COVER

వెళ్లిపోయింది

చాల పక్షుల

కళ్ళు గప్పి దాక్కుని

ఆరుసార్లు

తనలోంచి తనను

చీల్చుకుని, చివరికి

తనలోంచే తాను పునర్జన్మించి

అప్పుడప్పుడే తడి ఆరిన

రంగురంగుల రెక్కలను

కను రెప్పల్లా తాటించి

తానింకా బతికేవుండడం తానే

నమ్మలేనట్లు విప్పార్చి

పచ్చటి మైదానంలో

పూల కోసం బయల్దేరి

దారికడ్డంగా

వికృతంగా మొలిచిన

నల్లని

రోడ్డు మీద దూసుకొచ్చిన కారులో

జీవితం గూర్చి మహా సిద్ధాంతాలు

ఒకరిమీదొకరు రువ్వుకుంటున్న నలుగురి

గుండెల్ని అదరగొడుతూ

‘టప్’ మని

విండ్ షీల్డ్ మీద

ఒకే ఒక్క చారిక

తన గుర్తుగా

ఈ లోకానికి వదిలి…

– మమత

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, కవిత and tagged , , , , .

2 Comments

  1. Pingback: కవిత్వం నాకు ‘నక్స్ వామికా’ లాంటిది! -మమత | వాకిలి

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.