COVER

అద్దం లోపల

.
వెన్నెల తాయిలమంతా తింటే తిన్నావు
చూడెలా అంటుకుందో తెల తెల్లగా
మధ్య మధ్య మబ్బుల్తో మొహం తుడుచుకోవద్దూ
.
కొమ్మ కొమ్మపైనా చిరునవ్వుల పిందెలే
అమ్మవుతున్నావన్న ఆనందమేమో
ఓ అడుగు ముందే చిలక్కొట్టేస్తే మాత్రం… చెదిరిపోవాలా ఏంటి
.
అద్దం లోపల ప్రతిబింబం నీది కాదా
సంస్కారపు అలంకారం కాస్త ఎక్కువైనట్టుందిలే
వద్దొద్దు చెరపకు… సమాజం మళ్ళీ గుర్తుపడుతుందో లేదో
.
అందమొక్కటే అద్దుకున్నావని
అర్థవంతం కాలేదని ఎందుకంత దిగులు
విడదీసి చూస్తే ఎంత పెద్ద మాలైనా పువ్వులై రాలిపోయేదేగా!

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, కవిత and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.