palaparthi cover

మాట వినని నాలుక

అమ్మా చూడు! చూడు! ఇదెంత Fall గా ఉందో అన్నది పాప, గడ్డిలో వాలిన పిచుకను చూపించి.

Fall కాదురా  small అనాలి.

అంటే చిన్నది అని అర్ధం. తెలిసిందా.

చెప్పింది అమ్మ.

ఏదీ small అను?

Fall..

Fall..

Fall…

అమ్మక్కొంచెం కోపం వచ్చింది.

Fall కాదురా SMALL !!!

ఇప్పుడు సరిగ్గా చెప్పు..

FaaaaL

FfaaaLL

FfaaaLL

FFAAALL…

పాపకి చాలా బెద్ద విసుగు వచ్చేసింది.

అమ్మా! ఎన్ని సార్లు చెప్పినా నా నాలిక  Fall అనే అంటోంది చూడు!  అని ఫిర్యాదు చేసింది పాప,

నోరు తెరిచి వేలితో నాలిక చూపిస్తూ.

 *

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, చిట్టి చిట్టి మిరియాలు, సీరియల్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.