palaparthi cover

థూ థూ.. థూ థూ

థూ థూ అని ఉమ్ము వెయ్యడం నేర్చుకుంది పాపాయి.

భలే సరదాగా ఉన్నది కొత్త ఆట.

థూ థూ అని చిన్న చిన్న ఉమ్ములు నేల మీద.

థూ థూ

థూ థూ

అమ్మ చూసింది.

కళ్ళ బాల్స్ ని పెద్దవి చేసి కోపంగా చెప్పింది.

ఛీ ఛీ! తప్పు! ఏంటా పనులు? ఎప్పుడూ అలా చెయ్యకు!

మళ్ళీ ఇంకోసారి చూసేనో దెబ్బలు పడిపోతాయి జాగ్రత్త!

చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

అమ్మ వెళ్ళిపోయాక పాప మళ్ళీ థూ థూ అని ఉమ్మేస్తూ

కప్పలాగా ఎగరడం మొదలు పెట్టిందో లేదో

అమ్మ గబుక్కున వంటింట్లోంచి వచ్చేసి కోపంగా చూస్తూ నిల్చుంది.

పాప బిత్తరపోయింది ఓ నిముషం.

అమ్మ అప్పుడే వంటింట్లోంచి వచ్చేస్తుందనుకోలేదు.

అలా చెయ్యొద్దని ఇప్పుడేనా చెప్పింది? అరిచింది అమ్మ.

కప్ప పాప లేచి నిలబడి

రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని

ఒన్ ఒన్

థూ థూ

థ్రీ థ్రీ

నంబర్సు చెప్పుతున్నా! తెలీదా? అన్నది గట్టిగా.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, చిట్టి చిట్టి మిరియాలు, సీరియల్ and tagged , , , , , .

One Comment

  1. బావుంది. ఆ వయసు పిల్లలు తెలివైనవాళ్ళు. ముద్దుముద్దుగా తమని తాము సమర్థించుకోగలరు. ఈ నయసులో ముచ్చటేసిన ఈ తెలివితేటలే పెద్దయ్యాక అతి తెలివి అనిపిస్తుంది. అందుకే పిల్లలు ఆ వయసులోనే ఉండిపోతే బాగుండనిపిస్తుంది. చిట్టి చిట్టి మిరియాలు బావుంటున్నాయి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.