లో దాన్ని నామవాచకాల ముందు ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించినప్పుడు ఆ పదసమ్మేళనం విశేషణమవుతుంది. ఉదాహరణకి– Trans-national (జాత్య తీత- / జాతిక్రాంత-). దానికి సాటిగా మన దగ్గఱున్న ఉపసర్గ ‘అతి’. కానీ దీన్నిప్పుడు మఱో అర్థంలో వాడుతున్నారు. అయితే ‘అతీత/ క్రాంత’ అనే సమాసావయవాలతో Trans ని అనువదించడానికి చాలా వఱకు వీలుంది.

III. రెండుపదాలు గల విశేషణాల నిష్పాదనలో శీఘ్ర ఆచూకీ (quick reference) కోసం పదాంత్య సమాసావయవాలు కొన్ని:

అడ్డుకునే = రోధి, రోధక

అనే = వాది, వాదక, వక్త

అఱిచే = ఘోషక, ఆక్రోశక

అసహ్యించుకొనే = జుగుప్సక

అసహ్యిచుకోబడిన = జుగుప్సిత

ఆడించే = విన్యాసక

ఆడించబడిన = విన్యస్త

ఆడే = క్రీడక, ఖేలక

ఆపే = స్తంభక, ప్రతిష్టంభక

ఆలోచించే = చింతక, ఆలోచక, యోచక, మీమాంసక

ఇచ్చే = ప్రద, దాయక, ప్రదాయక, దాత (తృ), ప్రదాత (తృ)

ఇవ్వబడిన = దత్త, ప్రదత్త

ఉంచబడిన = న్యస్త

ఉంచే = న్యాసక

ఉన్న = స్థిత, గత, స్థ

ఉపయోగపడే = ఉపయోగి, అర్థ, నిమిత్తక, హేతుక

ఎండగొట్టే = శోషక

ఎండే/ ఎండిన = శుష్క

ఎక్కే = ఆరోహి

ఎదురుచూసే = ప్రతీక్షి, ప్రతీక్షక, నిరీక్షక, నిరీక్షి

ఎన్నుకునే = వరీత/ వరీతృ

ఎఱిగిన/ తెలిసిన = జ్ఞ, వేది

ఏడ్చే = శోచక

ఏడిపించే = విలాపక

ఏరే/ ఏరుకొనే = ఉంఛక

ఏర్పఱిచే = విధాయి, విధాత (తృ)

ఓర్చుకొను = సహ, క్షమ

కట్టబడిన = నిర్మిత

కట్టుబడ్డ = బద్ధ, నిబద్ధ

కట్టే = నిర్మాయి, నిర్మాతృ

కలపబడిన = సంధానిత

కలిగించే = జనక, కర, కారక, కారి, కర్త

కలిపే = సంధాయి, సంధాయక, మేళక

కలిసే = మిళన

కలిసిన = మిళిత, మిశ్ర

కల్పించబడిన – కల్పిత

కల్పించే – కల్పక

కఱిగే = లీన

కాలిన/ కాల్చబడిన = దగ్ధ

కాలే = దహర

కాల్చే = దాహక

కొట్టే = తాడక, ప్రహారి

కొట్టబడిన= తాడిత, ప్రహృత

చూసే = దర్శి, ద్రష్ట, వీక్షక, అవలోకి

చూపే = దర్శక, ప్రదర్శక

చేసే = కర, కారక, కారి, కర్మి, కర్త

చేయబడిన =కృత

చంపే = హ, హంత, ఘ్న, ఘాతుక, సంహారి, సంహారక, మారి, మారక

చనిపోయిన = మృత, హత, పరేత

చదివే = అధ్యాయి, పాఠక

చల్లే = వికీర్ణి

చూసే = వీక్షక, దర్శి

జఱిగే = సంఘటి, సంభవ

జల్లే = వికీర్ణి

తగ్గించే = హ్రాసక

తగ్గించబడిన/ తగ్గిన =హ్రాసిత

తగ్గే = హ్రాసి

తడిసే = స్తేమక

తడిపే సేచక

త్రాగే = సేవి

తిట్టే = దూషక, విమర్శక

తినే = భక్షక, ఖాది, ఆద, ఆహారి

తిప్పే = భ్రామక

తిప్పబడిన = భ్రామిత

తిరిగే = చర

(మనుషులు) తిరిగే = ఆటక

(వస్తువులు) తిరిగే = ఘూర్ణక

తీసుకొనే = గ్రాహి, గ్రహీత

తీసుకోబడ్డ =గృహీత

తృప్తిపడే = తృప్త

తృప్తిపఱచే = తర్పక

తొక్కే = అవమర్దక

తొలగించే = పరిహారి, పరిహర, పరిహారక

దాక్కునే = గూహక

దాచే = గోపక, గోపి

దాటే/ దాటించే = తారక

దిగే = అవరోహి

దిగిన = అవరూఢ

ద్వేషించే = ద్వేషి, ద్వేషక

ద్వేషించబడిన = విద్విష్ట

ధ్వనించే = ధ్వానక, స్వానక, నాదక, రావి

నడపబడే = చోదిత

నడిపే = చోదక

నవ్వే = హాసక, హాసి

నిలబడే/ నిలిచే = స్థాయి

నివసించే = వాసి, నివాసి, వాస్తవ్య

నిర్లక్ష్యం చేసే = ఉపేక్షి, ఉపేక్షక

పండే = ఫలి

పట్టుకొనే = గ్రాహక

పడిపోయే = ధఃపాతి

పడుకునే = శాయి, స్వాపి

పుట్టిన = జ, జన్య, జాత, భవ, సంభవ, ఉద్భవ

పుట్టించే = జనక

పుట్టించబడిన = జనిత

పిసికే = పీడక

పెఱిగిన/ పెంచబడిన = భృత

పెఱిగే = ఏధక, ఏధి

పెంచే = పరివర్ధక, వర్ధక, విస్ఫారక

పెంచబడిన = వర్ధిత, పరివర్ధిత, విస్ఫారిత

పొందే/ చేఱే = ఆపి, ప్రాపి

పొందబడిన = లబ్ధ, ఆప్త, ప్రాప్త

పొగిడే = ప్రశంసక

పోగొట్టే = అపహ, నిస్తారక

పోయిన = గత

పోయే = గామి

పోరాడే = సంఘర్షక, సంఘర్షి

ప్రభావం చూపించే = ప్రభావక

ప్రభావించబడిన = ప్రభావిత

ప్రయాణించే = ప్రయాయి, యాత్రిక

ప్రేరేపించబడే = ప్రేరిత, ప్రచోదిత

ప్రేరేపించే = ప్రేరక, ప్రచోదక

ప్రేలే/ ప్రేల్చే – విస్ఫోటక

ప్రేలిన/ ప్రేల్చబడిన – విస్ఫోటిత

బయటికి వచ్చిన = నిర్గత

బాధించబడిన = బాధిత

బాధించే = బాధక, బాధి

బోధించే = బోధక, ఉపదేశక, అధ్యాపక

మండే = ప్రజ్వలి, ప్రజ్వాలక

మాట్లాడే = భాషి, ప్రసంగి, వచస్క

మోయబడే = సంభృత

లేచే = ఉత్థాయి, ప్రతిబోధి

లేచిన – ఉత్థిత

లోపల ఉన్న = గత, అంతర్గత, స్థ

వండే = పాచక

వచ్చే = ఆగామి

వర్షించే = వర్షక, వర్షి

వాదించే = వాది, వాదక

వ్రాయబడిన = లిఖిత

వ్రాసే = లేఖక

వ్యాపించే = వ్యాపక

వ్యాపించిన = వ్యాప్త

వినే = శ్రావి, శ్రావక, శ్రోత, ఆకర్ణి, ఆకర్ణయిత

వెలిగే = ప్రకాశక

వెళ్ళే/ పోయే = గామి

వెళ్ళిన = గత

వెళ్ళగొట్టే = బహిష్కారి, బహిష్కర, బహిష్కర్త, నిష్కాసక, నిష్కాసి

వెలికితీసే = నిష్కారి, నిష్కర, నిష్కర్త

వ్యక్తం చేసే = ద్యోతక

సేవచేసే/ సేవించే = సంసేవి

సృజించే/ సృష్టించే = స్రష్ట (స్రష్టృ), సర్గి, సర్జక

స్ఫురింపజేసే = స్ఫోరక

వీటిని ఇలా కాకుండా ఉపసర్గలతో కలిపి ఏకపదాలుగా వాడినా చాలా కొత్త పదాలు పుట్టుకొస్తాయి. ఉదాహరణకి-

ప్రతి = మళ్ళీ, ఎదురు

జన్ (జనించు) = పుట్టడం

జన్యం = పుట్టదగినది/ పుట్టించదగినది

ప్రతిజన్యం = Renewable

ప్రతిజన్య శక్తివనరులు = Renewable energy resources

అభ్యాస కార్యములు

I. ఈ క్రింది విశేషణాలకి ’తర, తమ’ ప్రత్యయాల్ని చేర్చి, వివిధ లింగాలకి అన్వయించి వాక్యాల్లో ప్రయోగించండి :

1. మధురం 2. సమీపం 3. విశదం 4. నిగూఢం 5. సులభం 6. జటిలం 7. రమణీయం 8. తీక్ష్ణం 9. భీకరం 10. ఇష్టం 11. మృదువు 12. ప్రియం 13. కోమలం 14. స్ఫుటం 15. స్పష్టం 16. కఠినం 17. అక్షయం 18. విహ్వలం 19. విక్లబం 20. లలితం.

II. ఈ క్రింది నామవాచకాలకి ’తర, తమ’ ప్రత్యయాల్ని చేర్చి వాక్యాల్లో ప్రయోగించండి :

1. గురువు 2. పర్వతం 3. సరస్సు (సరస్) 4. మాత (తృ) 5. అమాత్యుడు 6. నగరం 7. గ్రంథం 8. దేవత 9. విద్వాంసుడు (విద్వత్).

III. ఈ క్రింది పదాలకి ’ఉత్తమ, రాజ, రత్న, ప్రముఖ, ప్రకాండ, తల్లజ, సత్తమ, శ్రేష్ఠ’ శబ్దాలలో సముచితమైనది ఏదో ఎంచుకొని దానితో సమాసించండి :

1. సచివుడు 2. తీర్థం 3. మంత్రి 4. పురోహితుడు 5. స్త్రీ 6. పౌరుడు 7. కవి 8. సేవకుడు 9. గృహం 10. మణి 11. కావ్యం 12. శూరుడు 13. సుభాషితం 14. నటుడు 15. పద్యం 16. భక్తుడు 17. కృషీవలుడు 18. వానరుడు 19. పక్షి 20. పురుషుడు 21. ఋతువు 22. సాధువు.

IV. ఈ క్రింది స్త్రీలింగ పదాల్ని ’మతల్లి’ లేక ’మతల్లిక’ అనే పదంతో సమాసించండి :

1. సోదరి 2. రాజ్ఞి 3. కవయిత్రి 4. అభినేత్రి 5. నటి 6. అవని 7. వల్లి 8. సుమనం (సుమనో) 9. ప్రభ 10. కవిత.

V.విశేషణాల్ని వాడకుండా, కేవలం నామవాచకాలనే సమాసిస్తూ ఈ క్రింది ఆంగ్ల పదబంధాల్ని అనువదించండి.

1. Academic excellence 2. Artistic masterpiece 3. Bridal make-up 4. Central minister 5. Civil society 6. Commercial capital 7. Communal clashes 8. Criminal mentality 9. Domestic violence 10. Electrical shock 11. Environmental damage 12. Fiscal deficit 13 Global warming 14. Honorary doctorate 15. Human bomb 16. Musical concert 17. Public relations 18. Residential zone 19. Romantic flavour 20. Royal palace 21. Vestigial organ 22. Western nations. (వీటికి సమాధానాలు కావాలంటే ఈ అధ్యాయం చివఱ చూడండి)

 VI. ఈ క్రింది నామవాచకాలకి ’ఇక’ అనే ప్రత్యయాన్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి :

1. భూమి 2. తరువు 3. పదార్థం 4. పాలన 5. కులం 6. చర్మన్ 7. వర్ణం 8. ప్రబంధం 9. జాతి 10. శైలి 11. గురువు 12. శిరస్ 13. సారస్వతం 14. వాహనం 15. అణువు 16. సింధువు 17. అంబువు 18. ముష్టి 19. ఉపాస్తి 20. ప్రతినిధి 21. కపాలం 22. కరుణ 23. తంత్రం 24. మంత్రం 25. సంప్రదాయం 26. నగరం 27. శత్రువు 29. ముహూర్తం 30. ప్రపంచం 31. సమాజం 32. సంఘం 33. విమానం 34. నావ 35. వసువు (ధనం) 36. మండలం.

VII. ఈ క్రింది నామవాచకాల పదాది అచ్చుల్ని కేవలం వృద్ధిగా మార్చి విశేషణాల్ని నిష్పాదించండి :

1. మహిళ 2. వృక్షం 3. పుష్పం 4. సస్యం 5. చంద్రుడు 6. పవనం 7. శరీరం 8. శకటం (బండి) 9. ఋషి 10. ముని 11. విధి 12. కర్మన్ 13. దేవుడు 14. వికుంఠుడు 15. సికత (ఇసుక) 16. శ్రుతి 17. స్మృతి 18. ప్రకృతి 19. ఇంద్రుడు 20. ఇంధనం 21. ఋతువు 22. సేతువు 23. జంబూ (నేరేడు) 24. విద్యుత్ 25. గ్రీష్మం (వేసవి) 26. శశ్వత్ 27. గణం 28. ఉపనిషద్.

VIII. ఈ క్రింది నామవాచకాలకి ’య’ అనే ప్రత్యయాన్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. యశస్ 2. నభస్ (ఆకాశం) 3. తథా (అలాగే) 4. మూలం 5. కాలం 6. నస్ (ముక్కు) 7. ఆయుష్ 8. స్వర్గం 9. గంధం 10. జాతి 11. వస్త్రం 12. తమస్ 13. ఉదరం 14. దిక్ (శ్) 15. పరిషద్ 16. అంతం 17. దివసం 18. నిట్ (శ్) (రాత్రి) 19. శాకం 20. పాకం 21. ధనం 22. పదం 23. మదం 24. హృద్ (గుండె) 25. సత్ (ఉన్నటువంటిది) 26. బ్రహ్మన్ 27. దివి 28. సంధి 29. గృహం 30. నవం 31. వాచస్పతి 32. జనుష్ (పుట్టుక).

IX. ఈ క్రింది నామవాచకాలకి ‘ఈయ’ అనే ప్రత్యయాన్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. వర్షం 2. మైత్రి 3. స్థానం 4. భాష 5. శాఖ 6. మనీష (మనస్సు) 7. వర్గం 8. తరంగం 9. మృత్స్న (మంచి మట్టి) 10. 11. మేషం 12. కీటకం 13. వైద్యం 14. పాలకుడు 15. భటుడు 16. లోహం 17. నాటకం 18. మిథునం (జంట) 19. పాఠశాల 20. సౌధం 21. హస్తం 22. గ్లౌ (చంద్రుడు).

X. ఈ క్రింది నామవాచకాలకి ‘ఈన’ అనే ప్రత్యయాన్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. అంతరంగం 2. అంతరిక్షం 3. మృగం 4. నాళం (గొట్టం) 5. క్రమం 6. సాగరం 7. అంబరం 8. అంతర్ (లోపల) 9. రోమం 10. నిగమం 11. బృందం 12. వత్సరం 13. వల్కలం (నార) 14. పరిసరం 15. పటలం (కప్పు) 16. ద్వారం 17. ఝరం (సెలయేఱు) 18. గహ్వరం (గుహ) 19. పల్లవం (చిగురు) 20. ఫలం 21. సమతలం 22. అంగం 23. సర్గం (సృష్టి) 24. గ్లౌ (చంద్రుడు).

XI. ఈ క్రింది నామవాచకాలకి ‘ఏర’ అనే ప్రత్యయాన్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. శాసనం 2. సుతుడు 3. కళ 4. పథం 5. పాదం 6. ఔషధం 7. కోశం 8. లింగం 9. సుమం 10. ఉదకం 11. ధనికుడు 12. యానం 13. కిరణం 14. భావం 15. యుద్ధం 16. సైన్యం 17. వచనం 18. రచన 19. హృదయం 20. బలం 21. బాలుడు.

XII. ఈ క్రింది నామవాచకాలకి ‘ల’ అనే ప్రత్యయాన్ని చేర్చి, విశేషణాల్ని నిష్పాదించి వాటిని వివిధ లింగాల్లోకి మార్చండి:

1. కేశం 2. లత 3. లోష్టం (మట్టి) 4. శూన్యం 5. సారం 6. భారం 7. క్షారం 8. ఛద్మ (మోసం) 9. కణం 10. మేఘం 11. పత్రం 12. మిత్రం 13. భంగం 14. శృంగం 15. ఘాసం (గడ్డి) 16. శిల 17. బాహువు 18. మృగం 19. ధ్వాంతం (చీకటి) 20. గణం.

XIII. ఈ క్రింది నామవాచకాలకి ‘పరం’ అనే సమాసావయవాన్ని చేర్చి ,విశేషణాల్ని నిష్పాదించి వాటిని మళ్ళీ ఇతర పదాలతో సమాసించండి :

1. విద్య 2. కులం 3. మతం 4. శాఖ 5. నైపుణ్యం 6. సేవ 7. దైవం 8. సాధన 9. సిబ్బంది 10. ప్రభుత్వం 11. వాణిజ్యం 12. దౌత్యం 13. శీలం 14. నిర్మాణం 15. వ్యవస్థ 16. సంస్థ 17. నిర్వహణ 18. యాజమాన్యం 19. మేధ 20. శృంగారం.

XIV. ఈ క్రింది నామవాచకాలకి ’క’ అనే ప్రత్యయాన్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. తపస్ 2. వర్చస్ 3. శ్రేయస్ 4. కర్త (ర్తృ) 5. కర్మ 6. క్రియ 7. సువర్ణం 8. పర్ణం (ఆకు, ఱెక్క) 9. ధైర్యం 10. శౌర్యం 11. దయ 12. భీతి 13. ముక్తి 14. జ్యోతిష్ 15. అనిలం (గాలి) 16. అనలం (అగ్ని) 17. సీమ 18. సౌందర్యం 19. చిత్రం 20. చిహ్నం 21. అంగారం (నిప్పుకణిక) 22. అటవి (అడవి).

XV. ఈ క్రింది నామవాచకాలకి ‘మతుప్/ ణిని/ విన్/ స-’ అనే ప్రత్యయాల్ని సందర్భానుసారంగా చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. కాంతి 2. శాంతి 3. వస్తువు 4. కీర్తి 5. రేతస్ (వీర్యం) 6. అనస్ (బండి) 7. ఉషస్ (ఉదయం) 8. తమస్ (చీకటి) 9. అర్చిష్ (మంట) 10. శోచిష్ (కాంతి) 11. రోచిష్ (కాంతి) 12. ధనుష్ (విల్లు) 13. అంధస్ (అన్నం) 14. ఉరస్ (ఱొమ్ము) 15. వక్షస్ (ఱొమ్ము) 16. అంహస్ (పాపం) 17. ఏనస్ (పాపం) 18. జలం 19. కల్మషం 20. అధికారం 21. స్నేహితులు 22. నిరూపణ 23. ఉపపత్తి (తర్కం) 24. మంత్రం 25. భార్య 26. పత్ని 27. ఆలోచన 28. హృదయం 29. ప్రేమ 30. కామం 31. అక్షరం 32. ప్రాసాదం (రాజభవనం) 33. ప్రాకారం (ప్రహరీగోడ) 34. రోగం 35. శరీరం 36. పరిశ్రమం 37. వ్యాయామం 38. అభావం (లేమి) 39. లోపం 40. పాపం.

XVI. ఈ క్రింది నామవాచకాలకి ’రహిత, అపేత, హీన, విహీన’ అనే ప్రత్యయాల్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి :

1. సారం 2. రసం 3. వివేకం 4. అందం 5. మార్దవం 6. మొహమాటం 7. అలంకారం 8. అహంకారం 9. వైభవం 10. శోభ 11. గుణం 12. సత్త్వం 13. ప్రతిభ 14. అవయవం 15. చలనం 16. ద్రవ్యం 17. కాగితం 18. ప్రత్యామ్నాయం 19. అవకాశం 20. అదృష్టం 21. శ్రమ 22. తెలివి 23. భావన 24. ఆలోచితం 25. ప్రణాళిక.

అదే విధంగా పైపదాలకే ’అ/అన్/నిర్/ నిస్’ అనే ప్రత్యయాల్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి.

XVII. ఈ క్రింది నామవాచకాలకి ’యుక్త, యుత, అన్విత, సమన్విత, ఉపేత, సమేత, సహిత, మిశ్ర, పూర్వక, పురస్సర’ అనే సమాసావయవాల్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. రాగం 2. భావం 3. బాధ్యత 4. ఓషధి 5. పదార్థం 6. ఆలాపం 7. బలం 8. టీక 9. తాత్పర్యం 10. ఆస్వాదన 11. వ్యాఖ్యానం 12. అర్థం 13. తేజస్ (తేజో) 14. ఓజస్ (ఓజో) 15. ఛందస్ (ఛందో) 16. పయస్ (పయో) (పాలు) 17. సేన 18. అభినయం 19. అనురాగం 20. వాత్సల్యం.

XVIII. ఈ క్రింది నామవాచకాలకి ’పూర్ణ, పూరిత, భరిత, మయ, భూయిష్ఠ, అవహ’ అనే సమాస అవయవాల్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి :

1. భావోద్వేగం 2. ద్వేషం 3. కాలుష్యం 4. కశ్మలం 5. మలీమసం (మలినం) 6. దోషం 7. పరిమళం 8. సువాసన 9. ఆహ్లాదం 10. ఆనందం 11. హర్షం 12. దుఃఖం 13. శోకం 14. చింత 15. హేమం (బంగారం) 16. శిల 17. దారువు (చెక్క) 18. నేఱం 19. ఉత్సాహం 20. ఉద్రేకం.

XIX. ఈ క్రింది నామవాచకాలకి ’ఆదృశ, సదృశ, ప్రాయ, ఆభ, నిభ, సన్నిభ, నిర్విశేష, సమ, సమాన, తుల్య, కల్ప, ఉపమాన, ఉపమ’ అనే సమాసావయవాల్ని చేర్చి విశేషణాల్ని నిష్పాదించండి:

1. ద్వీపం 2. మాత (తృ) 3. పిత 4. జామాత (అల్లుడు) 5. మానవుడు 6. వానరుడు 7. దేవత 8. రాజు 9. గురువు 10. శిష్యుడు 11. కుమారి 12. పుత్రుడు 13. అమృతం 14. స్వర్గం 15. ఇక్షువు (చెఱకు) 16. సూర్యుడు 17. వనం 18. కుసుమం 19. శిల 20. హాలాహలం 21. కాలకూటం 22. అగ్ని.

XX. ఈ క్రింది ఆంగ్ల పదబంధాల్ని అనువదించండి :

1. All-time record 2. Antibiotic medicine 3. Awe-struck 4. Battle-hardened 5. City-bred 6. Country-made 7. Cut-throat 8. Duty-bound 9. Duty-free 10. Duty-minded 11. Eco-friendly 12. Flight-ready 13. Fun-filled 14. Hand-held 15. Home-bound 16. Law-abiding 17. Leak-proof 18. Life-treatening 19. Long-proven 20. Man-made 21. Mentor-like 22. Motorable 23. Non-profit 24. Rebel-led 25. Record-breaking 26. Rule-compatible 27. Service-minded 28. Time-tested 29. Trigger-happy 30. User-friendly 31. Low-talent zone 32. High pressure zone 33. Industry-oriented 34. Test drive.

(వీటికి సమాధానాలు కావాలంటే ఈ అధ్యాయం చివఱ చూడండి)

V అభ్యాసానికి సమాధానాలు

1. Academic excellence          – విద్యాపారీణత

2. Artistic masterpiece           – కళాకృతి

3. Bridal make-up  – పెళ్ళిముస్తాబు (పెళ్ళి సింగారం)

4. Central minister –  కేంద్రమంత్రి

5. Civil society  –          పౌరసమాజం

6. Commercial capital –  వాణిజ్య రాజధాని

7. Communal clashes –          మతకల్లోలాలు

8. Criminal mentality  –  నేరప్రవృత్తి

9. Domestic violence – గృహహింస

10. Electrical shock –  విద్యుద్ ఘాతం

11. Environmental damage –  వాతావరణ విధ్వంసం

12. Fiscal deficit –  ద్రవ్యలోటు

13. Global warming –  భూతాపం

14. Honorary doctorate         –  గౌరవ ప్రపట్టం

15. Human bomb          –  మానవ బాంబు

16. Musical concert  –            సంగీత కచేరి

17. Public relations –  ప్రజాసంబంధాలు

18. Residential zone – నివాసప్రాంతం

19. Romantic flavour – శృంగార పరిమళం

20. Royal palace – రాజభవనం

21. Vestigial organ –  అవశేష అవయవం (అవశేషాంగం)

22. Western nations –  పశ్చిమ దేశాలు

XX అభ్యాసానికి సమాధానాలు

1. All-time record -సార్వకాల ప్రప్రథమత్వం

2. Antibiotic (medicine) – జీవఘ్నం, (జీవఘ్నౌషధం)

3. Awe-struck – అద్భుతావిష్ట

4. Battle-hardened – మహారథి

5. City-bred – పట్నకాపు

6. Country-made – నాటు (నాటు తయారీ)

7. Cut-throat – కుత్తుకలు ఉత్తరించుకొనే

8. Duty-bound – కర్తవ్యనిష్ఠుడైన

9. Duty-free – పన్నులేని (నిష్కరం)

10. Duty-minded – కర్తవ్యాత్ముడైన

11. Eco-friendly – పర్యావరణసఖం (పర్యా-సఖం)

12. Flight-ready – డయన సన్నద్ధం, డేష్యం

13. Fun-filled – సరదామయం

14. Hand-held – చేత్తో పట్టుకునే, హస్తధారితం

15. Home-bound  – గృహోన్ముఖం

16. Law-abiding  – చట్టనిబద్ధం, చట్టనిబద్ధుడైన

17. Leak-proof – స్రవణరోధి

18. Life-threatening  – ప్రాణాపాయకరం

19. Long-proven – చిర నిరూపితం, చిర నిదర్శితం

20. Man-made –  మానవకృతం

21. Mentor-like  – గురునిర్విశేషుడైన, గురుతుల్యుడైన, గురుతుల్య-

22. Motorable – వాహనోచితం, వాహనయోగ్యం

23. Non-profit – లాభ నిరపేక్షం

24. Rebel-led – విప్లవకార పురోగమం

25. Record-breaking – అనిదంపూర్వం

26. Rule-compatible – నియమానుసారి, నిబంధనానుగుణం

27. Service-minded – సేవాభావుక/ సేవాభావుకుడైన

28. Time-tested – కాలపరీక్షితం

29. Trigger-happy – తుపాకీరాముడైన

30. Knee-deep – మోకాటి లోతు (జానుదఘ్నం)

31. Low-talent zone – అల్పప్రతిభా మండలం/ ప్రాంతం

32. High pressure zone – అధిక పీడన/ ఒత్తిడి మండలం

33. Industry-oriented  పరిశ్రమోన్ముఖం, పరిశ్రమ లక్ష్యకం, పరిశ్రమ గమ్యకం, పరిశ్రమ ధ్యేయకం

34. Test drive – పరీక్షార్థ నడపకం

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.