cover

‘సప్త’స్వర వినోదం – నవంబర్ 2014

ఈ సంచికలో ఇచ్చిన పాటల చరణాలన్నీ 1965 – 1975 మధ్యకాలంలో విడుదలైన చిత్రాల్లోవి. ఎప్పట్లానే ఆయా పాటల పల్లవులతో పాటువీటన్నిటినీ కలిపి ఉన్న అంతఃసూత్రం కనిపెట్టి మీరు పంపే జవాబుల్లో రాయండి. అంతఃసూత్రం ఏదైనా కావచ్చు – ఎవరైనా కావచ్చు. పూదండలో దారంలా ఈ ఏడు పాటలకు సంబంధించిన ఏకసూత్రం అయి ఉండాలి. మీ జవాబులు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. వాటిని ఫలితాలు వెలువడే వరకూ అప్రూవ్ చేయం. లేదా editor@kinige.com కు మెయిల్ చేయండి. సరైన జవాబులు చెప్పిన అందరి పేర్లూ కూడా ఫలితాల్లో ప్రస్తావిస్తాం.

1. 

ఏ నాటిదో గానీ.. ఆ రాధా పల్లవ పాణీ

ఏ మాయెనో గానీ.. ఆ పిల్లన గ్రోవిని విని.. విని -

ఏదీ ఆ యమునా…

యమున హృదయమున గీతిక

ఏదీ బృందావనమిక – ఏదీ విరహ గోపిక

క్లూ: 60 దశకం చివర్లో విడుదలైన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణ, జమున జంటగా నటించారు. కె.వి.మహదేవన్ స్వరాలందించారు.

2.

ఇన్నేళ్లకు విరిసె వసంతములు

ఇన్నాళ్లకు నవ్వెను మల్లియలు

నిదురించిన ఆశలు చిగురించెలే /ని/

చెలికాడే నాలో తలపులు రేపెనులే

క్లూ: కాంచన, రాజశ్రీలు ముఖ్యభూమికలు పోషించిన ఈ చిత్రంలో అక్కినేని హీరోగా మరింత అందంగా కనిపిస్తాడు. దాదాపు చిత్రంలోని పాటలన్నీ జనరంజకమే – సాలూరివారి బాణీలాయె మరి!

3.

బంగారు నగలేవీ పెట్టుకోనురా

పట్టంచు చీరలేవి కట్టుకోనురా

గుండెలో మొలకెత్తే గోరువెచ్చని వలపే

పెదవుల భరిణెలో పొదిగి ఉంచినానురా -

క్లూ: సునిల్‌దత్, నూతన్‌లు జంటగా బిమల్‌రాయ్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రానికిది మాతృక. అంటరానితనాన్ని ప్రశ్నించిన సినిమా.

4.

నీ పెదవీ కనగానే

నా పెదవీ పులకించిందీ ఎందుకనీ /నీ/

విడివిడిగా ఉండలేక.. విడివిడిగా ఉండలేక

పెదవులు రెండూ… అందుకనీ

ఎదురు చూసే పూలపానుపు

ఓపలేక ఉసురుసురన్నది ఎందుకనీ

ఇద్దరినీ తన కౌగిలిలో

ముద్దు ముద్దుగా… అందుకనీ

క్లూ: శోభన్‌బాబు ద్విపాత్రాభినయం. మహిళా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించిన చిత్రం. చక్రవర్తి బాణీలన్నీ సుమధురాలే.

5. 

మనసుంది ఎందుకనీ

మమతకు గుడిగా మారాలనీ

వలపుంది ఎందుకనీ

ఆ గుడిలో దివ్వెగ నిలవాలనీ

ఆఁ… మనువుంది ఎందుకనీ

ఆ దివ్వెకు వెలుగై పోవాలనీ

బ్రతుకుంది ఎందుకనీ…

ఆ వెలుగే నీవుగ చూడాలనీ…

క్లూ: దేవదాస్ కనకాల తొలిచిత్రం. చంద్రమోహన్, రోజారమణిలు జంటగా నటించిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చారు.

6.

ఎన్నడు అందని పున్నమి జాబిలీ

కన్నుల ముందే కవ్విస్తుంటే…

కలగా తోచి వలపులు పూచి… కలగా తోచి వలపులు పూచి

తనువే మరచి తడబడుతుంటే…

క్లూ: కృష్ణంరాజు, జయంతి, ప్రమీల తారాగణంతో వచ్చిన చిత్రం. సంగీతం టి. చలపతిరావు.

7.

కొమ్మల్లో ఉందిలే నా పైడి గూడు

రమ్మంటే వస్తానా అమ్మో నీ తోడు

నా గుండె పొదరింట నీ గూడు లేదా

ఆ గూటిలో నిన్ను దాచేను కాదా… దాచేను కాదా…

క్లూ: సి. నారాయణరెడ్డి రాసిన ఈ గీతానికి సంగీతం టి.వి.రాజు కూర్చారు. కాంచన, ఎన్.టి.ఆర్‌లు జంటగా నటించిన చిత్రం.

నిర్వహణ: ఇశైతట్టు

Posted in 2014, నవంబర్, స్వరం and tagged , , , , .

2 Comments

 1. 1. ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళీ –
  తొందర తొందరలాయె విందులు విందులు చేసే (ఉండమ్మా బొట్టు పెడతా)

  2. అందెను నేడె అందని జాబిల్లి
  ఆ అందాలన్నీ ఆతని వెన్నెలలే (ఆత్మ గౌరవం)

  3. సాకీ – తొలకరి మెరుపులా – తొలివాన చినుకులా
  ఈవేళ వచ్చావు ఎవరి కోసం? – ఇంకెవరి కోసం!?
  ఏమేమి తెచ్చావు ఈ బావ కోసం?
  పల్లవి – సన్నజాజి సొగసుంది – జున్నులాంటి వయసుంది
  నిన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంది (కాలం మారింది)

  4. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి
  ఆ వధువు వలపే విరిసేది ఈనాడే తొలిసారి (శారద)

  5. మల్లెకన్న తెల్లన మా సీత సొగసు
  వెన్నెలంత చల్లన మా సీత సొగసు (ఓ సీత కథ)

  6. ఎలా తెలుపనూ ఇంకెలా తెలుపనూ
  మదినిండా నీవె ఉంటె ఒక మాటైనా రాకుంటె (చిన్ననాటి కలలు)

  7. సాకీ – బృందావనములోన చిలకాలురా – చిలకాలు రత్నాల మొలకాలురా
  పండేమొ తిన్నాయి పలకాయిరా
  పల్లవి – పచ్చాపచ్చని చిలకా – హొయ్ చిలకా – పంచ వన్నెల చిలకా – హొయ్ చిలకా
  చల్లాచల్లని వేళ మెల్లామెల్లగ చేరా రావేమె నా రామచిలకా (కలసి వచ్చిన అదృష్టం)

  (ఏక సూత్రం – కె. విశ్వనాధ్ దర్శకత్వం)

 2. 1.

  ఏ నాటిదో గానీ.. ఆ రాధా పల్లవ పాణీ
  ఏ మాయెనో గానీ.. ఆ పిల్లన గ్రోవిని విని.. విని –
  ఏదీ ఆ యమునా
  యమున హృదయమున గీతిక
  ఏదీ బృందావనమిక ఏదీ విరహ గోపిక

  పల్లవి :
  ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి
  ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి
  తొందర తొందరలాయె.. విందులు విందులు చేసే
  ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి

  క్లూ: 60 దశకం చివర్లో విడుదలైన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణ, జమున జంటగా నటించారు. కె.వి.మహదేవన్ స్వరాలందించారు.
  2.
  ఇన్నేళ్లకు విరిసె వసంతములు
  ఇన్నాళ్లకు నవ్వెను మల్లియలు
  నిదురించిన ఆశలు చిగురించెలే
  చెలికాడే నాలో తలపులు రేపెనులే

  పల్లవి :
  అందెను నేడే అందని జాబిల్లి
  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
  అందెను నేడే అందని జాబిల్లి

  క్లూ: కాంచన, రాజశ్రీలు ముఖ్యభూమికలు పోషించిన ఈ చిత్రంలో అక్కినేని హీరోగా మరింత అందంగా కనిపిస్తాడు. దాదాపు చిత్రంలోని పాటలన్నీ జనరంజకమే సాలూరివారి బాణీలాయె మరి!
  3.

  బంగారు నగలేవీ పెట్టుకోనురా
  పట్టంచు చీరలేవి కట్టుకోనురా
  గుండెలో మొలకెత్తే గోరువెచ్చని వలపే
  పెదవుల భరిణెలో పొదిగి ఉంచినానురా –

  పల్లవి :
  ఓ… ఓ… తొలకరి మెరుపులా తొలివాన చినుకులా యీవేళ వచ్చావు
  ఎవరికోసం… ఇంకెవరికోసం
  ఏమేమి తెచ్చావు యీబావ కోసం
  సన్నజాజి సొగసుంది – జున్నులాంటి వయసుంది నిన్ను చూస్తేకరిగిపోయే వెన్నలాంటి మనసుందీ
  ఇంతకుమించి ఏమిలేదురా ! బావా, యీ బతుకే యింక నీదిరా !! బావా, యీ బతుకే యింక నీదిరా !!

  క్లూ: సునిల్‌దత్, నూతన్‌లు జంటగా బిమల్‌రాయ్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రానికిది మాతృక. అంటరానితనాన్ని ప్రశ్నించిన సినిమా.
  4.

  నీ పెదవీ కనగానే
  నా పెదవీ పులకించిందీ ఎందుకనీ /నీ/
  విడివిడిగా ఉండలేక.. విడివిడిగా ఉండలేక
  పెదవులు రెండూ అందుకనీ
  ఎదురు చూసే పూలపానుపు
  ఓపలేక ఉసురుసురన్నది ఎందుకనీ
  ఇద్దరినీ తన కౌగిలిలో
  ముద్దు ముద్దుగా అందుకనీ

  పల్లవి :
  కన్నెవధువుగా మారేది జీవితంలో ఒకేసారి
  ఆ వధువువలపే విరిసేది యీనాడే తొలిసారి
  అందుకే అందుకే తొలిరేయి. . . అంతహాయి ! అంతహాయి ! అంతహాయి !!

  క్లూ: శోభన్‌బాబు ద్విపాత్రాభినయం. మహిళా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించిన చిత్రం. చక్రవర్తి బాణీలన్నీ సుమధురాలే.
  5.

  మనసుంది ఎందుకనీ
  మమతకు గుడిగా మారాలనీ
  వలపుంది ఎందుకనీ
  ఆ గుడిలో దివ్వెగ నిలవాలనీ
  ఆఁ మనువుంది ఎందుకనీ
  ఆ దివ్వెకు వెలుగై పోవాలనీ
  బ్రతుకుంది ఎందుకనీ…
  ఆ వెలుగే నీవుగ చూడాలనీ

  పల్లవి :
  మల్లెకన్న తెల్లన మా సీత సొగసు
  వెన్నెలంత చల్లన మా సీత సొగసు
  ఏది ఏది ఏది
  తేనె కన్న తీయన మా బావ మనసు
  తెలుగంత కమ్మన మా బావ మనసు
  క్లూ: దేవదాస్ కనకాల తొలిచిత్రం. చంద్రమోహన్, రోజారమణిలు జంటగా నటించిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చారు.
  6.

  ఎన్నడు అందని పున్నమి జాబిలీ
  కన్నుల ముందే కవ్విస్తుంటే
  కలగా తోచి వలపులు పూచి కలగా తోచి వలపులు పూచి
  తనువే మరచి తడబడుతుంటే

  పల్లవి :
  ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
  మది నిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
  ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

  క్లూ: కృష్ణంరాజు, జయంతి, ప్రమీల తారాగణంతో వచ్చిన చిత్రం. సంగీతం టి. చలపతిరావు.
  7.

  కొమ్మల్లో ఉందిలే నా పైడి గూడు
  రమ్మంటే వస్తానా అమ్మో నీ తోడు
  నా గుండె పొదరింట నీ గూడు లేదా
  ఆ గూటిలో నిన్ను దాచేను కాదా దాచేను కాదా

  పల్లవి :
  పచ్చ పచ్చాని చిలక హోయ్ చిలక
  పంచా వన్నెల చిలకా చల్లా చల్లని వేళా
  మెల్ల మెల్లగ చేర రావేమే నా రామచిలుక

  క్లూ: సి. నారాయణరెడ్డి రాసిన ఈ గీతానికి సంగీతం టి.వి.రాజు కూర్చారు. కాంచన, ఎన్.టి.ఆర్‌లు జంటగా నటించిన చిత్రం.

  పైన పేర్కొన్నఅన్ని సినిమాలకు కళాతపస్వి కే.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.