palaparthi cover

చార్జిం అయిపోయింది!

పాప ఆములు తినేసింది.

కప్పు నిన్నింది.

ఇంక దిద్దాయిలు పోవాలి.

అమ్మా అమ్మా అని పిలించింది.

కాస్త ఆగు నాన్నా.

సెల్ లో చార్జింగ్ పూర్తిగా అయిపోయింది.

అమ్మ సెల్ ఫోన్ చార్జర్ కోసం తెగ వెతికేస్తోంది.

టేబుల్ మీద

టీవీ పక్కన

బెడ్ రూం లో

ఎక్కడా లేదు.

పాప అమ్మ వెనకాలే తిరుగుతోంది.

అమ్మా అమ్మా

ఆగు తల్లీ! ఛార్జర్ కనిపించడం లేదు.

వంటింట్లో

అల్మరాలో

హాల్లో

అంతా వెతికేస్తోంది అమ్మ.

పాప తోకలా అమ్మ వెనకే తిరుగుతోంది.

అమ్మా అమ్మా అమ్మా!

ఆగు నాన్నా! ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది.

ఛార్జర్ కోసం చూస్తున్నాను.

నువ్వేమైనా ఆడుకోడానికి తీసావా?

లేదు! నేనసలు ముత్తుకోలేదు! నిజాయితీగా మొహం పెట్టి

చేతులు తిప్పుతూ చెప్పింది పాప.

సోఫాలో

పెరట్లో

అన్ని చోట్లా తిరిగేస్తోంది అమ్మ.

అమ్మా అమ్మా

అమ్మా!

ఏవిటి? ఆగలేవూ కాసేపు? 

కాదమ్మా! చూడు! నా కల్లల్లో చార్జిం అయిపోయింది!

అన్నది పాప మూతలు పడుతున్న తన కళ్ళను చూపిస్తూ.

అప్పుడు అమ్మ గబుక్కున సిగ్గు పడిపోయి

అయ్యో తల్లీ! నిద్ర  పోదూగానీ రారా నాన్నా!

అంటూ పాపని భుజాన వేసుకుని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి

జో అచ్చుతానంద

జో జో ముకుంద

పాడ్డం మొదలెట్టింది.

 *

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, చిట్టి చిట్టి మిరియాలు, సీరియల్ and tagged , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.