palaparthi cover

పోవరేంతీ కారు వాల్లూ??

అమ్మా పాపా లైబ్రరీ కి వెళ్ళి నడిచి వస్తున్నారు.

పాపకి లైబ్రరీకి వెళ్ళడం అంటే హాప్పీ.

అక్కడి పిల్లల బొమ్మల పుస్తకాలు చూడ్డం ఇంకా చాలా చాలా హాప్పీ.

కూడలిలో ఎర్ర లైటు వెలిగింది.

వాహనాలన్నీ ఆగిపోయాయి.

అమ్మా పాపా రోడ్డు దాటారు.

వెనక్కు తిరిగి చూసింది పాప.

తనూ అమ్మా రోడ్డు దాటేసినా ఆ కారు వాళ్ళు ఇంకా ఎందుకు ఆగి ఉన్నారో అర్ధం కాలేదు పాపకి.

కారు వాల్లూ! ఇంక పోవండీ! అరిచింది పాప కార్ల వంక చేతులు ఊపుతూ.

ఎవ్వళ్ళూ కదల్లేదు.

పైగా అంతా దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు ఆగిపోయి ఉన్నారు.

కారు వాల్లూ! మేం ఇతు వైపొచ్చేసాం! ఇంక పోవండీ! పోవండీ!! అని చేతులు ఊపుతూ అరిచింది.

మూడో సారి భాష మార్చి గొంతు పెంచింది.

YOU CAN GO NOW! GO! GO!

గాట్టిగా చేతులు ఊపింది.

పచ్చ లైటు కోసం అసహనంగా ఎదురు చూస్తున్న వాహనదారులు తమ తలలు తిప్పి పాప వైపు చూసి నవ్వేరు.

అలిసిన వాళ్ళ మొహాల మీద చిరునవ్వులు మతాబాల్లా వెలిగాయి.

అర్ధం కాక పాప అమ్మ వంక చూస్తే, అమ్మ కూడా నవ్వేస్తోంది.

అప్పుడు దారి పొడవునా ఎర్ర లైతూ పచ్చ లైతూ గురించే మాతాడింది పాపతో.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, చిట్టి చిట్టి మిరియాలు, సీరియల్ and tagged , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.