cover

పద్మప్రాభృతకమ్ (4)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

[పరిక్రమ్య]

స ఇదానీం దేవసేనాసముత్థం మదనామయమతివ్యాయామకృతజ్వరముద్దిశ్య హారతాళవృన్తచన్దనోపనీయమానదాహప్రతీకారః తత్సమాగమాశాకృతప్రాణధారణం శయనపరాయణః కథఙ్చిత్ వర్తతే | అద్య తు ప్రాగహరేవ పుష్పాఙ్జలికో నామ దేవదత్తాయాః పరిచారకః సోపచారముపగమ్య కర్ణీపుత్రముక్తవాన్ -

ఆర్యపుత్ర, విజ్ఞాపయత్యజ్జుకా దేవదత్తా ’న ఖలు మే హ్యస్తనేऽహన్యనాగమనాద్ బహుమానమధ్యస్థతాముపగన్తుమర్హత్యార్యపుత్రః | ఇయం హి మే భగినికా చణ్డాలికా కిమపి అస్వస్థరూపా తదనుకమ్పయా పర్యుషితాऽస్మి| ఇయం తు సమ్ప్రతమాగచ్ఛామీతి |తతస్తదుక్తదత్తప్రతివచనః ప్రతిపస్థాప్య పుష్పాఙ్జలికం కర్ణీపుత్రః సోపగ్రహమివ మాముక్తవాన్ – ’సఖే శశ, త్వయాऽపి నామ శ్రుతం ’సామ్ప్రతమిహాగచ్ఛామి’ ఇతి | తదేష ఇదానీమవసరః సుఖప్రశ్నాగమనేన వివిక్తవిస్రమ్భాం దేవసేనామవగాహ్య సన్తాపకారణమస్యాః పరిజ్ఞాతుమ్ | తదేషోऽజ్ఞలిః | సర్వోపాయైరర్హతి దేవానాంప్రియోऽస్మాకం దేవసేనాసముత్థం హృదయగతమాపుంఖనిఖాతం మదనశరశల్యం సముద్ధర్తుమ్’ ఇతి | తతాః సస్మితానుయాత్రముక్తో మయా ’భవతు ధూర్తాచార్య, కిమితి త్వయా దివా దీపప్రజ్వాలనం క్రియతే | కిం నాభిజ్ఞోऽహం యువయోరన్యోన్యమనోరథమూకదూతకానాం నయనసంగతకానామ్ | అపి చ, స ఏవాస్మి మూలదేవసఖః శశోऽహమ్ నైనామప్రతార్యాగమిష్యామి’ ఇత్యుక్త్వా ప్రస్థితోऽస్మి ! తత్ కిం ను రాజమార్గే సుహృత్ప్రశ్నసఙ్కథాభిః కాలం క్షపయతా తథా గన్తవ్యమ్ యథా దేవదత్తావిరహితాం చణ్డాలికామాసాదయేయమ్

(ముందుకు నడచి)

అతడు ఇప్పుడు దేవసేన వలన కలిగిన మదనవ్యాధిని సయించుటవలన హారములు, తాళవృంతపు గాళులు, చందనము గాగల తాపోపశమముల ధరించి కేవలమామెసమాగమునకై ప్రాణములను నిలుపుకుని శయనాగతుడై ఎలాగుననో యున్నవాడు.

ఈ రోజు మధ్యాహ్నమునకు ముందుగ ప్రాంజలికుడను దేవదత్త పరిచారకుడు ఉపచారసహితముగ వచ్చి కర్ణీపుత్రునికి చెప్పెను – ఆర్యపుత్ర, దేవి దేవదత్త విజ్ఞాపనమిది ’ రేపు నేను రాకపోయిన ఆర్యపుత్రుడు నాకై సమాదరభావమున ఉపేక్షించుట సరికాదు. నా చెల్లెలు చాండాలిక (దేవసేన) కొంత అస్వస్థత నొందినది. ఆమెను చూచుకొనుటకై ఆగితిని. త్వరలో వచ్చెదను’

అతనికి ప్రతివచనమిచ్చి పంపి కర్ణీసుతుడు ప్రీతిపూర్వకముగ నాకిట్లనెను – ’సఖుడా! శశ! నేను వచ్చెదనని దేవదత్త చెప్పినమాట వింటివికదా. ఈ అవసరమును పురస్కరించుకుని కుశలప్రశ్న మిషచేత జ్వరపీడిత దేవసేన యొక్క సంతాపకారణమును తెలుసుకొనుము. ఇదే నా యంజలి. దేవసేన ప్రయోగించిన, నా హృదయమున లోతుగ నాటుకున్న ఈ కామబాణమును పెరికివేయుటకు నీవే సమర్థుడవు’. అంతట చిఱునగవుతో నేనంటిని – “కానిమ్ము ధూర్తాచార్యుడా. పగలే దీపమును వెలిగించుట ఎందుకు? మీ ఇద్దరి వీక్షణప్రసారముల మనోరథ మూక వర్తమానముల నెఱుఁగనా యేమి? ఇంక, నేను మూలదేవుని సఖుడను శశుడను. ఈ విషయమును తేల్చక తిరిగిరాను”యని చెప్పి బయలుదేరితిని. అందువలన రాజమార్గమున మిత్రులతో ముచ్చటలాడుచూ సమయము గడుపుచూ, దేవదత్త లేని సమయమున దేవసేనను చేరి పలుకరించెద.

(పరిక్రమ్య)

అహో తు ఖలు వసుంధరావధూ జంబూద్వీప వదనకపోలపత్రలేఖాయా నానాభాణ్డసమృద్ధయా అవన్తిసున్దర్యా ఉజ్జయిన్యాః పరా శ్రీః | ఇహ హి -

పుణ్యాస్తావద్ వేదాభ్యాసా ద్విరదరథతురగనినదా ధనుర్గుణనిఃస్వనా

దృశ్యం శ్రావ్యం విద్ధద్వాదాశ్చతురుదధిసముదయఫలైః కృతా విపణిక్రియా |

గీతం వాద్యం ద్యూతం హాస్యం క్వచిదపి చ విటజనకథాః క్వచిత్సకలా కలాః

క్రీడా పక్షిక్షుబ్ధాశ్చేమాః ప్రచురకరవలయరశనాస్వనా గృహపఙ్తయః ||

(ముందుకు నడచి)

అహో, భూదేవి యను వధువునకు వదనమైన జంబూద్వీపమునకు చెక్కిలి పత్రలేఖకు సమానమైన అవంతిసుందరి యనెడు ఉజ్జయినీ నగరపు అపూర్వశోభ, అనేకానేక భాండాగములతో సమృద్ధమై ఒప్పుచున్నది. ఇక్కడే -

తావత్ = ఎల్లెడల, పుణ్యాః = పుణ్యములైన, వేదాభ్యాసాః = వేదాభ్యాసములూ, ద్విరదరథతురగనినదాః = యేనుగుల, రథతురగములనినదములు, ధనుః = ధనువు యొక్క, గుణి = అల్లెత్రాటి, నిఃస్వనా = చప్పుళ్ళు, దృశ్యం = నాటక, శ్రావ్యం = కావ్య, విద్వద్వాదాః = పండితుల చర్చలు, చతుః = నాలుగు, ఉదధి = సముద్రములందు, సముదయఫలైః = ఉదయించిన ఫలములచేత, కృతాః = చేయబడినవి, విపణికాక్రియాః = అంగడిసరుకులు, (రత్నమాలలిత్యాదులు) గీతం = గీతమునూ, వాద్యము = వాద్యమునూ, ద్యూతం = పణ్యములు, హాస్యం = హాస్యమును, క్వచిదపి = ఒకచో, విటజనకథాః = రంకుమొగుళ్ళకథలు, క్వచిత్ = ఒకచో, సకలాః కళాః = సకలమునైన కళలు, క్రీడాః = ఆటలు, ప్రచుర కరవలయః అశనా స్వనాః = (పంజరముల చుట్టు) కమ్మిన చేతుల చప్పుళ్ళ, పక్షిక్షుబ్ధాశ్చేమాః = పక్షుల (పెంపుడు చిలుకల) రవములు కల, గృహపంక్తయః = ఇళ్ళవరుసలు.

తాత్పర్యము: ఇక్కడే కదా పుణ్యవేదాభ్యాసములు, గజ,రథతురగనినాదాలు, అల్లెత్రాటి చప్పుళ్ళూ, కావ్యనాటక పండితచర్చలూ, నాలుగు సముద్రములనుండి సేకరించిన రత్నములతో చేసిన మాలలను విక్రయించు విపణులూ, ఒకచోట విటులకథలూ, ఒకచోట ఇతరకళలూ, గాజులగలగలలచేతులను కలకలరావాల పక్షులున్న పంజరముల ప్రక్కన యాడించుచున్న అంగనలు గల ఇళ్ళవరుసలూ..

విశేషములు: నగరవర్ణన. స్వభావోక్తి అలంకారం. నైషధీయచరితమున విదర్భరాజధాని సుదీర్ఘ వర్ణన కు సంక్షిప్తీకరణ వలె నున్నది.

(పరిక్రమ్య) అపీదానీమభిమతకార్యనిష్పత్తిసూచకం కిఙ్చిన్నిమిత్తం పశ్యేయమ్ | (విలోక్య)

అయం తావత్ కావ్యవ్యసనీ కాత్యాయనగోత్రః శరద్వతీపుత్రః సారస్వతభద్రః స్వగృహద్వారకోష్టకే శ్వేతవర్ణవ్యగ్రాగ్రహస్తః చిన్తితోపస్థితాస్వాదితాకారాక్షిభ్రూవికారైరభినయన్నివ చక్రపీడకక్రీడామనుభవతి | తత్కామమస్మిన్ కాలే ప్రవృత్తప్రతిభాస్రోతోవిఘాతినం సుప్రియమపి సుహృదమభ్యసూయన్తే కవయః | కిన్తు సరస్వతీలతాప్రభావానాం వాక్పుష్పకాణాం కర్ణపూరమ్ అకృత్వాऽతిక్రమితుం వఙ్చితమివాత్మానం మన్యే | యావదేనాముపసర్పామి | (ఉపేత్య)

సఖే కాత్యాయన కిమిదమాకాశరోమన్థనం క్రియతే | కిం బ్రవీషి – “స ఏవ మా కావ్యపిశాచో వాహయతి” ఇతి | మా తావత్ భోః అంధో పురాణకావ్యపదచ్ఛేదగ్రథనచర్మకార కిమిదం నష్టగోయూథ ఇవ గోపాలకో నవపదాన్యన్వేష్యసే | అథ సఖే కిం వస్తు పరిగృహ్య కృతః శ్లోకః | కిం బ్రవీషి – “నను ఖలు ఇమమేవ వర్తమానరమణీయం వసన్తసమయమాశ్రిత్య కృతః శ్లోకః” ఇతి | అథ శక్యం శ్రోతుమ్ ? కిం బ్రవీషి – “నన్వేష భిత్తిగతో వాచ్యతామ్” ఇతి. కాసౌ? (విలోక్య) అయే అయం -

(ముందుకు నడచి)

మనోభీష్టము పూర్తి అగుటకై ఎవడైన సుగుణవంతుని చూచెదను.

(పరికించి)

ఇతడే కదా కావ్యవ్యసని, కాత్యాయనగోత్రీకుడు శారద్వతీపుత్రుడు అయిన సారస్వతభద్రుడు! తన ఇంటి తలుపు ముంగిలిని ఉంగరమున అంటుకున్న మసితో, చింతను భ్రూవిక్షేప, ఆకారాదుల చేత అభినయించుచూ, చక్రపీడ అను విరహవేదనను అనుభవించుచున్నాడు. ఇట్టి సమయమున బయల్వడు ప్రతిభాధార ను తునకలు చేయుటకై నా ప్రియమిత్రుని మీదనూ కవిగణము వెడలును. కానీ సరస్వతీలతకు పూచిన వాక్కుసుమములను చెవికి ఆభరణముగా చేయకుండా, ముందుకు నడుచుట నన్ను నేను మోసగించుకొనుటయే అనుకొందును. అందువల్లనితనిని సమీపింతును. (సమీపించి) సఖుడా కాత్యాయన! ఏల ఇలా ఆకాశమును నెమరువేయుచున్నావు? ఏమంటావూ – “అదే, నాకు కావ్యపిశాచమను గాలి వీయుచున్నది” అనియా? ప్రాచీన కావ్యాలలో ముక్కలు సేకరించి కుట్టుకునే చర్మకారుడా, ఇప్పుడిలా గోవులకాపరి కోల్పోయిన గోవులమందలా కొత్తపదాలను వెతుక్కుంటున్నావా? ఇప్పుడు సఖుడా, ఏ వస్తువును గ్రహించి శ్లోకము రచించితివోయి? ఏమంటావూ – “ఇది ప్రస్తుతము నడుచుచున్న రమణీయమైన వసంతకాలమును వర్ణించు శ్లోకము” అని. నేను దానిని వినగలనా? ఏమంటావు – “అలా కాదు, పైన గోడమీదనున్నది చదువుకో”మనియా? అదేమిటి? (చూచి) అయే, అది -

(చక్రవాక పక్షులకు (జక్కవములు) విరహవేదన – చక్రపీడ అనునది కవిసమయము. ఈ పక్షులు రాముని విరహవేదనను పరిహసించగా, రాముడా పక్షులకు శాపమొసగెనని పురాణగాథ.)

పుష్పస్పష్టాట్టహాసః సమదమధుకరః కోకిలావావదూకః

శ్రీమత్స్వేదావతారః ప్రసుభగపవనః కర్కశోద్దామకామః |

బాలామప్యప్రగల్భాం వరతనుమవశాం కామినో సమ్ప్రదాతుం

కాలోऽయం తత్కరిష్యత్యనునయనిపుణం యన్న దూతీసహస్రమ్ ||

సాధు భోః కల్యాణం ఖల్వేతన్నిమిత్తమ్ | వయస్య, సత్పుత్ర లాభ ఇవ యసస్కరః శ్లోకోऽయమస్తు | వాక్పురోభాగానామభాగీ భవ | అయే కేనైతద్ హసితమ్ ? (విలోక్య) అయే దర్దరకః పీటమర్దోऽప్యత్ర | అఘో! దర్దరక, కిమత్ర హాస్యస్థానమ్ ? కిం బ్రవీషి – “ఇదం ఖలు భవతా సముద్రాభ్యుక్షణం క్రియతే యద్ వాగీశ్వరం వాగ్భిరర్చయసి” ఇతి | మా తావదలోకజ్ఞ కిం వసన్తమాసో న పుష్పోపహారమర్హతి? అపి చ న త్వయా శ్రుతపూర్వమ్ –

పుష్పస్పష్టాట్టహాసః = కుసుమముల స్పష్టమైన అతిశయహాసము, సమదమధుకరః = మత్తభ్రమరము, కోకిలావావదూకః = కోయిలల కుహురవమూ, శ్రీమత్ స్వేదావతారః = చిరుచెమటలు, (శ్రీమత్ విశేషణము – ఆ చెమట సురతము వలన కలిగినదని చమత్కారమైన సూచన), ప్రసుభగపవనః = మిక్కిలి సుభగమైన గాళులు, కర్కశోద్దామకామః = కర్కశుడు, ప్రచండుడైన కాముడు, అప్రగల్భాం = ఎక్కువ మాటలాడని, బాలాం అపి = ముగ్ధను, వరతనుం = అందమైన శరీరముగలదానిని, అవశాం = కన్యను, కామినే = కామించినవానికి, సంప్రదాతుం = కట్టబెట్టు, యత్ = ఏ పని, అనునయనిపుణాం = నిపుణముగ మాటలాడగల, ద్యూతీసహస్రం = వేలదూతికలను, న కరిష్యతి = చేయలేదో, తత్ = అట్టి, కాలః అయం = కాలమిది.

తాత్పర్యము: కుసుమాట్టహాసములు, మత్తభృంగములు, కోవెలల కూజితములు, సురతమువలన కలిగిన చిరుచెమటలు, పరిమళభరితమైన మారుతములు కలిగి కర్కశమదనునిచేత వేయి నిపుణదూతికల మాటల చేతనైన లొంగని ముగ్ధను కన్యను కామికి కట్టబెట్టు అందమైన కాలమిది. (స్రగ్ధరా - మ ర భ న య య య)

భళా! ఈ నిమిత్తమై నీకు కల్యాణమగుగాక! సత్పుత్రలాభము వలె ఈ శ్లోకము యశస్కరమగుగాక! వాగ్దోషములు లేని కవివగుదువు గాక! అయే, ఎందుకీ మందహాసము? (చూచి) ఆహా, దర్దరకుడను పీటమర్దుడు కూడా వచ్చియున్నాడు. ఓ దర్దరకా, ఇక్కడ హాస్యప్రసక్తి ఏమున్నది? …ఏమంటివి? – “వాగీశ్వరుడైన కవిని వాక్కులతో నర్చించుట, సముద్రమున మంచినీరు చల్లినట్లుందనియా” – అలా కాదు. వసంతమాసాన్ని పుష్పహారాలతో పూజించమా ఏమి? ఇది నీవు విని ఉంటావు –

(వాక్పురోభాగానామభాగీ భవ అని విటుడు సారస్వతభద్రకవికి ఇచ్చిన ఆశీర్వాదము. పురోభాగతా అంటే దోషైకదృక్కు. ఇది ఒక తిట్టు. వాక్కులలో పురోభాగములకు అభాగివి కమ్ము – అంటే తిట్టులకు నోచుకోకుందువు కాక అని అర్థం. ఇది వ్యంగ్యంగా ’అవిధవా భవ’ అన్న ఆశీర్వాదం లా అన్నట్టు అనిపిస్తుంది.

పీటమర్దుడంటే నాయకుని యొక్క విచక్షణుడైన సహాయకపాత్ర. ఉదాహరణ: రామాయణంలో సుగ్రీవుడు.)

సూర్యం యజన్తి దీపైః

సముద్రమద్భిర్వసన్తమపి పుష్పైః |

అర్చామో భగవన్తం

వయమపి వాగీశ్వరం వాగ్భిః ||

ఇతి | భవతు, దంశితస్తే పీటమర్దస్వభావః | సేవితోऽత్రభవాన్ | అపి చ వసన్తకాలోऽయమచ్ఛలః పరభృతప్రలాపానామ్ | ఈదృశా ఏవాస్తు భవాన్ | సాధయామ్యహమ్ | (పరిక్రమ్య విలోక్య) అయే అయమపరే విపులామాత్యః కామదత్తాప్రాకృతకావ్యప్రతిష్టానభూతః వైశికవృత్త్యాऽధోముఖః ప్రస్థితః | ఆ, గృహీతమ్ – ఏష దేవదత్తాసౌభాగ్యసంక్రాన్తే మూలదేవే విపులావమానాత్ ఆత్మానమవధీరితమవగచ్ఛన్ ప్రణయకృద్ధః ఖల్వేష ధాన్త్రః | భవతు పరిహాసప్లవేనైనమవగాహిష్యే | (నిర్దిశ్య) భోః సుహృత్ కుముదాననవబోధయన్ దివాచంద్రలీలయాऽతిక్రామసి | పృచ్ఛామస్తావత్ కిఙ్చిత్ |

దీపైః = దీపములచేత, సూర్యం = సూర్యుని, అద్భిః = నీటిచేత, సముద్రం = సముద్రమును, పుష్పైః = కుసుమముల చేత, వసంతం = వసంతకాలమును, అపి = కూడా, యజన్తి = పూజింతుము, వయమపి = మేమునూ, భగవంతం వాగీశ్వరం = మేమునూ మహాకవిని, వాగ్భిః = వాక్కులచేత అర్చామః = అర్చింతుము.

తాత్పర్యము: దీపములతో సూర్యుని, నీటితో సముద్రమును, పూలతో వసంతుని పూజించినట్లే మహాకవిని మేము వాక్కులతో అర్చింతుము. కానిమ్ము. నీ పీటమర్దుని స్వభావము చూపుకున్నావు. నీవిక్కడ సేవలు పొందుము. ఇంకా ఈ వసంతకాలంలో గండుకోయిలల గానములకు కొదవలేదు. నీవిట ఇలా ఉండుము. నేను వెడలుచున్నాను.

(ముందుకు నడచి, పరికించి)

అరే, ఈయన కామదత్తా అన్న ప్రాకృతకావ్యమును నిర్మించిన విపులామాత్యుడు. వేషము చూడగా తలవంచుకుని నడుచుచున్నాడు. ఆ తెలిసినది – మూలదేవ, దేవదత్తల విషయంలో తల దూర్చిన విపులావమానము వలన తను కూడా అవమానింపబడినట్లు భావించి ఈ మహానుభావుడు కుపితుడైనాడు. కానిమ్ము, పరిహాసప్లవనములతో ఈతనిని సమీపింతును. (సైగ చేసి) ఓ సహృదయా! పగటిచంద్రుడు కలువలను ముడుచుకునేలా చేసినట్టు నన్ను దాటి వెళ్ళుచున్నావు? కొంచెం నిన్ను అడుగుతాను.

(విశేషములు:  కామదత్తా ప్రాకృత కావ్య ప్రతిష్టానభూతః అని విపులామాత్యునికి విశేషణం చెపుతున్నాడు. ప్రాతిష్టానమంటే – ఏదో ప్రభుత్వోద్యోగమట. ఆమాత్య శబ్దం కూడా ఈయన ప్రభుత్వాధికారాన్ని సూచిస్తుంది. కామదత్తా - అన్న ప్రాకృతకావ్యమును శూద్రకుడు రచించి ఉంటాడని ఒకరిద్దరు ఇండాలజిస్టులు ’తెలివి’గా ఊహించారు. ఇంకా – విపులావమానము అంటే విపులా అన్న అమ్మాయి మూలదేవునికి, దేవదత్తకు మధ్య అదివరకు జరిగిన కథలో తలదూర్చి అవమానం పొందిన కథ. కాదంబరి కావ్యంలో బాణభట్టు చేసిన కర్ణీపుత్రుని ప్రస్తావనలో విపులా అన్న ప్రస్తావన వస్తుంది. మున్నుడి)

(తరువాయి భాగం వచ్చేవారం)

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.