cover

పద్మప్రాభృతకమ్ (5)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

కలావిజ్ఞానసంపన్నా గర్వైకవ్రతశాలినీ |

న ఖల్వత్యన్తధీరా సా ఖిన్నా తే విపులా మతిః ||

కిం బ్రవీషి – “గృహీతో వఙ్చితకస్యార్థః | కిం తవాచార్యో మూలదేవో న జ్ఞాయత” ఇతి | మా మైవమ్ | దేవదత్తాసురతసంక్రాన్తస్యాపి విపులాగతమేవ హృదయమ్ | కిం బ్రవీషి – “తదపి మూలదేవీయం శాఠ్యమ్” ఇతి | ఆమ్, భవాన్ ఖలు సత్యార్జవః కిమిదానీం స్వశిష్యాం విపులాం నోపలభతే యయా ప్రణయకోపార్థమధిగతః కర్ణీపుత్రః -

ప్రాప్త ఇవ శరత్కాలః ప్రావృట్కలుషాం నదీం ప్రసాదయితుమ్ |

క్షిప్తః కదర్థయిత్వా హేమన్తే తాలవృన్త ఇవ ||

కళావిజ్ఞానసంపన్నా = కళలయొక్క విశేషజ్ఞానముచేత సంపన్నమైనది, గర్వైకవ్రతశాలినీ = గర్వమునే దీక్షగాకలిగినది, అత్యన్తధీరా = గంభీరమైనది, తే = నీయొక్క, సా విపులా మతిః = ఆ విపులమైన బుద్ధి, (విపుల అనే స్త్రీ హితమునందు శ్రద్ధవహించిన బుద్ధి)న ఖిన్నా ఖలు = ఖిన్నము కాలేదు కదా!

తాత్పర్యము: కళావిజ్ఞానసంపన్నమైనది, గర్వమే వ్రతముగ గలిగినది, గంభీరమైనది ఐన నీ విపులమైన మతి దుఃఖమునొందలేదు కదా.

విశేషము: అనుష్టుప్పు. శ్లోకే షష్ఠం గురుజ్ఞేయం సర్వత్ర లఘుపంచమమ్ |

ద్విచతుష్పాదయోః హ్రస్వం సప్తమం దీర్ఘమన్యయోః ||

(నాలుగు పాదములు. అన్ని పాదాలలో ఐదవ అక్షరం లఘువు, ఆరవ అక్షరం - గురువు. రెండు, నాలుగు పాదాలలో ఏడవ అక్షరం లఘువు. ఒకటి, మూడు పాదాల్లోనేమో ఏదవ అక్షరం గురువు కావాలి)

ఏమంటావు – “వ్యంగ్యమర్థమైనది. నీ గురువు మూలదేవుడు తెలుసుకోలేదా” అనియా? – అలా కాదు. దేవదత్తతో శృంగారముల దేలియాడిననూ యాతని హృదయము విపులాగతమే అయినది. ఏమంటావు – అది కూడా మూలదేవుని మోసమే” అనియా. అవును. మీరే సత్యసంధులు. మీ శిష్యురాలు విపులనే పొందరాదా? ఆమె ప్రణయకోపాన్ని కర్ణీపుత్రుడు అనుసరించినట్టుగా?

ప్రావృట్కలుషాం = వర్షాలతో కలుషితమైన, నదీం = నదిని, ప్రసాదయితుం = తేటపర్చుటకు, శరత్కాలః ఇవ = శరత్కాలము వలె ప్రాప్తః = వచ్చినది. హేమన్తే = హేమంతమున, తాళవృంత ఇవ = తాడిచెట్టులా, కదర్థయిత్వా = నీటిని మలినపరచుచూ, క్షిప్తః = తోయబడినది.

తాత్పర్యము: వర్షాకాలంలో వరదనీటిని శరత్తు తేటపరుస్తుంది. ఆ తేటవర్చిన నీటిలో హేమంతములో తాడిచెట్టు నీటిని మలినపరచుచూ(కాయలను) విదల్చుతుంది. (అలా నీవు ఆమెను ఓదార్చుము). ఆర్యా.

కిం బ్రవీషి – “కదా కథమ్” ఇతి | సఖే శ్రూయతామ్ | నను కతిపయాహమివాద్య మద్ద్వితీయః కర్ణీపుత్రో విపులామనునేతుమభిగతః | అథ ద్వారకోష్టకస్థేనానేన క్రోధాగాధపరీక్షార్థమహమాదితః సోపగ్రహం కల్పితః | సోऽహం ప్రియవచనోపన్యాసేనాభిగతశ్చైనామ్ | సాऽపి చేర్ష్యాదోషదూషితలావణ్యా దృష్ట్వైవ మాం ’కుతోऽయమాయాస’ ఇత్యుక్త్వా పరాఙ్ముఖీ సంవృత్తా | తతః సపరిహాసముక్తా మయా -

కిముక్తా కేన త్వం ప్రతివచ ఇదం కస్య వచసః

తదావృత్తా భూత్వా వద వదనచంద్రేణ వనితే |

ప్రసన్నాం త్వాం దృష్ట్వా భవతి హి మమ ప్రీతిరతులా

భుజఙ్గీవ కృద్ధా భ్రుకుటిరియముద్వేజయతి మామ్ || ఇతి

తదనన్తరమవన్తిసుందర్యా సఖ్యాऽభిహితా –

ఏమంటావు – “ఎలా అది?” అనియా? విను మిత్రుడా. కొన్ని రోజుల ముందులా ఈ రోజూ కర్ణీసుతుడు నాతోబాటు విపులననునయించుటకు నామె వద్దకు వచ్చెను. ఆమె ఇంటి వాకిలి ముందు విపుల కోపతీవ్రతను తెలుసుకోవటానికి నన్ను ముందుగా పంపెను. నేను మధురభాషణాలతో ఆమె వద్దకు వెళ్ళితిని. ఆమె కూడా ఈర్ష్యాదోష దూషిత లావణ్యాలచేత నన్ను ’ ఎందుకింత శ్రమ’ అని పలికి ముఖం తిప్పుకున్నది. అప్పుడు నేను పరిహాసపూర్వకంగా ఇలా అంటిని -

వనితే = యువతీ, త్వం = నీవు, కిముక్తా = ఏమంటివి? ఇదం ప్రతివచః = ఈ ప్రతివచనము, కేన = ఎందుకు?, కస్య వచసా = ఎవని మాటలచేత, తదావృత్తా భూతా = ఆవరింపబడితివి? వదనచంద్రేణ = ముఖచంద్రునితో, వద = పలుకుము. ప్రసన్నాం = కోపము లేని దానివైన, త్వాం = నిన్ను దృష్ట్వా = చూచి, మమ ప్రీతిః = నా అనురాగము, అతులా భవతి హి = ఎక్కువగును కదా. భుజంగీవ = సర్పము వలె (భుజంగీ అంటే వేశ్య అని మరొక అర్థం. ఇక్కడ శ్లేష) కృద్ధా = కుపితయై, ఇయం భృకుటిః = ముడిచిన కనుబొమలు గదిగా, మాం= నన్ను, ఉద్వేజయతి = ఉద్వేగపర్చుచున్నావు.

తాత్పర్యము: వనితా, ఏమంటివి? ఎందుకీ మాట? ఎవనిమాటలకు ఈ జవాబు? చంద్రబింబము వంటి ముఖమును తిప్పుకొనక బదులు చెప్పుము. ప్రసన్నవైన నిను చూచి నా అనురాగము ఎక్కువగును. కనుబొమలు మడిచి, కోపించి, సర్పం లా నన్ను ఉద్వేగపరుస్తున్నావు.

విశేషములు: స్వభావోక్తి అలంకారం. భుజంగీ అన్న ప్రయోగం అర్థశ్లేష. శిఖరిణీ. (పాదమునకు పదిహేడక్షరములు. య మ న స భ లఘువు గురువు. రసైః రుద్రైశ్ఛిన్నా యమనసభలా గః శిఖరిణీ || 6, 11 యతి)

తదనంతరము ఆమె సఖి అవంతిసుందరి ఇలా చెప్పింది –

కిం కృత్వా భృకుటీతరఙ్గవిషమం రోషోపరక్తం ముఖం

నిఃశ్వాసజ్వరితాధరం ప్రియసఖం ప్రాప్తం న సంభాషసే |

సౌభాగ్యేన హి శత్రుకర్మ కురుషే స్త్రీగర్వమేధావిని

మానం మానిని ముఙ్చ సర్వమచిరాదత్యాయతం ఛిద్యతే || ఇతి

అథ గుణవతీ పరిషదితి కృత్వా కర్ణీపుత్రోऽభిగతః | స చానయా పణిపాతావనతః సరోషమవధూయాభిహతః –

కృత్వా విగ్రహమాగతోऽసి నియతం నిర్వాసితో వా తయా

కాన్తాలాపవినోదనే కిల వయం విశ్రామభూమిస్తవ |

కిం నైరాశ్యనిరుత్సుకస్య మనసః సంధుక్షణైర్మే పునః

ప్రీతేనాత్ర కిమౌషధేన కటునా సుస్వాగతం గమ్యతామ్ || ఇతి |

భృకుటీతరంగవిషమం = నొసటి వెక్కిరింత తో విషమమై, రోషోపరక్తం ముఖం = రోషము చేత ముఖమును ఎర్రగా, నిఃశ్వాసజ్వరితాధరం = నిట్టూర్పులతో పెదవి కాగునట్లు, కృత్వా = చేసి, ప్రాప్తం ప్రియసఖం = వచ్చిన ప్రియమిత్రుని, కిం న సంభావసే = ఎందుకు మర్యాదచేయవు?, స్త్రీగర్వమేధావిని = యువతీగర్వమనే మేధను కలిగినదానా, సౌభాగ్యేన హి = నీ ఈ సౌభాగ్యము చేతనే, శత్రుకర్మ = శత్రుత్వమును, కురుషే = చేయుచున్నావు. మానిని = మానవంతురాల, మానం = అభిమానమును, ముఙ్చ = విడువుము, అవిచారాత్ = మాగా ఆలోచింపక, ఆయతం = లాగబడినది, సర్వం = ఏదైనా, ఛిద్యతే= తెగుతుంది.

తాత్పర్యము: నొసటి వెక్కిరింతతో విషమమై, రోషంతో ఎర్రనైన ముఖమును, నిట్టూర్పులతో పెదవిని కాగనిస్తూ, వచ్చిన మిత్రుని సంభావింపకనున్నావు. గర్వమునే మేధస్సు అనుకొను యువతీ, ఈ విధముగా చేసి శత్రుత్వముమొనర్చుచున్నావు. మానినీ, అభిమానము విడుము. ఆలోచింపక, కడదాకా లాగిన విషయము తెగుతుంది.

విశేషములు: ఖండిత అను శృంగారనాయిక లక్షణము. (శార్దూల వృత్తము - మ స జ స త త గ)

అప్పుడు ఎదురుగా మాటలాడి సామరస్యముగా తేల్చుటకై కర్ణీపుత్రుడు అక్కడికి వచ్చెను. తలదించుకుని ఉన్న అతనితో నామె రోషముగనిట్లనెను.

నియతం = ఖచ్చితముగ, తయా = ఆమెచేత, నిర్వాసితః = గెంటింపబడి, వా = లేక, విగ్రహం కృత్వా = పోట్లాడి, ఆగతః అసి = వచ్చినాడవు. వయం = మేము, తవ = నీయొక్క, కాన్తాలాపవినోదినే = స్త్రీవిషయవినోదవిషయమునను, విశ్రామభూమిః = విశ్రాన్తి ప్రదేశమును, కిల = అట! నైరాశ్యనిరుత్సుకస్య = నైరాశ్యనిరుత్సాహకమైన, మే = నాయొక్క, మనసః=

కిం బ్రవీషి – “యద్యేవం తామేవావినీతాం తావదేనాముపాలబ్ధుం గచ్ఛామి” ఇతి | ఛన్దతః తథా గృహీతవాక్యో భవానస్తు | సాధయామస్తావత్ |

(పరిక్రమ్య)

హా ధిక్ అపరం మూర్తిమత్ గమనవిఘ్నముపస్థితమ్ | ఏష హి పాణిని పూర్వకో దన్దశూకపుత్రో దత్తకలశిర్నామ వైయాకరణః ప్రతిముఖమేవోపస్థితోऽస్మాన్ | అపీదానీమవిఘ్నేనాస్య వాగ్వాగురాముత్తరేయమ్ | సంరబ్ధమివైనం పశ్యామి | ఆమ్ వాద విధట్టితేనానేన భవితవ్యమ్ | తథా హి| అస్య కలహకణ్డూబంధురా వాగీషదపి స్పృష్టా దేవకులఘణ్టేవానుస్వనతి |

మనస్సునకు, పునః = మరల, సంధుక్షిణైః = రగిలింపబడుట, కిమ్ = ఎందుకు? అత్ర = ఇక్కడ, ప్రీతేన = ప్రీతిగా, కటునా ఔషధేన = కటువైనమందువలన, కిమ్ = ఎందుకు? (ప్రయోజనమేమి?), సుస్వాగతం = సుఖముగా వచ్చినారు, గమ్యతామ్ = వెళ్ళుదురు గాక!

తాత్పర్యము: ఖచ్చితముగా ఆమెచేత (దేవదత్త చేత?) గెంటించుకుని పోట్లాడి ఇక్కడికి వచ్చినాడవు. మేము నీ స్త్రీవినోదవిషయకము, విశ్రామభూమియునూ యన్నమాట! ఇదివరకే నిరాశా నిస్పృహలతోనున్న నా మనసు తిరిగి రగుల్చుట ఎందుకు? ప్రీతిగా కటువైన మందు త్రాపించుట ఏ యవసరమున? ఎలా వచ్చినారో అలా తిరిగి పొండు.

ఏమంటివి – “ సరే, నీవట్లనిన ఆమెనే పొందుటకు వెళ్ళుచున్నాను” అనియా. మనసు విప్పి ఆమె తో మాట్లాడుము.. ముందుకేగెదము గాక.

(ముందుకు నడచి)

హా ధిక్! మా బాటలో ఇంకొక వ్యక్తి రూపమైన విఘ్నము వచ్చెను. నా ముందు నిలచిన ఇతడే దందశూకపుత్రుడైన పాణినిదత్తకలశుడను వైయాకరణుడు. ఇప్పుడితనికి బెడదలేకుండగ చక్కగ బదులీయవలెను. గాభరాగా పోవుచున్నటున్నాడు. ఆ, దిట్టతనముగ మాటలాడునితనితో నిదివరకు యనుభవమే. అలాగేను. కలహప్రియుడైన ఈతనిని కదిపిన మందిరమున ఘంటలవలె మాటలు వినబడును.

ప్రియగణికశ్చైషా ధాన్త్రః | తాం కిల నూపురసేనాయా దుహితరం రశనావతికాం నామ వ్యపదిశతి | భోః కష్టమ్ | కరభకణ్ఠావసక్తం వల్లకీమివ శోచామి తాం రశనావతికామ్ | ఏష ఉద్యామ్యాగ్రహస్తమభిభాషత ఏవాస్మాన్ |

కిమాహ భవాన్ – అపి సుఖమశయిష్టాః” ఇతి | కా గతిః, భవతు సమాజయిష్యామ్యేనామ్ | స్వాగతమక్షరకోష్టాగారాయ | వయస్య దత్తకలశో సంరబ్ధమివ త్వాం పశ్యామి | కఙ్చిత్ కుశలమ్ | కిం భవానాహ – “ఏషోऽస్మి బలిభుగ్భిరివ సంఘాతవలిభిః కాతన్త్రికైరవస్కన్దితః “ ఇతి | హన్త ప్రవృత్తం కాకోలుకమ్ | సఖే దిష్ట్యా త్వామలూనపక్షం పశ్యామి” ఇతి | యథాతథాऽస్తు భవతః | సాధయామ్యహమ్ |

కిం బ్రవీషి – “క్వ సంచిచీర్షుః, తిష్ట తావత్, కిమసి దుద్రుష్టః”ఇతి |

ఈ చపలుడు గణికాప్రియుడునూ. నూపురసేన కూతురయిన రశనావతి తన ప్రియురాలని చెప్పుచుండును.ఆహ్, కష్టము. ఊహిస్తే, ఇతనికి ఆ రశనావతి ఒంటె మెడకు వేలాడుతున్న వీణలా అనిపిస్తుంది. ఈతడు చేయెత్తి చూపుతూ అంటున్నాడు -

(కరభకంఠావసక్తం – కరభం అంటే ఒంటె అని ఒక అర్థం. చిటికెనవ్రేలి చివర క్రింది భాగపు అరచేతిని కూడా కరభం అంటారు. ఆ ప్రాంతాన్ని స్త్రీ ఊరువులతో ఉపమించడం కావ్యాలలో కద్దు. కరభోపమోరు – భట్టనారాయణుని వేణీసంహారం, ద్వితీయాంకం. ఇక్కడ కరభకంఠావసక్తం అంటే - కరభకంఠం చివర వేలాడుతున్న వీణ – ఒంటె మెడ చివరన వేలాడు వీణ. వైయాకరణులను, శాస్త్రాధ్యయనపరులను జడులుగా పేర్కొనడం కొన్ని నాటకాదులలో జరిగింది. ఇక్కడ అదే ధోరణి.)

ఎమనుచున్నారు మీరు – ’సుఖముగ నిద్ర జరిగినదా?” అనియా? ఇక తప్పేదేముంది, ఇతనితో కొంత లోకాభిరామాయణం జరుపుతాను. – అక్షరకోశాగారాధిపతికి స్వాగతము. కలశము చేతబట్టుకుని గాభరాగ నున్నట్టున్నారు. పర్వాలేదు. కుశలమే. ఏమన్నారు – ’బలి అన్నం (లేదా పిండము) తినే కాకిలా కాతంత్రవ్యాకరణం నా నెత్తిపై పడింది’ అనియా? హా, కాకోలుకం అయిందీ. మిత్రమా, సంతోషం. నిన్ను ముసుగేదీ లేకుండా చూస్తున్నాను. ఏమన్నావు – “ఏమిది నా కాతంత్రవైయాకరణులకు కాతంత్రములో వినోద”మనియా. నువ్వెలా అంటివో అలానే. ముందుకేగుచున్నాను.

(కాతంత్ర వ్యాకరణం : గుప్తుల కాలంలో ప్రాచుర్యంలో ఉన్న వ్యాకరణ శాస్త్రం. ఈ వ్యాకరణానికి కుమారస్వామి కర్త అని ఐతిహ్యం..నాడు పాణిని వ్యాకరణానికి, కాతంత్ర వ్యాకరణానికి మధ్య గొడవలు నడిచేవిట. కాకోలుకం అయింది – ఇక్కడ ఆ వైయాకరణిని గుడ్లగూబతో పోలుస్తున్నాడు.)

ఏమంటివి – “ఎక్కడ వెళ్ళాలని ముచ్చటపడుతున్నావూ? ఆగిక్కడ. ఉరకలు పరుగులెందుకు?” అనియా.

హా ధిక్, ప్రసీదతు భవాన్ | నార్హస్యస్మాన్ ఏవంవిధైః కాష్టప్రహారనిష్టురైర్వాగశనిభిరభిహన్తుమ్ | సాధు, వ్యావహారికయా వాచా వద | అభాజనం హి వయమీదృశానాం కరభోద్గారదుర్భగానాం శ్రోత్రవిషనిషేకభూతానాం వైయాకరణవాగ్వ్యవసానామ్ | కిం బ్రవీషి – “కథమహమిదానీమనేకవావదూకవాదివృషభవిఘట్టనోపార్జితానామ్ అనేకధాతుశతఘ్నీం వాచముత్సృజ్య స్త్రీశరీరమివ మాధుర్యకోమలాం కరిష్యామి” | అహో, అనాథః ఖల్వసి | కుతః -

స్వైరాలాపే స్త్రీవయస్యోऽపచారే

కార్యారంభే లోకవాదాశ్రయే చ |

కం సంశ్లేషః కష్టశబ్దాక్షరాణాం

పుష్పాపీడే కణ్ఠకానాం యథైవ ||

హా ధిక్, కరుణింతురు గాక. ఇలా నన్ను గట్టి కర్రదెబ్బలతో, పిడుగుపాటువంటి వాక్కులతో చావుదెబ్బకొట్టడం మీకు యుక్తం కాదు. సులభమైన వ్యావహారికమైన మాటలలో చెప్పండి. ఈ విధమైన భరించలేని ఒంటె త్రేపులవంటి సుదీర్ఘసమాసాల చేత, చెవికి సూదిపోటులవంటివాటిచేత, వైయాకరణుల వాగ్వ్యసనవ్యాపారాలచేత హింసించకండి. ఏమంటున్నారు – “ఎలా ఇప్పుడు నేను అనేకవాదనల వాదముల వృషభ పదఘట్టనలతో సంపాదించిన శబ్దములను, ధాతుశతఘ్నులను, కూడిన మాటలను వదిలి తరుణితనువు లాంటి కోమలమాధుర్యమంగా వాక్యములు కూర్చగలను?” – అహో, మీరు తప్పక అనాథలు. ఎందుకంటే -

(ధాతుశతఘ్నులు - శతఘ్ని - అంటే నూరు మందిని లేదా అనేకమందిని ఒకే సారి చంపగల ఆయుధం. మందుగుండి దట్టించి ఫిరంగి పేల్చటం ఈ కావ్యకాలానికి బహుశ ఉండదు. అయితే అలాంటిదేదో మరొక ఆయుధం నాడు ఉండాలి.)

స్వైరాలాపే = స్వేచ్ఛగా ఆడు మాటలలో, స్త్రీ వయస్య ఉపచారే = మిత్రుడు మరియు, స్త్రీలతో ఉన్నప్పుడు, కార్యారంభే = పనులు మొదలెట్టడంలో, లోకవాదాశ్రయే చ = లోక, న్యాయవ్యవహారాలలో, కష్టశబ్దాక్షరాణాం = కఠినమైన శబ్దాక్షరాల యొక్క, సంశ్లేషః = కూడిక, కః = ఎక్కడ? యథా = ఎట్లు, పుష్పాపీడే = పూలను గుచ్చడంలో, కంటకానాం ఇవ = ముళ్ళ వలె.

తాత్పర్యము: ముచ్చటలాడేప్పుడు, మిత్రుడు మరియు ప్రియురాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, ముఖ్యమైన పనుల్లో, బయట పనులప్పుడూ, న్యాయవ్యవహారాల్లో, కష్టపడి కటువైన మాటలతో మాట్లాడ్డం ఎందుకు? పూలను గుచ్చి మాలచేసేప్పుడు ముళ్ళు అడ్డువచ్చినట్టుగాను?

విశేషములు: పుష్పాపీడే కంటకానాం యథా – ఉపమాలంకారం. (వారిజాక్షులందు వైవాహికములందు…గుర్తుకు రావటం లేదూ). కార్యారంభే - గుప్తుల కాలంలో కార్యము అన్న శబ్దాన్ని న్యాయవ్యవహారాల్లో విశేషార్థంలో ఉపయోగించేవారుట. న్యాయం కోసం అర్జీ పెట్టుకోవడం కార్యారంభం. శాలినీవృత్తము.శాలిన్యుక్తా మ్తౌ త గౌ గోబ్ధి లోకైః (మ త త గగ) 4, 7 యతిస్థానాలు.

(తరువాయి భాగం వచ్చేవారం)

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, నవంబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.