cover

అక్టోబర్ నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

అక్టోబర్ నెల ‘సప్త’స్వర వినోదానికి జవాబులు ఒకరే చెప్పారు.  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులను కింద ఇస్తున్నాం.

1.

కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారగా
తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా
చిత్రం: చెల్లెలి కాపురం (1971)

2.

కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికీ మరువరాని తలపులు
రెండూ ఏకమై ప్రేమే లోకమై
నామది పాడే పరాధీనమై
చిత్రం: పెళ్లికానుక (1960)

3.

కనులు మాటలాడుననీ
మనసు పాట పాడుననీ
కవితలల్లితి ఇన్నాళ్లు
అవి కనుగొన్నాను ఈనాడు
చిత్రం: మాయని మమత (1970)

4.

కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమీ
ఆ కలలో నీవే కనబడితే
ఆ చొరవకు బదులేమీ…
చిత్రం: సుమంగళి (1965)

5.

కనులు పలకరించెను
పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత
సిగ్గులు చిగురించెను
చిత్రం: ఆడబ్రతుకు (1965)

6.

కనులు కనులు కలిసెను
కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనె
అసలు మనసు తెలిసెను
చిత్రం: మురళీకృష్ణ (1964)

7.

కన్నుల దాగిన అనురాగం
పెదవులపై విరబూయాలి
పెదవులకందని అనురాగం
మదిలో గానం చేయాలి
చిత్రం: రంగులరాట్నం (1966)

అంతఃసూత్రం: పాటల పల్లవులన్నీ కళ్లకు సంబంధించిన పదాలతో ఆరంభం కావడం.

*

అన్నింటికి సరైన జవాబు పంపినవారు: ఎ.వి. రమణమూర్తి

సంగీతాభిమానులకు మరో ‘సప్త’స్వర వినోదం సిద్ధం.

 *

Posted in 2014, నవంబర్, స్వరం and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.